'మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీతో ఎలాంటి చర్చ జరగలేదు' - ఏక్‌నాథ్ షిండే
మహరాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ మొదలైంది.
కాగా, మంత్రి పదవుల విషయంలో బీజేపీతో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు.
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా తరువాత మంత్రి పదవుల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో ఎలాంటి వార్తలను నమ్మవద్దని ఏక్‌నాథ్ షిండే కోరారు.
"ఎవరికి మంత్రి పదవి ఇస్తారు, ఎవరికి ఎన్ని పదవులు దక్కుతాయి వంటి విషయాల్లో ఇప్పటివరకు బీజేపీతో ఎలాంటి చర్చ జరగలేదు. త్వరలోనే ఈ విషయాలను పరిశీలిస్తాం. అప్పటివరకు ఎలాంటి మంత్రి పదవుల జాబితాను నమ్మవద్దు" అని ఏక్‌నాథ్ షిండే చెప్పారు.