శ్రీలంక: ఐఎంఎఫ్ ఏం చెబుతోంది?
శ్రీలంకలో నిరసనల నడుమ వేగంగా రాజకీయ పరిణామాలు మారుతుంటే.. ఇక్కడి ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దడంపై దృష్టిపెట్టనట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది.
‘‘ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నాం’’అని ఐఎంఎఫ్ తెలిపింది.
మరోవైపు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా కూడా శ్రీలంకను కోరింది.
‘‘పరిస్థితులు మెరుగుపడేలా శ్రీలంక పార్లమెంటు చర్యలు తీసుకోవాలి’’అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
‘‘శాంతియుతంగా నిరసనలు చేపట్టే హక్కు శ్రీలంక ప్రజలకు ఉంది. కానీ, దాడులు చేయకూడదు. హింసపై దర్యాప్తు చేపట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని అరెస్టు చేయాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.