‘గులామ్ నబీ ఆజాద్ రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లో ఉంది’-పవన్ ఖేరా

ఫొటో సోర్స్, Twitter.com/Pawankhera
కాంగ్రెస్ పార్టీకి గులామ్ నబీ ఆజాద్ రాజీనామా ఇవ్వడం వెనుక బీజేపీ భాగస్వామ్యం ఉందని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు.
వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఆయన ఆజాద్ రాజీనామా గురించి మాట్లాడారు. ‘‘ఈ సమయంలో పార్టీని మోసగిస్తోన్న వ్యక్తి రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉందనే విషయం పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు. నరేంద్ర మోదీకి, గులామ్ నబీ ఆజాద్ మధ్య ఉన్న ప్రేమను పార్లమెంట్‌లో చూశాం. ఈ రాజీనామాతో అది అందరికీ తెలిసిపోయింది’’ అని అన్నారు.
గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలెవరూ ఆయనను ఎన్నటికీ క్షమించరని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది




