You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము... ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ విజయం

తొలి ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ద్రౌపది ముర్ముకు 2,824 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వాటి విలువ 6,76,803. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వాటి విలువ 3,80,177.

లైవ్ కవరేజీ

  1. ద్రౌపది ముర్ము: క్లర్క్‌ నుంచి రాష్ట్రపతి వరకు... ఆదివాసీ నేత ప్రస్థానం

  2. ICYMI: మీరు చదవకపోతే, ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  3. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు సెలవు.

  4. ద్రౌపది ముర్ముకు 2,824 ఓట్లు... అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ ఆఫీసర్

    రాష్ట్రపతి ఎన్నికల తుది ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి.

    మొత్తం 4,754 ఓట్లు పోలైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ తెలిపారు. వీటిలో 53 చెల్లని ఓట్లు ఉన్నాయి.

    రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే కావాల్సిన కోటా 5,28,491.

    అయితే ద్రౌపది ముర్ముకు 2,824 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వాటి విలువ 6,76,803.

    ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వాటి విలువ 3,80,177.

    తొలి ప్రాధాన్యత కింద ముర్ముకు వచ్చిన ఓట్లు కోటా కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆమెను విజేతగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.

  5. యుక్రెయిన్‌ ప్రథమ మహిళ: ‘యుద్ధం వల్ల నా కొడుకు సైనికుడు అవుతానంటున్నాడు’

  6. ద్రౌపది ముర్ముకు ప్రధాని శుభాకాంక్షలు

    భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు.

    రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ద్రౌపది ముర్మును అభినందిస్తూ ట్వీట్ చేశారు.

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ పాలనలోని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ముర్ముకు అభినందనలు తెలిపారు.

  7. ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రంలో సంబరాలు

    రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో తొలి నుంచి ద్రౌపది ముర్ము ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు.

    రెండు రౌండ్ల లెక్కింపు ముగిసిన తరువాత దాదాపుగా ఆమె విజయం ఖాయమైంది.

    ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలో ఆమె నివాస గృహం వద్ద బీజేపీ కార్యకర్తలు, స్థానికులు సంబరాలు జరిపారు.

    మరొకవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా విజయం సాధించిన ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

  8. బ్రేకింగ్ న్యూస్, 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.

    మూడో రౌండ్ పూర్తి అయ్యేనాటికి పోలైన మొత్తం వ్యాలిడ్ ఓట్లలో 50శాతానికి పైగా ముర్ము గెలుచుకున్నారు.

    మూడో రౌండ్‌లో మొత్తం 1,333 వ్యాలిడ్ ఓట్లకు గాను ముర్ముకు 812, యశ్వంత్ సిన్హాకు 521 వచ్చాయి.

    అన్ని రౌండ్లు ముగిసేసరికి ముర్ముకు 2,161 ఓట్లు రాగా వాటి విలువ 5,77,777. యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు రాగా వాటి విలువ 2,61,062.

    ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు కాబట్టి 5,43216 విలువైన ఓట్లు వస్తే గెలిచినట్లే. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం ఓట్ల విలువ 1,086,431.

    ఈ నెల 25న ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు.

    ప్రతిభా పాటిల్ తరువాత రాష్ట్రపతి అయిన రెండో మహిళ ద్రౌపది ముర్ము.

  9. గోధుమ, వరి, మొక్కజొన్న, టమోటా.. టన్నుల కొద్దీ విత్తనాలను చైనా అంతరిక్షంలో తీసుకెళ్లి ఏం చేస్తోంది?

  10. చంద్రబాబుకు తప్పిన ప్రమాదం... నీటిలో పడిన దేవినేని ఉమా, పితాని

    వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా ప్రమాదం జరిగింది . టిడిపి అధినేత తృటిలో తప్పించుకున్నారు.

    కానీ పలువురు నాయకులు, మీడియా సిబ్బంది నీటిలో పడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైపు నుంచి ఆయన కోనసీమ జిల్లా సొంపల్లి వైపు పంటులో వచ్చారు.

    ఒడ్డుకి సమీపంలో దాని నుంచి దిగుతున్న సమయంలో ఒక వైపునకు ఒరిగిపోయింది. దాంతో చాలామంది నీటిలో పడిపోయారు.

    వారందరినీ సురక్షితంగా ఒడ్డుకి చేర్చారు.

    మాజీ మంత్రులు దేవినేని ఉమా, పితాని సత్యనారాయణ సహా టీడీపీ నేతలు నీటిలో పడిపోవడంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

    వారందరినీ ఒడ్డుకి చేర్చారు. తీరానికి చేరువలో ఇలా జరగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

  11. ఆంధ్రప్రదేశ్: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు

    వరద బాధితులను పరామర్శించేందుకు టీడీపీ అధినేత పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆచంట మండలంలోని. పలు గ్రామాల్లో ఆయన బాధితుల వద్దకు వెళ్లారు.

    ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంటుపై లంక గ్రామాలకు చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి వరద తీవ్రత, బాధితుల కష్టాల గురించి తెలుసుకున్నారు.

    ‘కుటుంబానికి నాలుగు ఉల్లిపాయలు..నాలుగు మిరపకాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇది. కూరగాయలు, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? రూ.2 వేలు ఇచ్చే ప్రభుత్వానికి బుద్ధి ఉందా?’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

    దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు.

    రాత్రికి పాలకొల్లులో బస చేసి, రేపు కోనసీమలో పర్యటిస్తారని టీడీపీ కార్యాలయం తెలిపింది.

  12. భారీ ఆధిక్యంలో ద్రౌపది ముర్ము

    రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు.

    రెండో రౌండ్‌ ఫలితాల్లో పోలైన 1,138 వ్యాలిడ్ ఓట్లలో ద్రౌపది ముర్ము 809, యశ్వంత్ సిన్హాకు 329 వచ్చాయి.

    విలువ పరంగా చూడు ద్రౌపది ముర్ముకు వచ్చిన ఓట్ల విలువ 1,05,299, యశ్వంత్ సిన్హాకు వచ్చిన ఓట్ల విలువ 44,276గా ఉంది.

    తొలి రౌండ్‌లో ముర్ముకు 540, సిన్హాకు 208 ఓట్లు వచ్చాయి.

  13. మహాసేన రాజేశ్‌ను విచారించిన పోలీసులు

    కాకినాడకు చెందిన మహాసేన మీడియా యూట్యూబ్​ చానెల్​ నిర్వహకులు రాజేశ్, ఎర్ర దీపక్​లను శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు బుధవారం విచారించారు.

    ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారి పి.వి.సునీల్​కుమార్​పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ వీరి మీద కేసు నమోదైంది.

    కేసు దర్యాప్తులో భాగంగా వారిని స్టేషన్​కి పిలిచామని సీఐ ఈశ్వరప్రసాద్​ చెప్పారు. విచారణకు సహకరించకపోవడంతో మళ్లీ హాజరు కావాలని నోటీసులు జారీ చేశామన్నారు. వారి కార్లకు సంబంధించిన పత్రాలు చూపించక పోవడం వల్ల వాటిని ఆర్డీవో అధికారుల వద్దకు పంపామని తెలిపారు.

    మహాసేన సభ్యుడొకరు తప్పు పోస్టు పెడితే... పోలీసులు తన బ్యాంకు ఖాతాలపై ఆరా తీశారని రాజేష్ తెలిపారు. విచారణ పేరుతో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పీఎస్​లోనే ఉంచారని మీడియాతో చెప్పారు.

  14. వ్లాదిమిర్ పుతిన్‌కు క్యాన్సర్ అన్న వార్తలపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమన్నారంటే..

  15. డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?

  16. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ముందంజ

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ముందంజలో ఉన్నారు.

    ఇప్పటి వరకు ఆమెకు 3 లక్షల 78వేలు(72శాతం) ఓట్లు రాగా ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు లక్షా 45వేల 600(28శాతం) వచ్చాయి.

    ప్రస్తుతం ఎంపీల ఓట్లు అన్ని లెక్కించడం అయిపోయింది. ఇక ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు.

  17. డీఎస్పీని ట్రక్కుతో తొక్కించి హత్య, అసలేం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  18. యుక్రెయిన్: రషన్ల దాడుల్లో ధ్వంసమైపోయిన ఇళ్లను మళ్లీ నిర్మించుకుంటున్న యుక్రేనియన్లు

  19. మరో పైసా పడిపోయిన రూపాయి విలువ.. 80.06కు దిగజారిన వైనం

    కరెన్సీ మార్కెట్‌లో భారత రూపాయి విలువ గురువారం నాడు మరింత పతనమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ మరో పైసా తరిగిపోయి, 80.06 రూపాయలకు దిగజారింది.

    రూపాయి చరిత్రలో ఇది ఆల్ టైం కనిష్ట విలువ.

    పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. డాలరుకు డిమాండ్ పెరుగుతోంది. చమురు దిగుమతులు, ముడి చమురు మార్కెట్‌లో స్థిరత్వం దీనికి కారణం.

    కొద్ది రోజులుగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో రూపాయి విలువ (డాలరుతో మారకంలో) 80 దగ్గర కొనసాగుతోందని కరెన్సీ మార్కెట్ ట్రేడర్లు చెప్తున్నారు.

    బ్రెంట్ చమురు బారెల్ ధర 106 డాలర్లకు మించి పెరిగింది. దీనివల్ల రూపాయి మీద ఒత్తిడి పెరుగుతోంది.

    మరోవైపు, కరెంట్ అకౌంటు – వాణిజ్య లోటు పెరగటం వల్ల మదుపుదారుల్లో ఆందోళన కూడా పెరుగుతోంది.

  20. నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి? సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఆరోపణలేమిటి?