లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
ప్రస్తుతం యుక్రెయిన్ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణించొద్దని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచనలు జారీ చేసింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, Facebook/Suella Braverman MP
బ్రిటన్ హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రావెర్మన్ తన పదవికి రాజీనామా చేశారు.
బ్రిటన్‌లో పన్నులకు సంబంధించి ఆ దేశ ప్రధాని లిజ్ ట్రస్ ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు. టోరీ ఎంపీలలో చాలా మంది ఆమె విధానాలను వ్యతిరేకిస్తున్నారు.
బ్రిటన్ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు తాజా నివేదికలు తెలుపడంతో లిజ్ ట్రస్‌కు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
అయితే బ్రావెర్మన్ రాజీనామా చేయడానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.
భారత సంతతికి చెందిన ఈమె తల్లిది తమిళనాడు.
ప్రస్తుతం యుక్రెయిన్ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణించొద్దని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచనలు జారీ చేసింది.
సాధ్యమైనంత త్వరగా భారత దేశ పౌరులు, విద్యార్థులు యుక్రెయిన్ విడిచి పోవాలని తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆన్లైన్ ట్రావెల్ కంపెనీలు మేక్ మై ట్రిప్, గోఐబిబోలతోపాటు హోటల్ బుకింగ్ సంస్థ ఓయోకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) జరిమానా విధించింది.
మార్కెట్లో పోటీ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో సుమారు రూ.392 కోట్లు ఫైన్ వేసింది.
మేక్ మై ట్రిప్, గోఐబిబోలకు కలిపి రూ.223.48 కోట్లు జరిమానా విధించగా ఓయోకు రూ.168.80 కోట్ల జరిమానా విధించారు.
బుకింగ్ ధరలకు సంబంధించి హోటళ్లతో మేక్ మై ట్రిప్, గోఐబిబో చేసుకున్న ఒప్పందాన్ని సీసీఐ తప్పు పట్టింది. ఆ ఒప్పందం ప్రకారం, ఒక నిర్ణీత ధరకు హోటళ్లతో మేక్ మై ట్రిప్, గోఐబిబో ఒప్పందం చేసుకుంటాయి.
అయితే హోటళ్లు ఆ నిర్ణీత ధర కంటే తక్కువకు తమ వెబ్సైట్లో లేదా ఇతర ఆన్లైన్ ట్రావెల్ వెబ్సెట్స్లో గదులను అద్దెకు ఇవ్వడానికి లేదు.
అలాగే తన వెబ్సైట్లో ఓయోకు ప్రయోజనం చేకూర్చేలా మేక్ మై ట్రిప్ వ్యవహరించిందనేది మరొక ఆరోపణ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, GETTY IMAGES
మియాన్మార్లోని యాంగాన్‌లో ఉన్న ఇన్సెన్ జైలులో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇందులో కనీసం ఎనిమిది మంది చనిపోయారు.
బుధవారం ఉదయం జైలు ప్రవేశ ద్వారం వద్ద రెండు పార్శిల్ బాంబులు పేలాయని, ముగ్గురు జైలు సిబ్బంది, ఐదుగురు సందర్శకులు మరణించారని స్థానికులు బీబీసీకి తెలిపారు.
ఇన్సెన్ జైలు దేశంలోనే అతి పెద్దది. ఇందులో దాదాపు 10 వేల మంది ఖైదీలు ఉన్నారు. అనేక మంది రాజకీయ ఖైదీలు కూడా ఈ జైలులోనే ఉంచారు.
ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. జైలులోని పోస్ట్రూమ్లో బాంబు పేలినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ప్లాస్టిక్ సంచిలో చుట్టిన లైవ్ బాంబ్ ఒకటి అధికారులకు దొరికింది.
జైలు సిబ్బందితో పాటు ఖైదీలను కలిసేందుకు వచ్చిన అయిదుగురు వ్యక్తులు మరణించారని, వారంతా మహిళలేనని అధికారులు ధృవీకరించారు.
విద్యార్థి నాయకుడు జేమ్స్ తల్లి కూడా బాంబు దాడిలో మరణించిన అయిదుగురు సందర్శకులలో ఒకరు. ఆమె తన కొడుక్కి అన్నం అందించేందుకు జైలుకు వచ్చారు.
శతాబ్దాల కిందట నిర్మించిన ఈ ఇన్సెన్ జైలులో ఖైదీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారని మానవ హక్కుల సంఘాలు విమర్శలు చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు.
ఆయనకు 7,897 ఓట్లు రాగా శశిథరూర్‌కు సుమారు 1000 ఓట్లు పోలయ్యాయి.
పోలైన ఓట్లలో 416 తిరస్కరణకు గురయ్యాయని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ-గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడయ్యారు.
చివరిసారిగా 1998లో గాంధీయేతర కుటుంబం నుంచి సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఆయన తర్వాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.
ప్రస్తుత ఎన్నికలలో కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన నాయకుడు శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.
137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది.
చివరిసారిగా 2000లో సోనియాగాంధీ, జితేంద్ర ప్రసాద మధ్య ఈ ఎన్నిక జరగగా, సోనియాగాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఖర్గే కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3
తెలంగాణలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు.
నర్సయ్య గౌడ్ గతంలో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచారు.
తాజాగా ఆయన, మరికొందరు టీఆర్ఎస్ నాయకులు దిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో బీజేపీలో చేరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత ప్రభుత్వం విభజన చట్టం ద్వారా ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాహుల్ గాంధీ అన్నారు.
‘రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతి కావాలి. భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామలు అన్నింటినీ అమలు చేయాలి’ అన్నారాయన.
‘కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం. పార్టీ నాయకులు అంతా ఆయనకే రిపోర్ట్ చేయాలి, నాతో సహా. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ అనుభవజ్ఞులే’ అన్నారు.
ప్రధాన మంత్రి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టడం ఎప్పుడైనా చూశారా? అని రాహుల్ ప్రశ్నించారు.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే వైసీపీ మద్దతు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పొత్తులు పెట్టుకోవడంపై అధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు రాహుల్ గాంధీ.
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశం గురించి మాట్లాడుతూ విభజన చట్టంలో భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఒకటేనని, అది అమరావతి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా ఏపీలో పాదయాత్ర చేస్తున్న ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన రాజధాని అమరావతి అంశాన్ని ప్రస్తావించారు.
కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థి శశిథరూర్ ఎలక్షన్ ఏజెంట్ ఆరోపించారు.
ఈ మేరకు ఆయన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్ జోడో యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదోనిలోని గంగాభవానీ ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, facebook
ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అశ్వస్థతకి గురయ్యారు.
హైదరాబాదులోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జి-తదుపరి విధుల్లో చేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తూ సచివాలయ సమాచార శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
డా.సమీర్ శర్మ పదవీకాలం ముగిసినప్పటికి ఆయనకు గడువు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఏపి ప్రభుత్వ వినతిపై పదవీ కాలం పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు.
అయితే ఆయన ఆదివారం నాడు కొద్దిపాటి అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రిలో చేరినట్టు సమాచార శాఖ తెలిపింది. అక్కడే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.
మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆయన హైదరాబాదులోని ప్రవేట్ ఆసుపత్రిలో చేరినట్టు ప్రకటించింది.
ఆయనకి గుండె సంబంధిత చికిత్స జరిగిందని వెల్లడించింది.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అప్డేట్ల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.