ఎల్ఐసీ షేర్ ధరల నిర్ణయం... ఒక్కో షేర్ ఎంతంటే..
ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు ఒక షేరుకు 60 రూపాయల రాయితీ... రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు 40 రూపాయల రాయితీ ఇవ్వనున్నట్లు ఎల్‌ఐసీ వర్గాలను ఉటంకిస్తూ వార్తా ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.
లైవ్ కవరేజీ
వరికూటి రామకృష్ణ
నేటి ముఖ్య పరిణామాలు...
- పశ్చిమదేశాలు యుక్రెయిన్‌కు ఆయుధాలు అందించడమంటే నాటో కూటమి రష్యాతో పరోక్ష యుద్ధానికి దిగినట్లేనని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ అన్నారు.
- అత్యవసర పరిస్థితుల్లో 6-12 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు జారీ చేసింది. అయితే కొన్ని పరిమితుల మధ్య మాత్రమే వాడాలని నిర్దేశించింది.
- కరాచీ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో నలుగురు మృతి చెందారు. ఇందులో చైనాకు చెందిన ముగ్గురు టీచర్లు ఉన్నారు.
- సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో తెలంగాణకు చెందినగ్రామాలే టాప్-10లో నిలవడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక్కడితో బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన లైవ్ అప్డేట్ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
హైదరాబాద్: పప్పా కీ హలీం అంటూ తండ్రి వ్యాపారాన్ని ఆ పిల్లాడు ఎలా ప్రమోట్ చేశాడో చూడండి
ఎలాన్ మస్క్: ట్విటర్‌ను రూ. 3.37 లక్షల కోట్లకు కొని ఆయన ఏం చేయబోతున్నారు?
ఎల్ఐసీ షేర్ ధరల నిర్ణయం... ఒక్కో షేర్ ఎంతంటే..

ఫొటో సోర్స్, Getty Images
ఎల్‌ఐసీ ఐపీఓకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్ రూ.902- రూ.949 మధ్య ఉంటుందని నిర్ణయించారు. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసీ ఐపీఓ మే 4వ తేదీన జరగవచ్చు.
ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు ఒక షేరుకు 60 రూపాయల రాయితీ... రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు 40 రూపాయల రాయితీ ఇవ్వనున్నట్లు ఎల్‌ఐసీ వర్గాలను ఉటంకిస్తూ వార్తా ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ మే 4 నుంచి 9 వరకు అందుబాటులో ఉండొచ్చు.
ప్రభుత్వం, ఎల్‌ఐసీలోని 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని భావిస్తోంది.
ఫిబ్రవరిలో సెబీకి సమర్పించిన ముసాయిదాలో ఈ మేరకు పేర్కొంది. అయితే, రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా షేర్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతుండటంతో ఇష్యూ పరిమాణాన్ని తగ్గించింది.
కేవలం 3.5 శాతం వాటాలనే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిద్వారా రూ. 21,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దిల్లీ జహంగీర్‌పురి హింస: కేజ్రీవాల్ మౌనం ఎందుకు కలకలం రేపుతోంది?
కేటీఆర్: ‘దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాల్లో తెలంగాణ గ్రామాలే ఉండటం గర్వంగా ఉంది’
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో తెలంగాణకు చెందినగ్రామాలే టాప్-10లో నిలవడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాల్లో నిలిచిన గ్రామ పంచాయతీల జాబితాను ఆయన ట్వీట్ చేశారు. ఈ జాబితాలోని టాప్-20 గ్రామపంచాయతీల్లో 19 తెలంగాణ రాష్ట్రానికి చెందినవే ఉన్నాయని ఆయన తెలిపారు.
గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్ని అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ప్రశంసించారు.

ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి 93.54 శాతంతో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది.
యాదాద్రి జిల్లాకు చెందిన వడపర్తి పంచాయతీ 92.17 శాతంతో రెండో స్థానంలో, కరీంనగర్ జిల్లాకు చెందిన కొండపూర్ (91.7 శాతం) మూడో స్థానంలో, నిజామాబాద్ జిల్లాకు చెందిన పాల్డా (90.95 శాతం) నాలుగో స్థానంలో, కరీంనగర్ జిల్లాకు చెందిన రామకృష్ణాపూర్ (90.94 శాతం) అయిదో స్థానంలో నిలిచాయి.
తర్వాతి స్థానాల్లో వరుసగా యాదాద్రికి చెందిన కొలనుపాక (90.57 శాతం). వెల్మల్ (నిజామాబాద్, 90.49 శాతం), మూలరాంపూర్ (జగిత్యాల, 90.47 శాతం), తానా కుర్ద్ (నిజామాబాద్, 90.3 శాతం), కుకునూర్ (నిజామాబాద్, 90.28 శాతం) గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన అనేది గ్రామీణాభివృద్ధి కార్యక్రమం. పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాలు, దేశంలోని ఏవైనా గ్రామాలు ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసే విధంగా రూపొందించిన పథకమే ఇది

ఫొటో సోర్స్, SAGY website
తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్లు: ప్రిపేర్ అవుదామంటే పుస్తకాలు ఎందుకు దొరకడం లేదు?
కరాచీ యూనివర్సిటీలో బాంబు పేలుడు, నలుగురి మృతి

ఫొటో సోర్స్, Getty Images
కరాచీ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో నలుగురు మృతి చెందారు. ఇందులో చైనాకు చెందిన ముగ్గురు టీచర్లు ఉన్నారు.
ఫారిన్ ఫ్యాకల్టీ నుంచి కన్ఫ్యూషియస్ సెంటర్‌కు వస్తోన్న వ్యానులో బాంబు పేలింది. ఈ ఘటనలోకన్ఫ్యూషియస్ సెంటర్‌కు నూతన డైరెక్టర్‌గా నియమితులైన హాంగ్ గూఫింగ్, ఇద్దరు టీచర్లు డింగ్ ముఫెంగ్, చెస్ సై, వ్యాన్ డ్రైవర్ ఖాలిద్ మరణించారు.
ఒక చైనా పౌరుడు, స్థానిక పౌరుడు గాయపడ్డారు. భద్రతా విధుల్లో ఉన్న ఇద్దరు రేంజర్లకు కూడా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పటేల్ ఆసుపత్రికి తరలించారు.
సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబు పేలుడు ఏ రకమైనదో ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అన్నారు.
ఫాక్లాండ్ దీవులు: అర్జెంటీనా, బ్రిటన్‌ల మధ్య వివాదంపై బీజేపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు?
ప్రశాంత్ కిశోర్: ‘కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిరస్కరించానంటే...’

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం గురించి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించినట్లు తొలుత పార్టీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. తాజాగా ప్రశాంత్ కిశోర్ దీనిపై ట్వీట్ ద్వారా స్పష్టత ఇచ్చారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ఈఏజీ (ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్)లో భాగంగా పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్‌ను నేను తిరస్కరించాను. నా అభిప్రాయం ప్రకారం... పార్టీకి ఇప్పుడు నాకంటే ఎక్కువగా నాయకత్వం, సమష్టిగా పనిచేసే సంకల్పం అవసరం ఉంది. పార్టీ నిర్మాణాత్మకమైన సమస్యల్లో కూరుకుపోయింది. వాటి నుంచి బయటపడటానికి పార్టీకి నాయకత్వం కావాలి’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇటీవలే, సోనియా గాంధీ సమక్షంలో ప్రశాంత్ కిశోర్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024 ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌గా ఈ ప్రజెంటేషన్‌ను భావిస్తున్నారు. పార్టీలో ప్రశాంత్ కిశోర్‌కు చోటు ఇచ్చేందుకు సోనియా గాంధీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆయనను సోనియా గాంధీ,పార్టీలోకి ఆహ్వానించినట్లుగా రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ ద్వారా తెలిసింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బందరు పోర్టు కల ఎప్పటికి సాకారమవుతుంది... పనులు ఎందుకు ముందుకు కదలడం లేదు?
సుప్రీం కోర్టు: ‘హిందూ ధర్మ సంసద్ సభలో విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకోండి’

ఫొటో సోర్స్, ANI
బుధవారం రూర్కీలో జరగనున్న హిందూ ధర్మ సంసద్ సభలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను అడ్డుకునేందుకు ఇంత వరకు తీసుకున్న చర్యలకు సంబంధించి వివరణ ఇవ్వడంతోపాటు అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని కోరింది.
హిందూ ధర్మ సంసద్ సభలో ఏమైనా విద్వేష పూరిత ప్రసంగాలు చోటు చేసుకుంటే దానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శిని బాధ్యులు చేస్తామని, కోర్టుకు సైతం రావాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కేసీఆర్: ‘మత గొడవల్లో చిక్కుకుంటే తెలంగాణకు పెట్టుబడులు రావు’

ఫొటో సోర్స్, Facebook/KCR
నేడు దేశంలో మతం, కులం పేర్లతో రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
మతం, కులం పేరుతో హైదరాబాద్‌లో నిత్యం గొడవలు జరుగుతుంటే పెట్టుబడులు రావని, ఉద్యోగాల కల్పన జరగదని కేసీఆర్ అన్నారు.
అల్వాల్‌లోతెలంగాణఇన్‌స్టిట్యూట్ఆఫ్మెడికల్సైన్సెస్ (టిమ్స్) సూపర్స్పెషాలిటీఆసుపత్రిశంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
‘కొందరు మతం పేరు మీద, కొందరు కులం పేరు మీద చిల్లమల్లర రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతదేశం అన్ని మతాలను, కులాలను సమానంగా ఆదరిస్తుంది. ఈ సామరస్య వాతావరణాన్ని చెడగొట్టుకుంటే మనం ఎటుకాకుండా పోతాం.
ఒకసారి ఆ క్యాన్సర్ జబ్బు మనకు పట్టుకుంటే మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. ఈ రోజు అనేక విషయాలు మీరు పేపర్లలో చూస్తున్నారు. పలాన వాళ్ల షాపులో పూలు కొనొద్దు. పలాన వాళ్ల షాపులో ఇది కొనొద్దు... అది కొనొద్దు అని మాట్లాడతా ఉన్నారు.
విదేశాల్లో సుమారు 13 కోట్ల మంది భారతీయులు పని చేస్తున్నారు. వాళ్లందరినీ ఆ ప్రభుత్వాలు వెనక్కి పంపిస్తే వాళ్లకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
అలాగే తెలంగాణలో విద్యుత్ సమస్యలేదన్న కేసీఆర్, ‘నేడు తెలంగాణలో కరెంటు పోతే వార్త. దేశంలో కరెంటు ఉంటే వార్త’ అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే కరెంటు కోసం రైతులు వీధుల్లోకి వస్తున్నారని కానీ పసి కూన అయిన తెలంగాణలో ఆ ఇబ్బంది లేదని ఆయన చెప్పుకొచ్చారు.
కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
కరోనా వ్యాక్సిన్: 6-12 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్

ఫొటో సోర్స్, Facebook/Bharat Biotech
అత్యవసర పరిస్థితుల్లో 6-12 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు జారీ చేసింది. అయితే కొన్ని పరిమితుల మధ్య మాత్రమే వాడాలని నిర్దేశించింది.
తొలి రెండు నెలలు వ్యాక్సిన్ ప్రభావంపై ప్రతి 15 రోజులకొకసారి డేటాను తమకు సమర్పించాలని కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్‌ను డీసీజీఐ ఆదేశించింది.
ప్రస్తుతానికి దేశంలో 12 సంవత్సరాల కంటే పెద్దవారికి మాత్రమే కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే ఇటీవల కార్బీవ్యాక్స్‌ను 12-14 వయసు గ్రూపుకు వాడేందుకు ప్రభుత్వం అనుతులిచ్చింది.
సిక్స్ ప్యాక్ సాధించిన 11 ఏళ్ళ అమ్మాయి
‘యుక్రెయిన్, రష్యా ఘర్షణలు అణ్వాయుధాల వాడకానికి దారి తీయొచ్చు’
యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తెలిపింది. ‘ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితిని తక్కువగా అంచనా వేయకూడదు.’ అని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్జీ లావ్రోవ్ అన్నారు.
రష్యా ప్రభుత్వానికి చెందిన రష్యన్ ఫస్ట్ చానెల్‌తో సోమవారం ఆయన మాట్లాడారు.
పరిస్థితులు చూస్తుంటే యుక్రెయిన్, రష్యా ఘర్షణలు అణ్వాయుధాల వాడకానికి దారి తీయొచ్చని లావ్రోవ్ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధం రావొచ్చని హెచ్చరించారు.
ఈ హెచ్చరికల మధ్యే ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యూటేరస్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు.
రష్యా బలగాలు చుట్టుముట్టిన మరియుపూల్ నగరం మీద ప్రధానంగా వీరు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
దేశంలో ఇప్పటికే భారీగా పెరిగిన వంట నూనెల ధరలు.. ఇప్పుడు మరింత పెరగనున్నాయా?
వంట కోసం ఉపయోగించే పామాయిల్‌తో పాటు దాని ముడి ఉత్పత్తుల ఎగుమతిని ఏప్రిల్ 28 నుంచి నిషేధిస్తున్నట్లు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ చెప్పారు. ఈ నిర్ణయంతో భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? వంట నూనెల ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి?
పోస్ట్ YouTube స్కిప్ చేయండిGoogle YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఎలాన్ మస్క్: రూ.3.37 లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను ఎందుకు కొన్నారు? దీనిని ఏం చేయనున్నారు?
