ధన్యవాదాలు
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో వివరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిసెంబరు 11న కలిసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అంగీకారం తెలిపింది. ఈ మేరకు కవితకు సీబీఐ ఈమెయిల్ పంపించింది.
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఉత్తర్ ప్రదేశ్ మథురలో షాహీ ఈద్గా మసీదు ఎదుట హనుమాన్ చాలీసా చదువుతానని వచ్చిన హిందూ మహాసభ నాయకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు వచ్చిన 40 మంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మథుర శ్రీకృష్ణ జన్మభూమి ఆవరణలో ఉండే ఈ మసీదు ఎదుట హనుమాన్ చాలీసా చదివి వినిపిస్తామని వీరు మీడియాతో చెప్పారు.
మరోవైపు మరో ఏడు లేదా ఎనిమిది మంది హిందూ మహాసభ నాయకులకు కూడా గృహ నిర్బంధం విధించినట్లు పోలీసులు తెలిపారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు 30 ఏళ్లు పూర్తికావడంతో మథుర షాహీ ఈద్గా మసీదు ఎదుట హనుమాన్ చాలీసా చదవడానికి రావాలని అఖిల భారతీయ హిందూ మహాసభ తమ నాయకులకు పిలుపునిచ్చింది.
దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో వివరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిసెంబరు 11న కలిసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అంగీకారం తెలిపింది. ఈ మేరకు కవితకు సీబీఐ ఈమెయిల్ పంపించింది.
దిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని తొలుత కవితకు సీబీఐ నోటీసులు పంపించింది.
ఈ కేసులో కేంద్ర హోం శాఖ ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని సీబీఐకి కవిత లేఖ రాశారు. దీనికి స్పందిస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్‌సైట్లో ఉందని సీబీఐ అధికారులు ఆమెకు మెయిల్ పంపించారు.
దీనిపై న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం సీబీఐ అధికారులకు కవిత ఒక లేఖ రాశారు.
‘‘ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లు సహా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో నా పేరు ఎక్కడా లేదు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన నేను సీబీఐ అధికారులను కలుసుకోలేను. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని మా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటాను. దర్యాప్తుకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశమవుతాను. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరుతున్నాను. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. దర్యాప్తుకు సహకరిస్తాను’’అని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. దీన్ని ఈమెయిల్ ద్వారా పంపారు.
ప్రస్తుతం కవిత లేఖకు సీబీఐ స్పందించింది. 11వ తేదీన హైదరాబాద్‌లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని తెలిపింది.
భారత జీడీపీ వృద్ధి రేటును 2022-23 ఆర్థికసంవత్సరానికి 6.9శాతంగా ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.
గతంలో 6.5శాతంగా అంచనా వేసిన ప్రపంచబ్యాంకు తాజాగా దీన్ని పెంచింది.
దేశంలో ఆర్థికకార్యకలాపాలు బాగా పెరిగినందున తమ అంచనాలను సవరించినట్లు ప్రపంచబ్యాంకులో సీనియర్ ఆర్థికవేత్తగా పని చేస్తున్న ధ్రువ్ శర్మ అన్నారు.
మహారాష్ట్రలో ఒక చిన్న పాపను రేప్ చేశాడనే ఆరోపణలతో షానవాజ్ షా అనే 19ఏళ్ల యువకున్ని అరెస్టు చేసినట్లు పాల్ఘర్ పోలీసులు తెలిపారు.
పాల్ఘర్‌లోని తన ఇంటి బయట 5ఏళ్ల పాప ఆడుకుంటూ ఉండగా చాక్లెట్ ఆశ చూపించి, ఆ పాపను షానవాజ్ తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పాపకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
విజయవాడలో ఇద్దరు వైసీపీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు.
వంశీరామ్ బిల్డర్స్ అనే కంపెనీకి సంబంధించిన ఆదాయ పన్ను తనిఖీల్లో భాగంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇళ్ల మీద ఐటీ అధికారులు దాడులు జరిపారు.
మథురలోని ‘శ్రీ కృష్ణ జన్మభూమి’ కాంప్లెక్స్-షాహీ ఈద్గా మసీదు మైదాన్‌లో హనుమాన్ చాలీసా పఠించాలంటూ అఖిల భారత హిందూ మహాసభ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో మథురలోని అన్ని ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు భద్రత పెంచారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.