నేటి ముఖ్యాంశాలు
- దేశ రాజధాని దిల్లీలోని ముండ్కాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారని ఔటర్ డీసీపీ సమీర్ శర్మ తెలిపారు.
- గోధుమల ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది.
- రష్యాతో యుద్ధం ఆగస్టు మధ్యలో మలుపు తీసుకుంటుందని, ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ అన్నారు.
- జ్ఞాన్‌వాపి మసీదు కేసుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, ముస్లింలు ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మరో మసీదును పొగొట్టుకోలేరని అన్నారు.
- త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఎన్నికయ్యారు.
- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో అవమానకరమైన పోస్టును షేర్ చేసిన మరాఠీ నటి కేత్కీ చితాలేను థానే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.