You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనా మహమ్మారి తొలగిపోలేదు.. జనం కోవిడ్ ప్రికాషన్ డోసు తీసుకోవాలి: నీతి ఆయోగ్

దేశంలో ప్రస్తుతం రోజుకు దాదాపు 10,000 కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. కరోనావైరస్ మహమ్మారి ఇంకా తొలగిపోలేదని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ హెచ్చరించారు.

లైవ్ కవరేజీ

  1. కేరళలో అదానీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా మత్స్యకారుల నిరసనలు

    కేరళలో నిర్మిస్తున్న అదానీ పోర్టుకు వ్యతిరేకంగా తిరువనంతపురంలో జాలర్ల నిరసనలు రెండో రోజూ జరుగుతున్నాయి.

    అదానీ పోర్ట్ ప్రాజెక్ట్ వల్ల కిలోమీటర్ల కొద్దీ తీర ప్రాంతం ధ్వంసం అవుతోందని వారు ఆరోపిస్తున్నారు.

    సముద్ర తీరప్రాంత కోతకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు పునరావాసం కల్పించాలంటూ జాలర్లు డిమాండ్ చేస్తున్నారు.

  2. తాలిబాన్ల ఏడాది పాలన: ‘భయంలోనే బతుకుతున్నాం.. మహిళల అవకాశాలను లాగేసుకుంటున్నారు’

  3. కాళేశ్వరం: మేడిగడ్డకు కొనసాగుతున్న వరద

    కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌కు 10,07,540 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. వచ్చి నీటిని వచ్చినట్టుగానే 85 గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.

    భద్రాచలం, ములుగు జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

    కాళేశ్వరం వద్ద గోదావరి 12.14 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. 12.5 మీటర్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

    ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌కు 40,424 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 4 గేట్ల ద్వారా 11,104 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

    ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 90 టీఎంసీలకు గాను 82.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

    ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు 94,563 క్యూసెక్కుల వరద వస్తుండగా 20 గేట్ల ద్వారా లక్షా15 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

    వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కడెం ప్రాజెక్ట్ అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 7 టీఎంసీల పూర్తిసామర్థ్యానికి గాను 5.7 టీఎంసీల నిల్వ ఉంది.

  4. ఇంటిపై జాతీయ జెండా ఎగరేశారా, మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది

  5. పెరుగుతున్న గోదావరి వరద తాకిడి

    వరద తాకిడితో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 54.5 అడుగులకు చేరిన క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరద ఉధృతితో పలు మండలాలు జలదిగ్భందంలోకి వెళ్లాయి.

    చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరూ ఏజెన్సీలోనూ గోదావరి వరద ఉధృతి పెరిగింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు నీటమునిగాయి. గుండేటివాగు కల్వర్టు మునగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..

  6. కేటీఆర్: ‘మోదీజీ, 11 మంది రేపిస్టుల విడుదలను అడ్డుకోండి’

    బిల్కిస్ బానో రేప్ కేసులో దోషులుగా ఉన్నవారిని సత్ర్పవర్తన కింద విడుదల చేయడం మీద తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.

    ‘ప్రియమైన ప్రధాని గారు,

    మీరు నిజంగా మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు అయితే 11 మంది రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం సత్ర్పవర్తన కింద విడుదల చేయడాన్ని అడ్డుకోండి.

    కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు ఇది విరుద్ధంగా ఉంది.

    రేపిస్టులకు బెయిల్ దొరక్కుండా ఉండేలా ఐపీసీ, సీఆర్‌పీసీలలో మార్పులు చేయాలని కూడా నేను కోరుతున్నా.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  7. రష్యా: క్రైమియా దాడుల వెనుక ‘విద్రోహులున్నారు’

    క్రైమియాలోని రష్యా సైనిక శిబిరం మీద దాడి జరిగిన సుమారు వారం తరువాత మంగళవారం మరొక మిలిటరీ బేస్‌లోని ఆయుధాగారాల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

    వీటికి కారణం ‘విద్రోహం’ అని రష్యా అధికారులున్నారు. అయితే ఆ విద్రోహం గురించి వారు వివరంగా చెప్పలేదు.

    యుక్రెయిన్‌కు చెందిన ఆ విద్రోహులు రష్యాలోని ఆరు విద్యుత్ పైలాన్లను పేల్చి వేసినట్లు ఎఫ్‌ఎస్‌బీ సెక్యూరిటీ సర్వీసు తెలిపింది.

    యుక్రెయిన్‌ సరిహద్దుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్చతోవ్ ప్రాంతంలో జరిగిన దాడుల వల్ల కురస్క్ అణువిద్యుత్ ప్లాంటులో సాంకేతిక లోపాలు తలెత్తాయి.

  8. శివమొగ్గలో వీర్ సావర్కర్ Vs టిప్పు సుల్తాన్: మూడో రోజూ కొనసాగుతున్న 144 సెక్షన్

    కర్నాటకలోని శివమొగ్గలో వీర్ సావర్కర్ బ్యానర్ వివాదంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.

    స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా కర్నాటకలో వీర్ సావర్కర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

    అయితే ఆయన బ్యానర్‌ను తొలగించేందుకు టిప్పు సుల్తాన్ అభిమానులు ప్రయత్నించారు. దీంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

    వీర్ సావర్కర్ ఫ్లెక్సీలు తొలగించాలంటూ ఉడుపి కాంగ్రెస్ నేతలు పోలీసులను కోరారు. ఆ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలే చింపి వారే గొడవకు దిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

    వీర్ సావర్కర్ బ్యానర్ వివాదంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అల్లర్లు సృష్టించేందుకు బ్యానర్‌ను చింపేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.

  9. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.