వందకు పైగా దేశాలకు కోవిడ్-19 సురక్షా కవచం
కోవిడ్ వ్యాక్సీన్ గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్ భారత ప్రభుత్వం కేవలం భారత పౌరులకే కాదు, మరో వంద దేశాల ప్రజలకు కోవిడ్-19 నుంచి ఉపశమనం అందిస్తోందని చెప్పారు.
"భారత్ దగ్గర ప్రస్తుతం రెండు వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో భారత పౌరులకు సురక్షా కవచం అందించడం ప్రారంభించాం. దానితోపాటూ వందకు పైగా దేశాలకు కూడా కోవిడ్ 19 నుంచి రక్షణ అందించడం ప్రారంభించాం. త్వరలోనే మిగతా వ్యాక్సీన్లు కూడా అందుబాటులోకి వస్తాయని తెలియడం ఉపశమనం కలిగిస్తోంది" అని నిర్మలా సీతారామన్ అన్నారు.