ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.
39,44,909 కోట్ల అంచనా వ్యయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను
మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు.
మధ్యతరగతి ప్రజలు ఎంతో ఉత్కంఠగా
ఎదురుచూస్తున్న వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులేవీ ఈ బడ్జెట్‌లో చేయలేదు.
కోవిడ్ మహమ్మారి వల్ల జనం దగ్గర
డబ్బులు లేవని.. ఆర్థికవ్యవస్థ బలపడటానికి జనం చేతుల్లో డబ్బులు పెట్టటం ముఖ్యమని,
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచటం ద్వారా కొంతవరకూ ఆ పని చేయవచ్చునని ఆర్థిక
నిపుణులు సూచిస్తూ వచ్చారు.
కానీ.. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక
సంవత్సరంలో 9.25 శాతం వృద్ధి రేటును సాధించిందని ప్రకటించని నిర్మలా సీతారామన్..
ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు.
అయితే.. హైవేలు, రైల్వేలు, వ్యవసాయ
సదుపాయాలు, గృహనిర్మాణం తదితర మౌలిక వసతుల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో పెద్దపీట
వేసినట్లు కనిపిస్తోంది.
ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన
అనంతరం.. పార్లమెంటును బుధవారానికి వాయిదా వేశారు.