స్టాలిన్: ‘హిందీని రుద్దితే దేశ ప్రజల మధ్య సోదరభావం దెబ్బ తింటుంది’
హిందీ భాషకు సంబంధించి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసుల మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
లైవ్ కవరేజీ
తెలంగాణ: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన 80 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సు... దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఇన్‌కమ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించుకునే మార్గాలివే...
పవన్ కల్యాణ్: 'హోటల్ గది కిటికీ నుంచి చూడడం తప్ప నాకు మరో మార్గం లేకుండా చేశారు'
పవన్ కల్యాణ్: ‘హోటల్ గది కిటికీ నుంచి చూడడం తప్ప నాకు మరో మార్గం లేకుండా చేశారు’
దళిత విద్యార్థినిని టీచర్ క్లాసులో బట్టలు విప్పించారా, ఆ బాలిక కిరోసిన్ పోసుకుని ఎందుకు నిప్పంటించుకుంది?
మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలతో వ్యాపారులను అణచివేస్తోందా... అమెరికా పేపర్‌లో వచ్చిన యాడ్ మీద వివాదమేంటి?
స్టాలిన్: ‘హిందీని బలవంతంగా రుద్దితే దేశ ప్రజల మధ్య సోదరభావం దెబ్బతింటుంది’

ఫొటో సోర్స్, Facebook/MK Stalin
హిందీ భాషకు సంబంధించి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసుల మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
తాము వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తీరు మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ఒకే దేశం’ పేరిట హిందీని రుద్దాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాల వల్ల భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉండే ప్రజల మధ్య సోదరభావం దెబ్బతింటుందని స్టాలిన్ హెచ్చరించారు.
ఇది చివరకు దేశ సమగ్రతకు ముప్పుగా మారుతుందని ఆయన అన్నారు.
ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వంటి వాటిలో బోధన ఇంగ్లిష్ మీడియానికి బదులు హిందీ మీడియంలో తప్పనిసరి చేయాలని అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
టీ20 వరల్డ్ కప్: శ్రీలంకను ఓడించిన నమీబియా

ఫొటో సోర్స్, Martin Keep/AFP via Getty Images
నమీబియా విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 108 పరుగులకే ఆలౌట్ అయింది. భానుక రాజపక్ష, దసున్ శనక మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు.
నమీబియా బౌలర్లలో డేవిడ్ వీజ్, బెర్నార్డ్, బెన్, జాన్ రెండు వికెట్ల చొప్పున తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
జాన్ ఫ్రిలింక్ 28 బంతుల్లో 44 పరుగులు చేయగా జేజే స్మిత్ 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
ఇరాన్: ఎవిన్ జైల్లో అగ్నిప్రమాదం.. కాల్పులు, పేలుళ్లు వినిపించాయి

ఫొటో సోర్స్, TWITTER/VAHID ONLINE
ఇరాన్‌లో రాజకీయ ఖైదీలు, జర్నలిస్టులు, విదేశీ పౌరులను నిర్భంధించే ఎవిన్ జైలులో మంటలు చెలరేగాయి.
రాజధాని టెహ్రాన్‌లో ఉన్న ఈ జైలు నుంచి మంటలు, పొగలు రావడం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపించింది. అలాగే, జైలు నుంచి తుపాకీ కాల్పులు, పేలుడు శబ్దాలు వినబడుతున్నాయి.
అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని ఒక ఇరాన్ అధికారి తెలిపారు. కానీ, మంటలు ఇంకా ఎగిసిపడుతున్నట్టు వీడియోలలో కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, TWITTERCopyright
ఇరాన్‌లో గత కొన్ని వారాలుగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో 22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహసా అమీనీ పోలీసు కస్టడీలో మరణించిన తరువాత ఇరాన్‌లో నిరసన జ్వాలలు ఎగిశాయి.
ఆమె గుండెపోటుతో మరణించారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కానీ, వారి వాదనలు అవాస్తవమని, ఇరాన్ మోరల్ పోలీసులే ఆమె ప్రాణాలు తీశారని ఆమె కుటుంబం అంటోంది.
బీబీసీ పర్షియన్‌కి చెందిన రాణా రహీంపూర్ మాట్లాడుతూ, జైలులో జరిగిన ఘటనకు, ఇటీవలి నిరసనలకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తెలియలేదని అన్నారు.
అయితే, తాజా నిరసనల సందర్భంగా నిర్బంధించిన వందలాది మంది నిరసనకారులను ఈ ఎవిన్ జైలులోనే ఉంచినట్లు ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, SHUTTERSTOCKCopyright
కాగా, ఈ రెండు ఘటనల మధ్య ఎలాంటి సంబంధం లేదని ఓ అధికారి చెప్పినట్లు రాష్ట్ర మీడియా పేర్కొంది. జైలులో మంటలు చెలరేగిన ఘటనకు 'నేరపూరిత అంశాలు' కారణమని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారని ప్రభుత్వ నియంత్రణలో ఉన్నా ఐఆర్ఎన్ఏ తెలిపింది.
టెహ్రాన్ గవర్నర్ మాట్లాడుతూ, జైలులో చిన్న నేరస్తులను ఉంచే విభాగంలో అల్లర్లు జరిగాయని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోల్లో తుపాకీ కాల్పులు, పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. జైలు వెలుపల "నియంత మరణం" అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఈ నినాదం ప్రధానమైనది.
మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు.. సోమవారం ఉదయం 11.00కు విచారణ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, మనీశ్ సిసోడియా దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో సీబీఐ విచారణకు పిలిచింది.
సోమవారం ఉదయం 11.00 గంటలకు ఆయన సీబీఐ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు పీటీఐ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆదివారం, మనీశ్ సిసోడియా ఈ సమన్లపై సమాచారం ఇస్తూ, “మా ఇంట్లో సీబీఐ 14 గంటలు సోదాలు నిర్వహించినా ఏమీ బయటపదలేదు. నా బ్యాంక్ లాకర్‌లో సోదాలు చేసింది. అందులోనూ ఏమీ బయటపడలేదు. మా ఊర్లో కూడా వారికి ఏమీ కనిపించలేదు. ఇప్పుడు వాళ్లు నన్ను రేపు ఉదయం 11.00 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిచారు. నేను వెళ్లి పూర్తి సహకారం అందిస్తాను. సత్యమేవ జయతే" అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఆకలిలో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల కంటే భారత్ ఎలా దిగజారింది, కేంద్రం స్పందనేంటి
రష్యా సైనిక శిక్షణా కేంద్రంపై అగంతకుల దాడి.. 11 మంది మృతి

ఫొటో సోర్స్, EPA
రష్యా సైనిక శిక్షణా కేంద్రంలో అగంతకులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. యుక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది.
ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్ఐఏ ప్రకారం, యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా సైనిక శిక్షణ తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఇద్దరు వక్తులు ఈ కాల్పులు జరిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దాడి చేసినవారులో ఒకరు మాజీ సోవియట్ యూనియన్‌లోని ఒక దేశానికి చెందిన పౌరుడని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, వారి గురించి పెద్దగా సమాచారం ఇవ్వలేదు. దాడికి పాల్పడిన ఇద్దరినీ ఆర్మీ సిబ్బంది హతమార్చారు. ఈ దాడిలో 15 మంది గాయపడ్డారు.
"యుక్రెయిన్‌పై పోరాడే ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో చేరడానికి వలంటీర్లకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. వలంటీర్ల రూపంలో ఈ యూనిట్‌లో చేరిన ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డారు’’ అని రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఆర్ఐఏ పేర్కొంది.
వైసీపీ ఆందోళనల నడుమ పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం వాయిదా

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో తెలిపారు. దీన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహించాం కానీ ఇక్కడ వైసీపీ నేతలు అడ్డుకోవడం అన్యాయమని అన్నారు.
"రాష్ట్రంలో అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతమై ఉంది. వీళ్లు వికేంద్రీకరణ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. జనవాణి అంటే ప్రజల సమస్యల్ని వినేందుకు ప్రతిపక్షంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న కార్యక్రమం. దీన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహించాం ఇక్కడ అడ్డుకోవడం అన్యాయం. 30 మంది ఎంపిలు, 151మంది ఎమ్మేల్యేలు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు" అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ జనసేన సభ్యులు 100 మందిని అరెస్ట్ చేశారంటూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్‌లో పోలీసులపై ఫైర్ అయ్యారు.
"మా నాన్న పోలీస్ కానిస్టేబుల్. అందుకే పోలీసులంటే నాకు అభిమానం. పోలీసులు, పైనున్న రాజకీయ నాయకుల ఆర్డర్స్ ఫాలో అవుతారు. మీరు అంత చిత్తశుద్ధితో పనిచేసేవారైతే, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదన్న జగన్ క్రింద మీరు పని చేస్తున్నారని గుర్తు ఉంచుకోండి. గంజాయి స్మగ్లర్లునూ, వారిని వెంటేసు కొచ్చే రాజకీయ నేతలను వదిలేసి, ప్రజాస్వామ్యయుతంగా జనవాణి జరిపే మమ్మల్ని వేధిస్తున్నారా?" అంటూ ఆయన పోలీసులపై విరుచుకు పడ్డారు.
"మా పార్టీ కార్యక్రమాలు ఏంటో ఎక్కడికి వెళ్తున్నామో వైసీపీకి చెప్పాలా? వాళ్లు మాకు అలాగే చెప్పి చేస్తున్నారా? గంజాయి సాగు చేసే వారిని, వారికి అండదండలు అందిస్తున్న రాజకీయ నాయకుల్ని వదిలేయండి. ప్రజా సమస్యలపై పోరాడే నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టండి" అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటన... జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వైసీపీ నేతలు

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటెల్ ముందు పోలీసులు విశాఖలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నిన్న ఎయిర్‌పోర్టులో జనసేన, వైసీపీ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితుల తర్వాత పోలీసులు కొందరు జనసేన కార్యకర్తలను నాయకులను అరెస్టు చేశారు.
ఇవాళ పోర్టు కళావాహిని స్టేడియంలో ప్రజా సమస్యలను వినతుల రూపంలో స్వీకరించే జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి పవన్ హాజరవుతున్నారు.
అయితే, పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్ నుంచి ర్యాలీ చేయకుండా వెళ్లాలని పవన్‌కు పోలీసులు సూచించారు. కానీ తాను ర్యాలీ గానే వెళతానని పవన్ పోలీసులకు చెప్పారు. ఈ విషయంలో పోలీసులు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఫొటో క్యాప్షన్, జనవాణి కార్యక్రమం జరగనివ్వకుండా అడ్డుకుంటున్న వైసీపీ కార్యకర్తలు మరోవైపు పోర్టు కళావాహని స్టేడియంకు భారీగా చేరుకున్న నాన్ పొలిటికల్ జేఏసీ సభ్యులైన వైసీపీ కార్యకర్తలు, ఉత్తరాంధ్ర ద్రోహి పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తూ ఫోర్టు స్టేడియం గేటు వద్ద బైటాయించారు.
ఆందోళన అడ్డుకున్న పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
పవన్ కళ్యాణ్‌ను అరెస్టు చేశారని వచ్చిన వార్తల్లో నిజం లేదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
నిన్న రాష్ట్ర మంత్రులు, వారి కార్లపై దాడి చేసిన కొందరిని గుర్తించి వారిని అరెస్టు చేశామని చెప్పారు.
ప్రస్తుతం, ర్యాలీగాా కాాకుండా మామూలుగా పవన్ కళ్యాణ్ పోర్ట్ స్టేడియంకి వెళ్లాలని తాము కోరుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటెల్ ముందు పోలీసులు విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో నిన్న పెద్ద సంఖ్యలో జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చెయ్యడం దుర్మార్గమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
"అరెస్ట్ చేసిన జనసేన నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటల్ గదులను సోదా చెయ్యడం, అక్కడ ఉన్న నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విశాఖలో వైసీపీ రాజకీయ యాత్ర తుస్ మనడంతో ఆ ఉక్రోషం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపుతున్నట్లు కనిపిస్తుంది" అని ఆయన అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
గుడ్ మార్నింగ్!
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు, విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.
