దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
నేటి ముఖ్యాంశాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ
యూనిట్‌లో పేలుడు సంభవించి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని
విశ్వహిందూ పరిషత్ ప్రకటించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
చైనాలోని గియుఝో ప్రావిన్స్‌లో శనివారం వేగంగా వెళుతున్న
బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ చనిపోగా ఎనిమిది మంది
ప్రయాణికులు గాయపడ్డారు.
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక
సంఘటనలకు సంబంధించి 36 మందిని అరెస్ట్ చేశామని, మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు శనివారం
తెలిపారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక
అత్యాచారం కేసులో ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, టాప్
సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలిచింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్
తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్
యుద్ధానికి సంబంధించిన అప్టేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వంద రోజులు
ఫ్రెంచ్ ఓపెన్: చాంపియన్ ఇగా స్వియాటెక్
మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో
విజేతగా నిలిచింది.
శనివారం జరిగిన ఫైనల్లో పోలాండ్‌కు
చెందిన స్వియాటెక్ 6-1, 6-3తో అమెరికా టీనేజర్ కోకో గాఫ్‌పై గెలుపొంది రెండోసారి
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌న హస్తగతం చేసుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ మ్యాచ్‌లో గెలుపొంది చాంపియన్‌గా నిలవడంతో పాటు వరుసగా వరుసగా 35వ మ్యాచ్‌లో నెగ్గి వీనస్ విలియమ్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది.
21 ఏళ్ల స్వియాటెక్ కన్నా ముందు అమెరికా క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ వరుసగా 35 మ్యాచ్‌ల్లో గెలుపొందారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
సింగపూర్: చికెన్ రైస్ దుకాణాల దగ్గర జనాలు ఎందుకు క్యూ కడుతున్నారు
హైదరాబాద్: గ్యాంగ్ రేప్ జరిగిన ఇన్నోవా కారు స్వాధీనం
ఫొటో సోర్స్, bbc
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక
అత్యాచారం కేసులో ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కారులోనే అత్యాచారం జరిగినట్లుగా
చెబుతున్నారు.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అయిదుగురిలో
ఒకరైన సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.
న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్
విధించింది.
అస్సాం ముఖ్యమంత్రి వర్సెస్ దిల్లీ ఉప ముఖ్యమంత్రి
ఫొటో సోర్స్, facebook
ఫొటో క్యాప్షన్, హిమంత బిశ్వ శర్మ, మనీశ్ సిసోడియా
దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అస్సాం
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి.
అస్సాంలో పీపీఈ కిట్‌ల విషయంలో భారీ అవినీతి
జరిగిందని.. 2020లో అస్సాం ఆరోగ్య మంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ(ప్రస్తుం అస్సాం
సీఎం) అవినీతికి పాల్పడ్డారని.. తన భార్య, కుమారుడి వ్యాపార భాగస్వాములకు చెందిన
సంస్థలకు పీపీఈ కిట్‌ల సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని మనీస్ సిసోడియా ఆరోపించారు.
బీజేపీ ఆయన్ను జైలులో పెట్టాలని ఆయన అన్నారు.
కాగా, మనీస్ సిసోడియా వ్యాఖ్యలపై హిమంత బిశ్వ
శర్మ స్పందించారు. తన భార్య 1500 పీపీఈ కిట్‌లను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని
ఆయన చెప్పారు.
కోవిడ్ సమయంలో దిల్లీలో మరణించిన ఓ అస్సాం
వ్యక్తి మృతదేహాన్ని రప్పించడానికి అప్పట్లో తమకు 7 రోజులు పట్టిందంటూ దిల్లీ
ప్రభుత్వాన్ని విమర్శించారు.
మనీస్ సిసోడియాపై పరువు నష్టం దావా వేస్తానని
హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్: తెలుగు మీడియం తెరమరుగు, 175 ఏళ్ల ఇంగ్లిష్ కల సాకారం కానుందా
8 పరుగులకే ఆలౌట్, ఆరుగురు డకౌట్ - 7 బంతుల్లో లక్ష్యం ఛేదించిన ప్రత్యర్థి జట్టు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు విడుదల చేసిన వీడియోలలో ఏం ఉంది? జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు ఎవరు
ఉత్తర్ ప్రదేశ్: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్‌లో పేలుడు, 8 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌లో ఎలక్ట్రానిక్
పరికరాల తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు.
గాయపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నమని.. బాధ్యులపై చర్యలు
తప్పవని హపూర్ ఐజీ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి అవమానం జరిగిందా
చైనాలో పట్టాలు తప్పిన బుల్లెట్ రైలు.. డ్రైవర్ మృతి, 8 మందికి గాయాలు
ఫొటో సోర్స్, Getty Images
చైనాలోని గియుఝో ప్రావిన్స్‌లో శనివారం వేగంగా
వెళుతున్న బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ చనిపోగా
ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.
బుల్లెట్ రైలు గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌కు
వెళుతుండగా.. ఒక సొరంగం వద్ద పట్టాల మీద ఏవో శిథిలాలు పడటంతో రైలు అదుపు కోల్పోయి
పట్టాలు తప్పిందని చైనా అధికారిక టీవీ చానల్ సీసీటీవీ ఒక కథనంలో చెప్పింది.
చైనాలోని పలు న్యూస్ చానళ్లలో ఈ రైలు ప్రమాదం
వీడియోను చూపించారు. డ్రైవర్ బోగీ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆ దృశ్యాల్లో
కనిపిస్తోంది. మిగతా బోగీలు పెద్దగా దెబ్బతినలేదు.
ఈ ప్రమాదంలో రైల్వే కండక్టర్, మరో ఏడుగురు ప్రయాణికులు
గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారని, వారి ప్రాణాలకు ముప్పు లేదని సీసీటీవీ
చానల్ పేర్కొంది.
సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?
కాన్పూర్‌లో హింస: 3 కేసులు నమోదు, 36 మంది అరెస్ట్
ఫొటో సోర్స్, ANI
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం
జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి 36 మందిని అరెస్ట్ చేశామని, మూడు ఎఫ్ఐఆర్‌లు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు శనివారం తెలిపారు.
కాన్పూర్‌లోని యతీమ్ ఖానా, పరేడ్ క్రాస్‌రోడ్స్
మధ్య భద్రతను కూడా బలోపేతం చేశారు.
‘‘ఇప్పటివరకూ 36 మందిని అరెస్ట్ చేశాం. మూడు
ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాం. వీడియో ఆధారంగా మరింత మందిని గుర్తిస్తున్నాం’’ అని
పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా చెప్పారు.
‘‘కుట్రదారుల మీద గ్యాంగ్‌స్టర్ చట్టం కింద
చర్యలు చేపట్టటం జరుగుతుంది. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవటం కానీ ధ్వంసం చేయటం
కానీ జరుగుతుంది’’ అని ఆయన తెలిపారు.
కాన్పూర్‌లోని ఒక మార్కెట్ మూసివేత అంశంపై భిన్న
మతాలకు చెందిన రెండు వర్గాల వారు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు,
ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు.
ఒక వర్గం వారు దుకాణాలను మూసివేయించటానికి
ప్రయత్నించగా, దానిని మరో వర్గం వారు వ్యతిరేకించటంతో ఈ ఘర్షణ మొదలైనట్లు పోలీసులు
చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
నల్గొండ జిల్లాలో దారుణం.. యువకుడి కిడ్నాప్, హత్య, బి.కోటేశ్వరరావు, బీబీసీ కోసం
ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, హతుడు రాజశేఖర్ (ఫైల్ ఫొటో)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కట్టంగూరు
(మం) అయిటి పాముల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
ఐదు రోజుల క్రితం కిడ్నాపైన రాజశేఖర్ (27) అనే యువకుడు రామచంద్రపల్లి శివారులో హత్యకు గురయ్యాడు.
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రాజశేఖర్‌ను అతడి స్నేహితుడు
వెంకన్న హతమర్చినట్టు, హత్య అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టు పోలీసులు
అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం నింధితుడ్ని అదుపులోకి తీసుకున్న
పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో
పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
ఎలాన్ మస్క్ ప్రకటన తర్వాత.. 9 శాతం పడిపోయిన టెస్లా షేర్ల విలువ
ఫొటో సోర్స్, Reuters
టెస్లా కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 10 శాతం మేర
తగ్గించాలని, కొత్త ఉద్యోగుల నియామకాన్ని నిలిపివేయాలని తాను భావిస్తున్నట్లు కంపెనీ
సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటన చేసిన అనంతరం టెస్లా షేర్లు పతనమయ్యాయి.
ఆర్థికవ్యవస్థ బాగున్నట్లుగా తనకు అనిపించటం
లేదని, కాబట్టి ఉద్యోగుల సంఖ్యను 10 శాతం తగ్గించాలని భావిస్తున్నానని మస్క్
శుక్రవారం నాడు కంపెనీకి పంపిన ఒక ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
దేశంలో కొత్తగా నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయని
అమెరికా కార్మిక శాఖ మే నెలలో పేర్కొంది. కానీ అమెరికాలో ద్రవ్యోల్బణం అమాంతంగా
పెరుగుతోంది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు రాబోయే నెలల్లో వడ్డీ రేట్లను మరింతగా
పెంచుతుందని భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో టెస్లా కంపెనీలో ప్రపంచ
వ్యాప్తంగా కొత్త నియామకాలను నిలిపివేయాలని సూచిస్తూ ఎలాన్ మస్క్ కంపెనీ
ఎగ్జిక్యూటివ్‌లకు మెసేజ్ పంపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది.
మస్క్ ప్రకటన అనంతరం శుక్రవారం నాడు అమెరికా
స్టాక్ ఎక్సేంజిలో టెస్లా షేర్ల విలువ 9 శాతం పడిపోగా, నాస్డాక్‌లో దాదాపు 2 శాతం
దిగజారింది.
అనంతబాబు మీద హత్య కేసు విచారణ ఎలా సాగుతోంది, ఆయన ఎమ్మెల్సీగా కొనసాగవచ్చా?
కరోనావైరస్: దేశంలో 24 గంటల్లో 3,962 కేసులు నమోదు
ఫొటో సోర్స్, EPA
భారతదేశంలో
గడచిన 24 గంటల్లో 3,962 కొత్త కరోనావైరస్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు
చెప్తున్నాయి. కోవిడ్ కారణంగా ఈ ఒక్క రోజులో మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం
దేశవ్యాప్తంగా 22,416 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
సమాచారం.
ఇప్పటివరకూ దేశంలో 4 కోట్ల 31 లక్షల 72 వేల 547
కోవిడ్ కేసులు నమోదు కాగా.. 5 లక్షల 24 వేల 677 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
కర్ణాటకలోని
శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్
ప్రకటించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో నగరంలో శనివారం సాయంత్రం 6 గంటల వరకూ 144 సెక్షన్ కింద
నిషేధాజ్ఞలు విధించారు.
మాండ్యా
జిల్లాలోని ఈ మసీదులో శనివారం ప్రార్థనలు నిర్వహించటానికి విశ్వహిందూ పరిషత్ జూన్
4వ తేదీన ‘చలో శ్రీరంగపట్నం’ పిలుపునిచ్చిందని బెంగళూరు నుంచి బీబీసీ అసోసియేట్
జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషి చెప్పారు.
అయితే శనివారం
నాడు శ్రీరంగపట్నంలో ఎలాంటి ప్రదర్శనకు, సభకు అనుమతి ఇవ్వబోమని మాండ్యా పోలీస్
సూపరింటెండెంట్ యతీశ్ ఎన్ విలేకరులకు తెలిపారు. ఎలాంటి అవాంఛిత ఘటనలూ జరగకుండా నివారించటానికి
తగినంత భద్రతా ఏర్పాట్లు చేశామని, పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ప్రస్తుతం నగరంలో పూర్తి శాంతి నెలకొని ఉంది. మా సిబ్బందిని మోహరించాం. నాయకులతో మాట్లాడాం. నిషేధాజ్ఞలు విధించినట్లు వారికి చెప్పాం. వీటిని ఉల్లంఘిస్తే వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారు’’ అని ఎస్‌పీ వివరించారు.
అలాగే ‘‘శనివారం నాడు ఇక్కడ నిర్వహించే వారాంతపు మార్కెట్‌ను వాయిదా వేయించాం. శ్రీరంగపట్నం పరిసరాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో మద్యం విక్రయాలను నిషేధించాం. మసీదు రోడ్డును మూసివేశాం. జనం మసీదులోకి ప్రవేశించటానికి అనుమతిలేదు’’ అని మాండ్యా డీసీ అశ్వథి ఎస్ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘మసీదు చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెట్టటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు.
శ్రీరంగపట్నం కోటలో ఉన్న జామియా మసీదును ఒక హనుమాన్ ఆలయాన్ని కూల్చి నిర్మించారని విశ్వహిందూ పరిషత్ వాదిస్తోంది.
అయితే.. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. మస్జిద్-ఎ-అలా అని పిలిచే ఈ మసీదును టిపు సుల్తాన్ 1782వ సంవత్సరంలో నిర్మించినట్లు మసీదులో పర్షియన్ భాషలో రాసివున్న శాసనం చెప్తోంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్
తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ
వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.