You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రెండేళ్ల తర్వాత పర్యటకులకు స్వాగతం పలుకుతున్న న్యూజీలాండ్

రెండేళ్ల పాటు కోవిడ్ కారణంగా సరిహద్దులను మూసేసిన న్యూ జీలాండ్ పర్యటకులకు తిరిగి ఆహ్వానం పలుకుతోంది. అయితే, న్యూజీలాండ్‌కు రావాలనుకునే వారందరూ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని కోవిడ్ పరీక్ష ఫలితాల్లో నెగిటివ్ రావల్సి ఉంటుంది.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. ఏపీ: ‘సీఎంఓ నుంచి అంటూ ఎమ్మెల్యేలకు టోకరా.. 80 లక్షలతో గాజువాకలో ప్రియురాలికి ఇల్లు’

  2. కుదిపేసిన స్పైస్‌జెట్ విమానం.. 13 మందికి తీవ్రగాయాలు

    ముంబయి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపుర్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం కుదుపులకు (టర్బులెన్స్) లోనైంది. దీంతో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

    ఆదివారం సాయంత్రం దుర్గాపుర్‌లో బోయింగ్ బీ737విమానం (ఎస్‌జీ-945) ల్యాండింగ్ అయ్యే సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై డైరెక్టర్ జనరల్ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.

    గాయాల పాలైన వారికి వెంటనే వైద్యపరమైన సాయం అందించామని స్పైస్‌జెట్ తెలిపింది.

    లగేజీ తల మీద పడిపోవడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, విమానం మొత్తానికి సురక్షితంగానే ల్యాండ్ అయ్యిందని, వెంటనే ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారని పేర్కొంది.

    ప్రతికూల వాతావరణం వల్లే విమానం కుదుపులకు లోనైనట్లు గాయాలపాలైన ప్రయాణికుడు అక్బర్ అన్సారీ ఏఎన్ఐతో చెప్పారు.

    ఘటనపై విచారం వ్యక్తంచేస్తూ స్పైస్‌జెట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

  3. ప్రశాంత్ కిశోర్: నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లడానికి ‘‘జన్ సురాజ్’’..

    ప్రజల సమస్యలు అర్థంచేసుకోవడానికి, సుపరిపాలన కల సాధ్యం చేసేందుకు నేరుగా ప్రజల దగ్గరకే వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం ట్వీట్ చేశారు.

    ఈ ప్రయాణం బిహార్ నుంచే మొదలుపెడతానని సోమవారం ఆయన ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు.

    ‘‘ప్రజా ప్రయోజన విధానాలను రూపొందించడంలో సాయం చేయడం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కోసం చేసిన ప్రయత్నాలతో పదేళ్లు నేను కాలం వెనుక పరుగులు తీశాను. ఇప్పుడు ప్రజల దగ్గరకు నేరుగా వెళ్లాల్సిన సమయం వచ్చింది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

    సమస్యలు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, ప్రజల దగ్గరకు చేరుకోవడానికి నేను ఎంచుకున్నకొత్త మార్గం ‘‘జన్ సురాజ్’’అని ఆయన వ్యాఖ్యానించారు.

    మూడు రోజుల క్రితం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు కొత్త పార్టీ పెడతారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘రెండు, మూడు రోజుల్లో ప్రజలకు చెబుతాను’’అని ఆయన సమాధానం ఇచ్చారు.

  4. హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది

    తెలంగాణతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ హీట్‌వేవ్‌లు నమోదు కావొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.

    తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతోపాటు విదర్భ, తూర్పు మధ్య‌ప్రదేశ్, పశ్చిమ మధ్య‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌లకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది.

    గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల వరకు వెళ్లొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

    ఇంతకీ ఎల్లో అలర్ట్ అంటే ఏమిటి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

    పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  5. చెన్నై సూపర్‌కింగ్స్: కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవడంపై ధోనీ ఏమన్నారు?

    ఐపీఎల్‌లో ఆదివారంనాటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు విజయం సాధించింది. చెన్నై జట్టు సారథ్య బాధ్యతలను ఎంఎస్ ధోనీ తీసుకున్న నేపథ్యంలో జట్టు ఈ మ్యాచ్ గెలిచింది.

    ఈ సీజన్‌లో చెన్నై మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడితే గెలిచింది మూడే. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించారు. దీంతో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కానీ, ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు జట్టు ఓడిపోయింది.

    ఒత్తిడి నడుమ రవీంద్ర జడేజా జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో మళ్లీ ధోనీ కెప్టెన్‌గా మారారు. జడేజా కెప్టెన్సీపై తాజా మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడారు.

    ‘‘వచ్చే సీజన్‌లో తాను కెప్టెన్ అవుతానని జడేజాకు గత సీజన్‌లోనే తెలుసు. ఈ సారి మొదటి రెండు మ్యాచ్‌లలో నిర్ణయాలు తీసుకోవడంలో అతడికి నేను సాయం చేశాను. ఆ తర్వాత బాధ్యతలను పూర్తిగా ఆయనకే అప్పగించాను. సొంతంగా నిర్ణయాలు తానే తీసుకుంటే మంచిదని సూచించాను’’అని ధోనీ చెప్పారు.

    ‘‘ఒకసారి కెప్టెన్ అయితే, చాలా బాధ్యతలు మనపై ఉంటాయి. పనులు, ఒత్తిడి పెరగడంతో అతడి ఆటపై కూడా ప్రభావం పడింది. కెప్టెన్సీ వల్ల అతడు బాగా ఒత్తిడికి గురయ్యాడు’’అని ధోనీ అన్నారు.

    ‘‘కెప్టెన్‌గా సన్నద్ధం కావడానికిఅతడికి సరిపడా సమయం దొరికింది. నేను కూడా నెమ్మదిగా బాధ్యతలు ఆయనకు అప్పగించాలని అనుకున్నాను. ఎందుకంటే టాస్ వేయడంలో మాత్రమే పాలుపంచుకుని మిగతా నిర్ణయాలన్నీ వేరేవాళ్లు తీసుకుంటే బాగోదు కదా. వేలు పట్టుకొని నడిపించడం ఎప్పటికీ మంచిది కాదు. ఫీల్డ్‌లో కీలకమైన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ఒకసారి కెప్టెన్ అయ్యాక, మనం చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’’అని ధోనీ వ్యాఖ్యానించారు.

  6. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.