దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న 5
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఈ
ప్రక్రియ మొదలవుతుంది. 8:30 గంటల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం)ని
ఓట్లను లెక్కిస్తారు.
ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు ఎలక్షన్
కమిషన్ (ఈసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 672 మంది కౌంటింగ్ పర్యవేక్షకులు,
130 మంది పోలీసు అబ్జర్వర్లు, 10 మంది ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసింది.
వీరంతా లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తుంటారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్, వారణాసి
నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలను నిరోధించడానికి ఇద్దరు
ప్రత్యేక అధికారులను నియమించింది.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లపై
కేంద్ర భద్రతా దళాలతో మూడు దశల పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించడానికి కౌంటింగ్ హాల్స్
పరిసరాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.
ప్రతీ రౌండ్ కౌంటింగ్ అనంతరం ఫలితాలను
విడుదల చేస్తుంటారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను కూడా ఇదే విధంగా ప్రకటిస్తారు.
ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్,
గోవా, మణిపుర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు
దశల్లో జరిగాయి.
ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690
అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరగగా, అస్సాంలోని మజూలీ నియోజకవర్గం
ఉపఎన్నికల ఫలితాలను కూడా వీటితో పాటే ప్రకటించనున్నారు.
తాజాగా ఎన్నికలు జరిగిన ఈ 5
రాష్ట్రాల్లో 4 బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా, పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్
ప్రభుత్వం నడుస్తోంది.