You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

గులాం నబీ ఆజాద్: ‘సోనియా నామమాత్రం.. కీలక నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీవి, ఆయన సెక్యూరిటీ గార్డులవే’

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ప్రస్తుతం తనకున్న అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

లైవ్ కవరేజీ

  1. ‘గులామ్ నబీ ఆజాద్ రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లో ఉంది’-పవన్ ఖేరా

    కాంగ్రెస్ పార్టీకి గులామ్ నబీ ఆజాద్ రాజీనామా ఇవ్వడం వెనుక బీజేపీ భాగస్వామ్యం ఉందని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు.

    వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఆయన ఆజాద్ రాజీనామా గురించి మాట్లాడారు. ‘‘ఈ సమయంలో పార్టీని మోసగిస్తోన్న వ్యక్తి రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉందనే విషయం పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు. నరేంద్ర మోదీకి, గులామ్ నబీ ఆజాద్ మధ్య ఉన్న ప్రేమను పార్లమెంట్‌లో చూశాం. ఈ రాజీనామాతో అది అందరికీ తెలిసిపోయింది’’ అని అన్నారు.

    గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలెవరూ ఆయనను ఎన్నటికీ క్షమించరని అన్నారు.

  2. ప్రాణాలకు తెగించి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న ఓ మహిళ

  3. భయం నీడలో గుజరాత్ అల్లర్ల ప్రత్యక్ష సాక్షులు

  4. పెట్రోలుతో మాత్రమే నడిచే వాహనాలపై 2035 నాటికి పూర్తి నిషేధం

  5. జస్టిస్ ఎన్‌వీ రమణ: వివాదాలు ఎందుకని ముఖ్యమైన కేసుల్ని పెండింగ్‌లో ఉంచారా... ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి?

  6. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  7. ‘కావాలంటే మమ్మల్ని చంపేయండి... అంతేకానీ, ఆ నరకంలోకి మాత్రం పంపించొద్దు’

  8. పాకిస్తాన్‌ వరదలు: 3 కోట్లకు పైగా ప్రజలు ఇబ్బంది పడ్డారన్న మంత్రి, ఫ్రాన్సిస్ మావో, బీబీసీ న్యూస్

    దేశాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదల వల్ల పాకిస్తాన్‌లో 3.30 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం అయ్యారని పాక్ వాతావరణ శాఖ మంత్రి షెర్రీ రెహమాన్ వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌తో అన్నారు.

    వాతావరణ రికార్డులను బద్దలు కొడుతున్న రుతుపవన వానలు, వరదల కారణంగా జూన్ నుంచి ఇప్పటివరకు 900 మంది చనిపోయినట్లు తెలిపారు.

    భారీ వరదల వల్ల దేశవ్యాప్తంగా 4 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కనీసం 1,84,000 మంది నిరాశ్రయులయ్యారని, వారిని సహాయక శిబిరాలను తరలించినట్లు ఐక్యరాజ్య సమితి విపత్తు సహాయ సంస్థ ఓసీహెచ్‌ఏ గురువారం తెలిపింది.

    అయితే ఈ ప్రకృతి విపత్తుల వల్ల 30 లక్షల ప్రజలు ప్రభావితమైనట్లు ఈ సంస్థ పేర్కొంది.

    పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సు ఈ వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమైంది. అక్కడ ఆగస్టులో సగటు వర్షపాతం కంటే 8 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది.

  9. ఆంధ్రప్రదేశ్ - బూరుగు: ఆ గిరిజన గ్రామాల్లో రోజంటే 12 గంటలే

  10. భారత్‌: కొత్త కార్మిక చట్టాలు ఫ్యాక్టరీల్లో భద్రతా నిబంధనలను మరింత బలహీన పరిచాయా?

  11. భారత్‌, బంగ్లాదేశ్‌లలో దుర్భర పరిస్థితుల్లో లక్షలాది మంది రోహింజ్యా ముస్లిం శరణార్థులు

  12. క‌ళాపురం సినిమా రివ్యూ: పేరులో ఉన్న క‌ళ‌... సినిమాలో ఉందా?

  13. గులాం నబీ ఆజాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టడానికి ముందు కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలంటూ విమర్శలు

    కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

    పార్టీలో ప్రస్తుతం తనకున్న అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

    ‘కాంగ్రెస్ పార్టీతో నాకు ఉన్న 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలని బాధాతప్త హృదయంతో నిర్ణయించుకున్నాను’’ అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

    పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన ఈ లేఖలో ఆయన.. పార్టీలో కోటరీ, సంకల్పం కోల్పోవడంతో పాటు అనేక ఇతర అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.

    పార్టీ అగ్రనాయకత్వం భారత్ జోడో యాత్రను ప్రారంభించడానికి ముందు దేశవ్యాప్తంగా ‘కాంగ్రెస్ జోడో’ యాత్ర చేపట్టాల్సిందంటూ తీవ్రమైన విమర్శలు చేశారు.

  14. ఎమ్మెల్యేలతో హేమంత్ సోరేన్ సమావేశం

    ఝార్ఖండ్ రాజకీయాల్లో తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరేన్ యూపీఏ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు.

    రాంచీలోని తన నివాసంలో ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

    తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నరుకు లేఖ వచ్చిందన్న ప్రచారాన్ని హేమంత్ సోరేన్ ఖండించారు.

    తమ ప్రభుత్వాన్ని పూర్తి మెజారిటీ ఉందని.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన ప్రకారం తాము నడుచుకుంటామని ఝార్ఖండ్ మంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత బన్నా గుప్తా అన్నారు.

    ఆ రాష్ట్రలోని యూపీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగాఉన్న హేమంత్ సోరేన్‌పై అవినీతి ఆరోపణలు, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఈసీఐ గవర్నరుకు సిఫారసు చేసిందన్న ప్రచారం నేపథ్యంలో గుప్తా తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  15. బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్ విభాగంలో పతకం ఖాయం చేసుకున్న సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి

    ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి – చిరాగ్ శెట్టిలు సెమీ ఫైనల్ చేరారు. దీంతో వీరికి పతకం ఖాయమైంది.

    బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్‌లో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి.

    మరోవైపు సింగిల్స్ విభాగంలో హెఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు.

  16. ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న సస్పెన్స్

    ఝార్ఖండ్ రాజకీయాలలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

    ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ఆఫ్ ఇండియా(ఈసీఐ) గవర్నరుకు సిఫారసు చేసిందన్న ప్రచారం, అనంతర పరిణామాల నేపథ్యంలో అక్కడ ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

    గనుల లీజ్ వ్యవహారాలలో హేమంత్ సోరేన్ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఇంతకుముందు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

    సోరేన్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఈసీ నుంచి గవర్నర్ రమేశ్ బైస్‌కు గురువారమే లేఖ అందిందన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా తప్పుడు ప్రచారమని సోరేన్ కొట్టిపడేస్తున్నారు.

    మరోవైపు ఝార్ఖండ్ రాజ్‌భవన్ నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. దిల్లీ నుంచి గురువారం రాంచీ చేరుకున్న గవర్నర్ రమేశ్ బైస్ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈసీఐ నుంచి లేఖ వచ్చినట్లు తనకు తెలియదని చెప్పారు.

    అనంతరం ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

    అయితే, స్థానిక మీడియాలో మాత్రం హేమంత్ర సోరేన్ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9-ఏను ఉల్లంఘించారంటూ ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచిస్తూ గవర్నరుకు ఈసీఐ లేఖ రాసిందని కథనాలు వస్తున్నాయి.

  17. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.