You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఎల్ఐసీ షేర్ ధరల నిర్ణయం... ఒక్కో షేర్ ఎంతంటే..

ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు ఒక షేరుకు 60 రూపాయల రాయితీ... రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు 40 రూపాయల రాయితీ ఇవ్వనున్నట్లు ఎల్‌ఐసీ వర్గాలను ఉటంకిస్తూ వార్తా ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. సాక్షి సింగ్ ధోనీ: ‘రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కారణమేంటి?’

    జార్ఖండ్‌లో విద్యుత్ కోతల మీద మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

    ‘చాలా సంవత్సరాల నుంచి జార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? ఒక ట్యాక్స్ పేయర్‌గా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. విద్యుత్‌ను పొదుపు చేసేందుకు మా వంతు మేం కృషి చేస్తున్నాం.’ అంటూ సాక్షి సింగ్ ట్వీట్ చేశారు.

    డిమాండ్‌కు తగిట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దేశవ్యాప్తంగా పవర్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు అందడం లేదనే వార్తలు వస్తున్నాయి. వేసవి కాలం కావడంతో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది.

    బొగ్గును మరింత వేగంగా పవర్ ప్లాంట్లకు తరలించేందుకు గల అవకాశాలను పరిశీలించడానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ సోమవారం సమావేశమయ్యారు.

  2. యుక్రెయిన్ యుద్ధం: ‘రష్యాతో నాటో పరోక్ష యుద్ధం చేస్తోంది’

    పశ్చిమదేశాలు యుక్రెయిన్‌కు ఆయుధాలు అందించడమంటే నాటో కూటమి రష్యాతో పరోక్ష యుద్ధానికి దిగినట్లేనని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ అన్నారు.

    ‘యుక్రెయిన్ మీద ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన నేపథ్యంలో రష్యా మిలిటరీ మీద దాడి చేసేందుకే ఆ ఆయుధాలని’ లావ్రోవ్ సోమవారం రష్యా ప్రభుత్వ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

    పరోక్షంగా చేసినా ప్రత్యక్షంగా చేసినా యుద్ధం యుద్ధమేనని లావ్రోవ్ చెప్పుకొచ్చారు.

  3. ఉత్తర్ ప్రదేశ్: పరస్పర అంగీకారంతో మైకులు తొలగించిన గుడి, మసీదు

    ఉత్తర ప్రదేశ్‌లోని గాంధీ చౌక్ ప్రాంతంలోని రామ్ జానకీ దేవాలయం, సున్నీ జమా మసీద్ కొన్ని మీటర్ల దూరంలో ఉంటాయి.

    అయితే రెండు ప్రార్థనా మందిరాలకు చెందిన ప్రతినిధులు చర్చలు జరిపి మైకులు తొలగించేందుకు అంగీకరించారని ఎస్‌డీఎం సన్యా చాబ్రా తెలిపారు.

  4. ఎలాన్ మస్క్: ట్విటర్‌‌లో కొత్త పీచర్లు తీసుకొస్తాం

    ప్రపంచం సంపన్నుడు ఎలాన్ మస్క్ త్వరలోనే ట్విటర్‌ను సొంతం చేసుకోనున్నారు. సుమారు రూ.3.34 లక్షల కోట్లకు ట్విటర్‌ను విక్రయించేందుకు ఆ సంస్థ బోర్డు అంగీకరించింది.

    సుమారు రెండు వారాల కిందట ట్విటర్‌ను కొంటాను అంటూ ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ తొలుత ఇందుకు అంగీకరించని ట్విటర్ తాజాగా అమ్మేందుకు ఒప్పుకుంది.

    ట్విటర్‌లో అనేక సంస్కరణలు తీసుకొస్తానంటూ ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ప్రస్తుతం పోస్టులపై ఉన్న ఆంక్షలను తొలగించడంతోపాటు ఫేక్ ట్విటర్ అకౌంట్లను తొలగిస్తామని మస్క్ అంటున్నారు.

    ‘ప్రజాస్వామ్య మనుగడకు స్వేచ్ఛగా భావాలను ప్రకటించడమనేది ఎంతో కీలకం. ట్విటర్‌ను మరింత మెరుగ్గా మారుస్తాం. కొత్త ఫీచర్లు తీసుకొస్తాం.’ అని ఎలాన్ మస్క్ అన్నారు.

  5. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  6. ఎల్ఐసీ షేర్ ధరల నిర్ణయం... ఒక్కో షేర్ ఎంతంటే..