You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నల్గొండ: హిండిస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని హిండిస్ ల్యాబ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
లైవ్ కవరేజీ
NDTV షేర్లు కొన్న గౌతమ్ అదానీ.. ఆ టీవీలో అతి పెద్ద షేర్‌హోల్డర్ కానున్న అదానీ గ్రూప్ కంపెనీ
ఆసియాలో అతి పెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీ.. ఎన్‌డీటీవీ మీడియా కంపెనీలో 29.18 శాతం వాటాను పరోక్షంగా కొనుగోలు చేసింది.
ఎన్‌డీటీవీలో మరో 26 శాతం వాటాను కూడా కొనటానికి ఓపెన్ ఆఫర్ తెస్తామని కూడా అదానీ గ్రూప్ కంపెనీ తాజాగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్ఈ)లకు తెలియజేసింది.
ఈ ఎక్సేంజిలకు తెలియజేసిన సమాచారం ప్రకారం.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్.. విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్)లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది.
వీసీపీఎల్‌ను రూ. 114 కోట్లకు కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ఎన్‌డీటీవీ ప్రొమోటర్ గ్రూప్ అయిన ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వీసీపీఎల్‌కు 29.18 శాతం ఈక్విటీ షేర్లు ఉన్నాయి.
వీసీపీఎల్‌ను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు.. ఎన్‌డీటీవీలో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేయటానికి ఓపెన్ ఆఫర్ ఇస్తామని స్టాక్ ఎక్సేంజీకి తెలియజేసింది.
ఇదిలావుంటే.. వీసీపీఎల్ వాటా విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి సదరు సంస్థ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎన్‌డీటీవీ స్టాక్ ఎక్సేంజికి తెలియజేసింది.
‘‘వీసీపీఎల్ మమ్మల్ని సంప్రదించకుండా, మా ఆమోదం లేకుండా.. అప్పును వాటాగా మార్పిడి చేసుకునే తన హక్కును వినియోగించుకుందని ఎన్‌డీటీవీ కంపెనీ వ్యవస్థాపకులు స్పష్టం చేయదలచుకున్నారు’’ అని పేర్కొంది.
ఎన్‌డీటీవీ ప్రొమోటర్లలో ప్రణయ్ రాయ్‌కి కంపెనీలో 15.94 శాతం వాటా ఉంది. ఆయన భార్య రాధికా రాయ్‌కి 16.32 శాతం వాటా ఉంది. వారిద్దరూ.. ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటా ఉన్న ఆర్‌ఆర్‌పీఆర్ కంపెనీ ప్రొమోటర్లు.
ఎన్‌డీటీవీ ప్రొమోటర్లు 2009లో ఆర్ఆర్‌పీఆర్ ద్వారా తమ వాటాను గ్యారంటీగా పెట్టి అప్పు తీసుకున్నారు. ఈ రుణం పదేళ్ల కాల పరిమితి 2019లో ముగిసింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.