ఇవీ ఈనాటి ముఖ్యాంశాలు...
ఇంతటితో ఈనాటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో లైవ్ పేజీలో కలుద్దాం.
ధన్యవాదాలు!
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరటం.. ఒక వ్యక్తి పార్టీలో చేరటం కాదు.. కేసీఆర్ సర్కారును పీకి పారేయటానికి ఆరంభం. మునుగోడులో రాజగోపాలరెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుంది’’ అని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఇంతటితో ఈనాటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో లైవ్ పేజీలో కలుద్దాం.
ధన్యవాదాలు!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు.
మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా ఫిల్మ్ సిటీ చేరుకున్నారు.
అక్కడ రామోజీరావుతో దాదాపు 45 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు.
అనంతరం తర్వాత శంషాబాద్ విమానాశ్రయం వద్ద నోవాటెల్ హోటల్‌కు అమిత్ షా వెళ్లారు.
సినీ నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ ఈ హోటల్‌లో అమిత్ షాను కలుస్తున్నారు.
అమిత్ షా ఇటీవల RRR సినిమా చూశారని, జూనియర్ ఎన్‌టీఆర్ నటన నచ్చి ఆయనను కలవటానికి ఆహ్వానించారని చెప్తున్నారు.
కర్ణాటకలోని శివమొగ్గ పట్టణంలో గత వారం.. వీర్ సావర్కర్, టిపు సుల్తాన్‌లె ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఘర్షణ, హింస తలెత్తింది. దీనివల్ల ఆందోళనకారుల మీద పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. టిపు – సావర్కర్‌లను పోలుస్తూ వ్యాఖ్యానించారు.
‘‘టిపు సుల్తాన్ ఉంగరాన్ని 1 లక్షా 45 వేల పౌండ్లకు వేలం వేశారు. ఆ ఉంగరం మీద ఏం రాసుంది? ఆ ఉంగరం మీద రాముడి పేరు రాసి ఉంది. ఒక ముస్లిం చక్రవర్తి వద్ద అటువంటి ఉంగరం ఉండటం అద్భుతమైన విషయమని వేలం కంపెనీ రాసింది. దీనివల్ల ఏం తెలుస్తోంది? టిపు సుల్తాన్ హిందువులకు వ్యతిరేకం కాదని వెల్లడవుతోంది’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
‘‘ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకం. బ్రిటిష్ వాళ్లకు బానిసలుగా ఉండటాన్ని అంగీకరించే ప్రతి మతానికీ ఆయన వ్యతిరేకం’’ అని చెప్పారు.
‘‘బ్రిటిష్ వాళ్లకు బానిసలుగా ఉండటానికి టిపు సుల్తాన్ అంగీకరించలేదు. ఈ దేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి విముక్తి చేయాలని టిపు కోరుకున్నారు. టిపు భారతదేశపు స్వాతంత్ర్య సమర యోధుడు. అందుకు రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యంగం తొలి పుస్తకంలో ఝాన్సీ రాణి ఫొటోతో పాటు టిపు ఫొటో కూడా పెట్టారు’’ అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
‘‘ఇప్పుడు టిపు, సావర్కర్‌ల గురించి వాదిస్తున్న వారు చెప్పాలి. నింగి ఎక్కడ? నేల ఎక్కడ? టిపుకు సాటి లేరు. ఈ దేశాన్ని స్వతంత్ర దేశంగా చేయటానికి ఆయన సర్వస్వం త్యాగం చేశాడు’’ అంటూ టిపు సుల్తాన్‌ను కీర్తించారు.
‘‘టిపు సుల్తాన్‌ను ద్వేషించే వారు, టిపు సుల్తాన్ త్యాగాన్ని చెరిపివేయాలని కోరుకునే వాళ్లు ఈ దేశంలో కొందరు ఉన్నారు. టిపు బ్రిటిష్ వారితో నాలుగు సార్లు యుద్ధం చేశారు. అదే బ్రిటిష్ వాళ్లకి సావర్కర్ నాలుగు సార్లు క్షమాపణ లేఖ రాశారు. టిపు – సావర్కర్‌ల మధ్య తేడా ఇది’’ అని అసదుద్దీన్ చెప్పారు.
‘‘కేసీఆర్ కుటుంబం చాలా పెద్దది. కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు చాలా మంది ఉన్నారు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు.
‘‘ఉపాధి ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ గత ఎనిమిదేళ్లుగా యువకులకు ఎక్కడా ఉపాధి ఇవ్వటం లేదు. ఉపాధి ఎక్కడైనా ఉందంటే అది కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉంది’’ అని అమిత్ షా విమర్శించారు.
‘‘తెలంగాణ రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోంది. నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనాలని కేసీఆర్ ప్రభుత్వానికి మేం చెప్పాం. కానీ చేయలేదు’’ అని ఆరోపించారు.
‘‘బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి.. మోదీ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతు నుంచి ప్రతి కిలో దుడ్డు బియ్యాన్ని కొంటామని నేను హామీ ఇస్తున్నా’’ అన్నారు.
‘‘దేశంలో పెట్రోల్ ధర తెలంగాణలోనే అత్యధికంగా ఉంది. ప్రధాని మోదీ రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే.. కేసీఆర్ మాత్రం తగ్గించలేదు’’ అని విమర్శించారు.
‘‘తెలంగాణ అభివృద్ధి విషయంలో రాష్ట్ర స్థాపన నుంచి ఇప్పటివరకూ అమలు కాని హామీలనన్నిటినీ బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. రాజగోపాలరెడ్డిని మునుగోడులో గెలిపించండి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి’’ అని ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిని అమిత్ షా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
‘‘కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరటం.. ఒక వ్యక్తి పార్టీలో చేరటం కాదు.. కేసీఆర్ సర్కారును పీకి పారేయటానికి ఆరంభం. మునుగోడులో రాజగోపాలరెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుంది’’ అని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని మునుగోడులో ఆదివారం సాయంత్రం బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
‘‘భారత తొలి హోంమంత్రి సర్దార్ పటేల్.. రజాకార్ల నుంచి తెలంగాణను విముక్తం చేసి, భారతదేశంలో కలిపిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచనదినోత్సవంగా జరుపుతామని కేసీఆర్ చేసిన వాగ్దానం ఏమైందని నేను అడుగుతున్నాను’’ అని ప్రశ్నించారు.
‘‘మజ్లిస్‌కు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రి వస్తారు. అప్పుడు సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా మేం ఘనంగా నిర్వహిస్తాం’’ అని చెప్పారు.
‘‘తెలంగాణలో నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. మీలో ఎవరికైనా ఆ నిరుద్యోగ భృతి అందుతోందా? పేదలకు రెండు బెడ్ రూమ్‌ల ఇల్లు ఇస్తామన్నారు. కానీ మోదీ ఇస్తున్న టాయిలెట్‌ను కూడా అడ్డుకుంటున్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ అందిందా?’’ అని అమిత్ షా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారు. ఈసారి మళ్లీ వీళ్లని ఎన్నుకుంటే దళిత ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కానీ దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయరు’’ అని విమర్శించారు.
‘‘ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేశారు. ఎవరికైనా భూమి అందిందా? గిరిజనులకు ఎకరం చొప్పున భూమి ఇస్తామన్నారు. ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు.
తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో రైతు సంఘాలతో భేటీ అయ్యారు. సుమారు 20-25 మంది రైతు నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.
తెలంగాణలో వ్యవసాయ పరిస్థితులపై రైతు సంఘాలతో అమిత్ షా చర్చించారు. తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు, పసుపు రైతులకు మరిని సదుపాయాలు, కరెంటు మీటర్ల సమస్య, సేంద్రీయ పంటలకు ప్రోత్సాహం వంటి పలు అంశాలపై మాట్లాడారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. తాము విద్యుత్ మీటర్ల సమస్య ప్రస్తావించగా.. విద్యుత్ మీటర్ల వల్ల సమస్య ఉండదని, అది డిస్కంల కోసమేనని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.
‘విద్యుత్ చట్టాలను కాదు మార్చాల్సింది, తెలంగాణ ప్రభుత్వాన్ని మార్చాలి’ అంటూ.. విద్యుత్ చట్టాల మార్పు గురించి కాకుండా, ఇతర అంశాల గురించి అమిత్ షా మాట్లాడినట్లు రైతు నేతలు చెప్పారు.
ఫసల్ బీమా యోజన అమలు గురించి తాము అడిగామని, పీఎం కిసాన్ యోజన డబ్బు పెంచాలని కోరామని రైతులు చెప్పారు.
ఎనిమిదేళ్లుగా తెలంగాణలో పంట నష్టం పరిహారం ఇవ్వడం లేదని, ఈ ఏడు పంట నష్టం అయినా ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఒక బృందాన్ని పంపిస్తామని అమిత్ షా చెప్పినట్లు వివరించారు.
వడ్లు కొనాలనే విషయం కూడా ప్రస్తావించామని, వరి నుంచి, ఇతర పంటల నుంచి ఇథనాల్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని తాము కోరగా.. అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
జర్మనీ తయారు చేసిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ టెస్ట్ యంత్రాలు అందజేస్తామని, సేంద్రీయ వ్యవసాయ ల్యాబులు ఏర్పాటు చేస్తామని అమిత్ చెప్పినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.
ఈ భేటీ అనంతరం అమిత్ షా ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడు బయలుదేరి వెళ్లారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయన ఇక్కడకు వచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ తదితరులు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న అమిత్ షా అక్కడ పూజలు చేశారు. గుడిలో దాదాపు అరగంట ఉన్నారు.
అనంతరం సికిందరాబాద్ సాంబమూర్తి నగర్‌కి చెందిన సత్యనారాయణ అనే దళిత కార్యకర్త ఇంటికి వెళ్లారు. కార్యకర్త ఇంట్లో టీ తాగిన అమిత్ షా పావు గంట తర్వాత బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు.
అక్కడ రైతు సంఘం నాయకులతో అమిత్ షా కలవనున్నారు. అనంతరం.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడు వెళతారు.
మునుగోడులోనే సీఆర్పీఎఫ్ పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం బీజేపీ బహరంగ సభలో పాల్గొంటారు.
జూనియర్ ఎన్‌టీఆర్‌తో భేటీ?
సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అవుతారు.
సాయంత్రం 8 గంటల సమయానికి అమిత్ షా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి విందు సమావేశం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సినీ నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ కూడా అమిత్ షాను కలుస్తారని వార్తలు వచ్చాయి. అమిత్ షా ఇటీవల RRR సినిమా చూశారని, జూనియర్ ఎన్‌టీఆర్ నటన నచ్చి ఆయనను కలవటానికి ఆహ్వానించారని చెప్తున్నారు.
రాత్రి 9:25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీ బయలుదేరి వెళతారు.
ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన కోసం బీజేపీ ప్రచారాన్ని మొదలుపెట్టిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
ఆయన ఆదివారం విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ప్రజలకు మెరుగైన పాలన కావాలి. మేం మెరుగైన పాలనను అమలు చేయడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు, రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి, రోడ్లు వస్తాయి. ఇక్కడ మా ప్రచారాన్ని మొదలుపెడుతున్నాం" అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రమాదం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా జారిపడిముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
ట్యాంక్ లో పడిన వారికి ఊపిరి అడక చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఆగస్ట్ 21వ తేదీ ఉదయాన్నే ఈ ఘటన జరిగింది.
సత్తెనపల్లి బస్టాండ్ వద్ద వినాయక రెస్టారెంట్ కి చెందిన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు.
అయితే డ్రైనేజ్ క్లీన్ చేస్తున్న సమయంలో సమీపంలో గుంత గమనించక పోవడంతో అందులో కూరుకుపోయారని హోటల్ యజమాని స్థానిక మీడియాకి తెలిపారు.
సమాచారం అందుకున్న పోలసులు ఘటనా స్థలానికిచేరుకున్నారు. పోలీసులతో పాటుగా ఫైర్ సిబ్బంది కూడా రంగంలో దిగారు.
మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీసి సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని అనిల్ (20), పల్లపు బ్రహ్మ్మం (18), కందకుంట్ల కొండలరావు (65) గా గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.దర్యాప్తు సాగుతోందని, ఎవరి నిర్లక్ష్యం ఉందని తేలినా చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారి బంధువులు ఆందోళన చేస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో వరదల తాకిడి పెరుగుతోంది. ఈ వరదల్లో పౌరి, ఘర్వాల్ జిల్లాలో ఉన్న అరణ్యం రిసార్ట్‌లో కొంత మంది చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
ఈ ప్రాంతంతో కనెక్టవిటీ అంతా పోయింది. బాధితులను ఆదుకునేందుకు తక్షణమే సహాయక బృందాలను పంపించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు.
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని మునుగోడులో ఆదివారం బీజీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సభలో ఆయన ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు.
మునుగోడు అసెంబ్లీయే నియోజకవర్గం ఉపఎన్నికకు ముందు ఈ సభ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు శనివారం మునుగోడులో జరిగిన సభలో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో వాటా ఎంతో ముందు చెప్పండని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ‘‘మునుగోడు వస్తున్నారు కదా.. ముందు కృష్ణా జలాల సంగతి తేల్చండి’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మరో వైపు, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక గురించి చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆగస్టు 23న దిల్లీలో సమావేశం కానున్నారు.
కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకుడు కేసి వేణుగోపాల్, మాణికం ఠాగూర్‌తో పాటు ప్రియాంక గాంధీని కూడా కలవనున్నారు.
దిల్లీ ఎక్సైజ్ విధానం కుంభకోణంలోదిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా ఆరోపణలెదుర్కొంటున్న వారందరికీ సీబీఐ లుక్ అవుట్ సర్క్యులర్ లు జారీ చేసింది. ఈ కేసులో మొత్తం 13 మందికినోటీసులను జారీ చేశారు.
ఈ సర్క్యులర్ జారీ చేసిన క్షణం నుంచి ఆరోపణలెదుర్కొంటున్న వారెవరూ కోర్టు అనుమతి లేకుండా భారతదేశాన్ని వదిలిపెట్టివెళ్లే వీలు లేదు.
దిల్లీలో ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
సోదాలు నిర్వహించిన తర్వాత సీబీఐ లుక్ అవుట్ సర్క్యులర్ లు జారీ చేసింది.
ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్నవారిని పట్టుకునేందుకు ఈ నోటీసులను జారీ చేశారు.
ఈ నోటీసు జారీ చేసిన తర్వాత, "తాను స్వేచ్ఛగా తిరుగుతున్నానని ఎక్కడకు రావాలో మోదీ చెప్పాలి" అని మనీష్ సిసోడియా,ట్వీట్ చేశారు.
ఈ కేసులో సీబీఐ ఆగస్టు 17న 15 మంది పై ఐపీసీ 120 - బి, 477 - ఏ, అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితుడు కూతురు మాస్కో దగ్గర జరిగిన కారు పేలుడులో మరణించారు.
దర్యా దుగీనా ప్రయాణిస్తున్న కారులో మంటలు రాజుకోవడంతో ఆమె మరణించినట్లు రష్యన్ స్టేట్ మీడియా తెలిపింది.
ఈ దాడికి పుతిన్‌కు సన్నహిత సలహాదారునిగా చెప్పే రష్యన్ తత్వవేత్త అలెగ్జాన్డర్ దుగిన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.
దుగిన్‌ను పుతిన్‌కు సన్నిహితునిగా చెబుతారు.
టర్కీలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 32 మంది మరణించారు.
గజియాన్‌తెప్‌లో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించారు. 21 మందికి గాయాలయ్యాయి.
మరి కొన్ని గంటల్లోనే మార్డిన్ కు 250 కిలోమీటర్ల దూరంలో మరొక ట్రక్ ఒక సమూహాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అత్యవసర కార్మికులు కూడా ఉన్నారు.
రెండవ ప్రమాదంలో 29 మంది గాయపడ్డారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది" టర్కీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫారెట్టీన్ కోకా చెప్పారు.
"లారీ బ్రేకులు విఫలం కావడంతో ఇదొక గుంపును ఢీకొంది" అని ఆయన ట్వీట్ చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.