ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
తాజా వార్తలతో రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ. 80.65 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
తాజా వార్తలతో రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.

ఫొటో సోర్స్, FB/NAMANAGESWARARAOOFFICIAL
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తెరాస ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ. 80.65 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది.
మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులు ఉన్నాయి.
రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్, మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థలు, వాటి డైరెక్టర్లు, ప్రమోటర్లపై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. రెండుసార్లు టి20 వరల్డ్ కప్ టైటిల్ సాధించిన వెస్టిండీస్ జట్టు క్వాలిఫయర్ మ్యాచ్‌లో నమీబియా చేతిలో ఘోర పరాజయం పాలైంది.
సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా 42 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది.
మొదట నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది.
జార్జ్ మన్సే (66 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేశాడు. అల్జారీ జోసెఫ్, జేసన్ హోల్డర్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది.
జేసన్ హోల్డర్ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మార్క్ వాట్ 3, బ్రాడ్ వీల్ 2, మైఖేల్ లీక్ 2 వికెట్లు పడగొట్టారు.

ఫొటో సోర్స్, UNIVERAL IMAGES GROUP VIA GETTY
ముస్లిం యువతుల వివాహ వయస్సుకు సంబంధించి పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
ముస్లిం చట్టం ప్రకారం 16 ఏళ్ల ముస్లిం యువతి, తనకు నచ్చిన వ్యక్తితో వివాహ ఒప్పందం చేసుకునేందుకు అర్హురాలు అని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు సమర్థించింది.
దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌సీపీసీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లింది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించేందుకు ఒప్పుకుంది. ఈ కేసు విషయంలో కోర్టుకు సహాయకారిగా ఉండేందుకు సీనియర్ అడ్వొకేట్ రాజశేఖర్ రావును అమికస్ క్యూరీగా నియమించింది.
పఠాన్‌కోట్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు, యువతి తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. తాము ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నామని చెబుతూ తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వారు పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముస్లిం చట్టం ప్రకారం 16 ఏళ్ల ముస్లిం బాలికకు తనకు నచ్చిన ముస్లిం యువకుడిని వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించిన పంజాబ్ కోర్టు వారికి రక్షణ కల్పించింది.

నోవాటెల్ హోటల్‌లో బస చేసిన పవన్ కల్యాణ్‌ని కలిసేందుకు జనసేన కార్యకర్తలు కొందరు వచ్చారు. ఆ సందర్భంగా కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
వెంటనే, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ సమయంలో హోటల్ వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
గత రెండు రోజులుగా హోటల్ గదికే పరిమితమైన పవన్ కల్యాణ్ ఇవాళ కూడా గదిలోనే ఉన్నారు. ఆయనకు ర్యాలీ చేసేందుకు గాని, సమావేశాలు నిర్వహించేందుకు గాని అనుమతి లేదంటూ పోలీసులు నిన్న నోటీసు జారీ చేశారు.

ఎయిర్‌పోర్టు ఘటనలో అరెస్టు చేసిన 70 మందిలో 61 మందికి బెయిల్ మంజూరు అయింది. మిగతా తొమ్మిది మందికి బెయిల్ మంజూరు, ఇతర న్యాయ సహాయం అందించేందుకు జనసేన న్యాయ విభాగం ప్రయత్నిస్తుందని ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి పవన్ కల్యాణ్ విశాఖపట్నం నుంచి బయలుదేరే అవకాశం ఉంది. నోవాటెల్ జంక్షన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో కనీసం మూడు పేలుళ్లు వినిపించాయి. సెంట్రల్ షెవ్‌చెంకివ్‌స్కీ ప్రాంతంలో నివాస భవనాలు దెబ్బతిన్నాయని మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు.
కామికాజే డ్రోన్లను ఉపయోగించి దాడులు చేశారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ కార్యాలయం తెలిపింది.
గత వారం కూడా రష్యా యుక్రెయిన్‌లోని అనేక నగరాలపై క్షిపణులతో దాడి చేసింది. ఇందులో కనీసం 19 మంది మరణించారు.
సోమవారం స్థానిక సమయం 7.00 గంటలకు కీయెవ్‌లో పేలుళ్లు సంభవించాయని అక్కడ ఉన్న బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్ వెల్లడించారు.
సోషల్ మీడియా సైట్ టెలిగ్రామ్‌లో మేయర్ విటాలి క్లిట్ష్కో వివరాలను తెలియజేస్తూ, షెవ్‌చెంకివ్‌స్కీ జిల్లాలో పేలుళ్లు సంభవించాయని, గత వారం కూడా ఈ ప్రాంతంపై దాడులు జరిగాయని పేర్కొన్నారు.
రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారని, వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని ఆయన కోరారు.
కామికాజే డ్రోన్లను ఉపయోగించి దాడులు చేశారని, యుక్రెయిన్‌కు అత్యవసరంగా గగనతల రక్షణ వ్యవస్థ అవసరమని అధ్యక్ష కార్యాలయం నుంచి ఆండ్రీ యెర్మాక్ చెప్పారు.
రష్యాకు ఈ డ్రోన్లను ఇరాన్ సరఫరా చేసిందని సమాచారం. ఇవి దాడి చేసే ముందు గంటలకొద్దీ గగనతలంలో తచ్చాడగలవు. రష్యా వీటిని ఇంతకుముందు కూడా ప్రయోగించిందని యుక్రెయిన్ అంటోంది.
అయితే, ఇరాన్ వీటిని సరఫరా చేయలేదని చెబుతోంది. దీనిపై రష్యా ఇంతవరకు స్పందించలేదు.
గతవారం జరిపిన దాడులు, క్రిమియా వంతెనపై దాడికి ప్రతీకారమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంతకుముందే ప్రకటించారు.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా 40 కేంద్రాల్లో 68 బూత్‌ల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 9800 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చునని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అక్టోబర్ 19వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన నాయకుడు శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతోంది.
చివరిసారిగా 2000వ సంవత్సరంలో సోనియాగాంధీ, జితేంద్ర ప్రసాద మధ్య ఈ ఎన్నిక జరుగగా, సోనియాగాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు.
24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ-గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడు కానున్నారు. చివరిసారిగా 1998లో సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.
బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీకి స్వాగతం.
ఈరోజు ముఖ్యాంశాలు..
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడు పోలింగ్.. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ
విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను పోలీసులు హోటల్‌కే పరిమితం చేశారు. కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి.
యుక్రెయిన్ రాజధాని నగరం కీయెవ్‌లో పేలుళ్లు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మూడు పేలుళ్లు జరిగాయి.
టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు మ్యాచ్‌లు.. వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్, జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్