You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలో కోవిడ్ కేసులు: గత వారం రోజుల్లో 48 శాతం పెరిగిన హోం ఐసోలేషన్ కేసులు
దిల్లీలో రోజువారీ కరోనావైరస్ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. గత వారం రోజుల్లో హోం ఐసోలేషన్ కేసుల సంఖ్య 48 శాతం పెరిగింది. పాజిటివిటీ రేటు కూడా 2.39 శాతం పెరిగినట్లు తాజా లెక్కలు సూచిస్తున్నాయి.
లైవ్ కవరేజీ
సతీష్ ఊరుగొండ & శారద మియాపురం
తిరుమల: భక్తుల ఆత్రుత వల్లే తొక్కిసలాట, - టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుమలలో అదేరోజున దర్శన టోకెన్లు పొందాలనే భక్తుల ఆత్రుత వల్లే మంగళవారం తొక్కిసలాట జరిగిందని టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం అదనపు ఈవో మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు.
‘‘అప్పుడు కేవలం 20 వేల మంది భక్తులు మాత్రమే ఉన్నారు. ఎంతగా నచ్చచేప్పినా, భక్తులు వినక పోవడం వల్ల తోపులాట జరిగింది. ఆ ఘటన నేఫథ్యంలో వెంటనే సర్వదర్శనం టోకెన్ల విధానాన్ని చేశాం’’అని ఆయన చెప్పారు.
‘‘కొన్ని మీడియా సంస్థల్లో ఈ తొక్కిసలాటను గోరంతను కొండంతచేసి టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారు. భక్తుల రద్దీపై టీటీడీ అప్రమత్తంగా లేదనడంలో వాస్తవం లేదు. రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం’’అని ఆయన వివరించారు.
‘‘సామాన్య భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా వీఐపీ తరహలో తిరుమల శ్రీవారి దర్శనం కల్పిచేందుకే టైం స్లాటెడ్ విధానాన్ని అనుసరిస్తున్నాం’’అని ఆయన చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీ చూస్తూఉండండి.