తొలి టీ20లో టీమ్ ఇండియాపై సౌత్ ఆఫ్రికా విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని సాధించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి విజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. ఆమ్ ఆద్మీ పార్టీ: గుజరాత్‌లో కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ రీప్లేస్ చేయగలదా? బీజేపీ కోటను కూలగొట్టగలదా?

  2. విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్... 13 ఇన్నింగ్స్‌లలో 1,000 పరుగులు చేసిన బాబర్ ఆజాం

    పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజాం

    ఫొటో సోర్స్, Facebook/Pakistan Cricket Team

    టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం బద్దలు కొట్టాడు.

    కెప్టెన్‌గా 13 ఇన్నింగ్సుల్లోనే 1,000 పరుగులను బాబర్ ఆజాం పూర్తి చేశాడు. గతంలో టీం ఇండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లి 17 ఇన్నింగ్సుల్లో 1,000 పరుగులు సాధించాడు.

    ముల్తాన్ వేదికగా వెస్ట్ ఇండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ కొట్టడం ద్వారా బాబర్ ఈ రికార్డ్ నెలకొల్పాడు.

    ఐసీసీ టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్న బాబర్, టెస్టుల్లో నాలుగో స్థానంలో ఉన్నాడు.

  3. నేడు నయనతార పెళ్లి

    నయనతార, విగ్నేష్ శివన్

    ఫొటో సోర్స్, wikkiofficial/Instagram

    నేడు సినీనటి నయనతార పెళ్లి జరగనుంది. తమిళ సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారు.

    నయనతార, విగ్నేష్ శివన్ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

    బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ పెళ్లికి హాజరవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

    తొలుత తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని వాళ్లు భావించారు. కానీ కొన్ని రకాల సమస్యల పెళ్లి వేదికను మార్చినట్లు విగ్నేష్ తెలిపారు.

  4. కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?

  5. ‘బిహార్‌లో అన్ని మతాల వారు సామరస్యంగా జీవిస్తున్నారు’

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

    ఫొటో సోర్స్, Facebook/Nitish Kumar

    బిహార్‌లో మత మార్పిళ్ల నిషేధ చట్టం అవసరం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.

    తమ రాష్ట్రంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి సామరస్యంగా జీవిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మత కలహాలు చెలరేగకుండా తాము తగిన చర్యలు తీసుకుంటామని నితీశ్ కుమార్ తెలిపారు.

    బిహార్‌లో నితీశ్ కుమార్‌తో పొత్తులో ఉన్న బీజేపీ పార్టీ నేతలు మత మార్పిడి నిషేధిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

    నితీశ్ కుమార్, బీజేపీ మధ్య దూరం పెరుగుతోందంటూ ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  6. ‘విద్వేషపూరిత వాతావరణం మంచిది కాదు’

    ఇతర మతాలను కూడా గౌరవించాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు. భారత్ వంటి భిన్నత్వం కలిగిన దేశంలో విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని, పరోక్షంగా అరబ్ దేశాల స్పందనను ప్రస్తావించారు.

    మొహ్మద్ ప్రవక్త గురించి బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదం అయిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. నేడు దక్షిణాఫ్రికాతో తొలి టీ20

    భారత క్రికెటర్ రిషభ్ పంత్

    ఫొటో సోర్స్, BCCI/IPL

    రిషభ్ పంత్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాతో నేడు టీం ఇండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. కేఎల్ రాహుల్‌కు గాయం కావడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషభ్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేశారు.

    వాస్తవానికి రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి కేఎల్ రాహుల్‌ను దక్షిణాఫ్రికా సిరీస్‌కు కెప్టెన్ చేశారు. కాకపోతే గాయం వల్ల ఈ సిరీస్ నుంచి రాహుల్ వైదొలిగాడు.

    ఇటీవలే ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్‌గా నియమించారు.

    నేటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా అయిదు మ్యాచులు ఆడనున్నాయి.

    రిషభ్ పంత్ సొంత ఊరైన దిల్లీలో నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఇది తనకు ఎంతో ఆనందం కలిగించే విషయమని పంత్ చెబుతున్నాడు.

    షెడ్యూల్ ఇలా...

    తొలి టీ20: జూన్ 9 - దిల్లీ

    2వ టీ20: జూన్ 12 - కటక్

    3వ టీ20: జూన్ 14 - విశాఖపట్నం

    4వ టీ20: జూన్ 17 - రాజ్‌కోట్

    5వ టీ20: జూన్ 19 - బెంగళూరు

  8. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  9. నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యలపై పుతిన్ స్పందించారా? భారత్‌కు సలహా ఇచ్చారా?