ఓట్ల కోసమే చట్టాలు వెనక్కు తీసుకుంది-అఖిలేష్ యాదవ్
ఎన్నికల భయంతోనే ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుందని, రైతుల ప్రయోజనం కోసం కాదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.
"ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఇలాంటి చట్టాలు ఏవైనా తీసుకురావచ్చు" అని ఆయన అన్నారు.
"భవిష్యత్తులో రైతులను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి చట్టాలు తీసుకురామని భరోసా ఎవరు ఇస్తారు" అని ఆయన ప్రశ్నించారు.
"రైతులు క్షమించరు, బీజేపీని తుడిచిపెట్టేస్తారు. బీజేపీ క్షమాపణలు అడుగుతుందా" అన్నారు.