ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ విడుదల చేస్తుంది, ఆర్‌బీఐ పరిధిలోని డిజిటల్ కరెన్సీల లావాదేవీలపై పన్ను ఉంటుంది: నిర్మల సీతారామన్

కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆమె తెలిపారు. రాబోయే పాతికేళ్లకు ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ లాంటిదని ఆమె అభివర్ణించారు.

లైవ్ కవరేజీ

  1. బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, loksabha tv

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

    విపక్షాలు బడ్జెట్ ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అందరికీ మాట్లాడేందుకు అవకాశం వస్తుందని ప్రధాని వారికి సర్ది చెప్పారు.

  2. పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

    బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేబినెట్ సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ చేరుకున్నారు.

    పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ani

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేబినెట్ సమావేశం జరగనుంది.

    ఈ సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పలువురు మంత్రులు పార్లమెంట్ చేరుకున్నారు.

  3. పార్లమెంటుకు చేరుకున్న నిర్మలా సీతారామన్

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఈరోజు 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

    అనంతరం మధ్యాహ్నం 3.45కు నిర్మలా సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొని మాట్లాడతారు

  4. బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్

    2022-23-బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

    ఆ తర్వాత ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ హాండిల్లో ఉన్న వివరాల ప్రకారం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 3.45కు జరుగుతుంది.

  5. రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

    బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం అయ్యారు.

    ఆమెతోపాటూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కిషన్‌రావ్ కరాడ్, పంకజ్ చౌధరి, ఆర్థిక శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు రాష్ట్రపతిని కలిశారు.

  6. రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరిన నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, ani

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి బయల్దేరారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    నిర్మలా సీతారామన్ ఈసారీ కూడా పేపర్‌లెస్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

  7. Budget 2022-23: ఈ బడ్జెట్ నుంచి ఎవరు ఏం కోరుకుంటున్నారు?, అలోక్ జోషి, బీబీసీ ప్రతినిధి

    బడ్జెట్ ఆశలు

    ఫొటో సోర్స్, Reuters

    ఏ బడ్జెట్ కథయినా ప్రజల అంచనాలు, ఆకాంక్షల నుంచే మొదలవుతుంది. అయితే, ఈసారి అంచనాలు, ఆకాంక్షల కన్నా డిమాండ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    ప్రజలు తమ నుంచి చాలా కోరుకుంటున్నారన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇతరులకు ఇవ్వగల శక్తి ఉన్నవారు కూడా ప్రభుత్వం తమకు ఏమిస్తుందోనంటూ ఎదురు చూస్తున్నారు.

    అందరి ఆకాంక్షలు నెరవేర్చాలి. అలా చేయలేని పక్షంలో తాము వాటిని ఎందుకు నెరవేర్చలేకపోయామో చెప్పగలగాలి. కానీ, ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల ప్రజలకు వివరించే ప్రయత్నం చాలా ఖరీదైన వ్యవహారం.

    లోక్‌సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఈ ఐదు రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు వచ్చే ఈ బడ్జెట్‌, ఎన్నికల పద్దులాగా ఉండాల్సిన అవసరముందని బడ్జెట్‌కు, రాజకీయాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్న పండితులు భావిస్తున్నారు.

    ఎన్నికల బడ్జెట్‌కు మరో పేరే ఆకర్షక బడ్జెట్. అంటే ఇందులో ప్రకటించే పథకాలు, ప్రకటనలు, వరాలు వినే వారి హృదయాలను సంతోషపరుస్తాయి.

  8. ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్, సమ్మిళిత బడ్జెట్ అందించబోతున్నాం- పంకజ్ చౌధరి

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, ani

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు.

    కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, భాగవత్ కరాడ్ కూడా ఆర్థిక శాఖ కార్యాలయం చేరుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    “దేశ ప్రధాని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో దేశంలోని అన్ని రంగాల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని..ఒక సమ్మిళిత బడ్జెట్‌ను అందించబోతున్నాం.దేశ ప్రజలకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. దేశం కూడా ముందుకు సాగుతుంది” అని అంతకు ముందు ఏఎన్ఐతో మాట్లాడిన పంకజ్ చౌధరి అన్నారు.

  9. బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే

    బడ్జెట్‌ను సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఆ పరిభాష కొంత తెలుసుకోవాలి.

    బడ్జెట్‌ ప్రసంగాన్ని, బడ్జెట్‌తో ముడిపడిన వ్యవహారాలను అర్థం చేసుకోవడంలో దోహదపడే పది ప్రాథమిక అంశాలు ఇవీ..

  10. మరోసారి పేపర్‌లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, Getty Images

    కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈసారి కూడా ఆమె పేపర్‌లెస్ బడ్టెట్ ప్రవేశపెట్టనున్నారు.

    2020లో నిర్మలా సీతారామన్ ఒక టాబ్లెట్ ద్వారా బడ్జెట్ ప్రసంగం చదివారు. అయితే ఈ సంప్రదాయం ఆంధ్రప్రదేశ్, అస్సాంలో 2018లోనే మొదలైంది.

    టెక్నాలజీకి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం 2020 నుంచే పేపర్‌లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రారంభించింది.

    గతంలో ఆర్థికమంత్రి బడ్జెట్ పత్రాలను ఒక బ్రీఫ్‌కేసులో తీసుకొచ్చేవారు. కానీ నిర్మలా సీతారామన్ 2019లో ఒక ఫైల్లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. ఆ ఫైల్ మీద జాతీయచిహ్నం ఉంది.

    1999కి ముంకు వరకూ సాధారణ బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. కానీ 1999లో జశ్వంత్ సింగ్ ఆ సంప్రదాయాన్ని మార్చారు. ఉదయం 11 గంటలకు దాన్ని ప్రవేశపెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.

    ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020లో ఇచ్చిన బడ్జెట్ ప్రసంగం ఇప్పటివరకూ అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా నిలిచింది.

  11. కేంద్ర బడ్జెట్ లైవ్ పేజీకి స్వాగతం

    ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడతారు.

    ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు వస్తున్న బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ఉన్నాయి.

    కోవిడ్ ఉద్ధృతితో ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులకు లోనవుతున్న తరుణంలో ఈ బడ్జెట్‌పై ఆసక్తి. నెలకొంది.

    ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వ్యక్తిగత వార్షికాదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు.

    మినహాయింపు పరిమితిని ప్రభుత్వం ఈసారి పెంచుతుందనే ప్రచారం జరుగుతోంది.

    బడ్జెట్‌పై బడుగు, వేతన జీవుల ఈసారి ఆశలు పెట్టుకున్నారు.