పంజాబ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు స్పందించారు. ‘‘ప్రజల తీర్పే.. దేవుడి తీర్పు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
తను ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నాని ఆయన చెప్పారు. ఆప్‌కు అభినందనలు తెలియజేశారు.
పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆప్ మారింది. 90 నియోజకవర్గాల్లో పార్టీ ముందంజలో ఉంది. ప్రస్తుతం అధికారంలోనున్న కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
117 మంది సభ్యులున్న అసెంబ్లీలో 59 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది















