కరోనావైరస్: 24 గంటల్లో 549 కొత్త కేసులు.. 17 మరణాలు.. ఇండియాలో మొత్తం కేసులు 5,734

కరోనావైరస్ కేసుల సంఖ్య భారతదేశంలో 6 వేలకు చేరుతోంది. 178 మంది మృతి చెందారు. బ్రిటన్‌లో ఒకే రోజు 928 మంది చనిపోవడంతో ఆ దేశంలో కోవిడ్ మృతుల సంఖ్య 7 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వల్ల 88 వేలకు పైగా ప్రజలు మరణించారు.

లైవ్ కవరేజీ

  1. ఒడిశాలో లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగింపు

    నవీన్ పట్నాయక్

    ఫొటో సోర్స్, TWITTER/NAVEEN PATNAIK

    ఫొటో క్యాప్షన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్

    ఒడిశా ప్రభుత్ం లాక్‌డౌన్ పొడిగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    భారతదేశంలో లాక్‌డౌన్ పొడిగించిన మొదటి రాష్ట్రం ఒడిశాయే. లాక్‌డౌన్ సమయంలో రైలు, విమాన సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

    అలాగే, రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను జూన్ 17 వరకు మూసివేయాలని కూడా నవీన్ పట్నాయక్ ఆదేశించారు.

  2. న్యూయార్క్ కోవిడ్ కేసుల్లో అధిక శాతం యూరప్ వాళ్ళే

    న్యూయార్క్

    ఫొటో సోర్స్, Getty Images

    న్యూయార్క్‌లోని అధికశాతం కరోనా కేసులు యూరప్ నుంచి వచ్చిన వారివేనని ఒక అధ్యయనంలో వెల్లడైందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది.

    అమెరికాలో కరోనావైరస్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న న్యూయార్క్‌లో, "మెజారిటీ కేసులు యూరప్‌వే" అని మౌంటి సినాయిలోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌‌కు చెందిన హార్మ్ వాన్ బాకెల్ న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు. న్యయార్క్ కోవిడ్ కేసులపై అధ్యయనం చేసిన వారిలో ఆయనొకరు.

    అయితే, ఈ అధ్యయనాన్ని మరొక బృందం సమీక్షించాల్సి ఉంది.

    కోవిడ్ కేసుల్లో వివిధ సమూహాలను అధ్యయనం చేసిన న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాస్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన మరో అధ్యయన బృందం కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది.

    ఇటీవల చైనాను సందర్శించిన విదేశీయులను అమెరికాలోకి అనుమతించమని అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 1న ఆదేశాలు జారీ చేశారు. కానీ, యూరప్ నుంచి వస్తున్న ప్రయాణికులను మాత్రం మార్చి నెల వచ్చే వరకూ అడ్డుకోలేదు.

  3. అమెరికా అధ్యక్షుడి ప్రశంసలపై స్పందించిన మోదీ

    అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని ప్రశంసిస్తూ ప్రకటన చేసిన తరువాత భారత ప్రధాని మోదీ స్పందించారు.

    కోవిడ్-19 మీద జరిగే పోరాటంలో భారతదేశం మానవాళికి సాధ్యమైనంత సహకారం అందిస్తుందని మోదీ అన్నారు.

    హైడ్రాక్సీక్లోరోక్విన్ నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ట్రంప్ భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కరోనావైరస్‌పై సాగుతున్న పోరాటంలో మానవత్వానికి అండగా నిలిచిన భారత ప్రధాని మోదీ బలమైన నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

    ఆ ట్వీట్‌కు స్పందనగా మోదీ కూడా, కష్టకాలం స్నేహితులను మరింత దగ్గర చేస్తుందని అన్నారు. భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత బలపడిందని అభిప్రాయ పడ్డారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. గాంధీ ఆస్పత్రిలో ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులు

    గాంధీ ఆస్పత్రి వద్ద ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఆందోళన

    ఫొటో సోర్స్, M NARASIMHA

    ఫొటో క్యాప్షన్, గాంధీ ఆస్పత్రి వద్ద ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఆందోళన

    సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. చాలీచాలని జీతాలతో ప్రాణాలకు తెగించి కరోనా కట్టడిలో విధులు నిర్వహిస్తున్న తమకు కేవలం జీతంలో 10శాతం ప్రోత్సాహకం ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు.. తమకు న్యాయం చేసేవరకు వరకు ఆందోళనను విరమించేది లేదని హెచ్చరించారు.

    జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు ప్రకటించిన ప్రోత్సాహకాలనే తమకు కూడా వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు.

    ఆసుపత్రిలోని స్వీపర్లు, పేషంట్ కేర్ సిబ్బంది మెత్తం 150మంది విధులు బహిష్కరించడంతో పారిశుద్ధ్యం ఆటకెక్కే ప్రమాదం ఉందని వైద్యులు, ఇతర సిబ్బంది ఆందోలన వ్యక్తం చేశారు.

    ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహ డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, నర్సింగ్, మరియు పారామెడికల్ సిబ్బంది అందరికీ ఒక నెల జీతం ప్రోత్సాహకంగా చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

    ఆ తరువాత కొద్దిసేపటికి వారు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.

  5. భారత్‌లో 166కు చేరిన కరోనా మృతులు

    భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అందించిన తాజా వివరాల ప్రకారం కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 5,374కు చేరింది.

    ఇప్పటివరకు, ఈ వైరస్ మూలంగా 166 మంది చనిపోయారు. కాగా, కోవిడ్ వ్యాధి నుంచి 472 మంది కోలుకున్నారని ఈ ప్రకటన తెలిపింది.

    కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

  6. మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్, కష్టకాలంలో స్నేహితుల మధ్య సన్నిహిత భాగస్వామ్యం అవసరమన్న ట్రంప్

    అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. కష్ట సమయాల్లో మిత్రుల మధ్య సన్నిహిత భాగస్వామ్యం అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని అమెరికాకు ఎగుమతి చేయాలని నిర్ణయించినందుకు బారతదేశానికి, భారత ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

    భారత్‌లో కరోనావైరస్ మీద పోరాటం చేయడమే కాకుండా, ఈ విషయంలో ప్రపంచానికి సహకరిస్తూ మానవత్వానికి అండగా నిలిచిన ప్రధాని మోదీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

    మలేరియా ఔషధమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై భారత్‌లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు ఆయన మోదీని మెచ్చుకున్నారు.

    ఎగుమతులపై నిషేధం ఎత్తివేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని ఒక రోజు ముందు ట్రంప్ బెదిరించారు. ఆ తరువాత భారత్ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తి వేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. ఆంధ్రప్రదేశ్‌లో 474 క్వారెంటైన్ కేంద్రాలు, కరోనావైరస్ విపత్తును ఎదుర్కోవడానికి ఏపీలో ఏర్పాట్లు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 474 క్వారెంటైన్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాలలో 46,872 పడకలను సిద్ధం చేసింది.

    ఇప్పటికే, దాదాపు 24,537 మందిని ఈ కేంద్రాలలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

    రాష్ట్రంలోని 146 లక్షల కుటుంబాలలో 142 లక్షల కుటుంబాలను గ్రామ లేదా వార్డు సేవకులు సర్వే చేశారని ప్రభుత్వం తెలిపింది.

    బుధవారం నాడు 6,289 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించి వైద్యుల వద్దకుపంపించారు. వీరిలో 1,750 మందిని స్వీయ నిర్బంధంలో ఉంచారు. 15 మందికి టెస్టులు చేశారు.

    కరోనా
  8. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 88 వేలు దాటింది.

    కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా మృతుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.ఏయే దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే:

    భారతదేశం

    కరోనా కేసుల సంఖ్య భారతదేశంలో 5,000 దాటింది. 150 మందికి పైగా కోవిడ్ వ్యాధితో చనిపోయారు. నాలుగు వందలకు పైగా కోవిడ్ బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు.

    అమెరికాలో 14 వేలు దాటిన మరణాలు

    కరోనావైరస్ సోకినవారు ఇప్పుడు అత్యధికంగా అమెరికాలో ఉన్నారు. ఇప్పటివరకు ఈ దేశంలో 4,30,376 మందికి కోవిడ్ వ్యాధి సోకింది. 14,768 మంది చనిపోయారు. 23,865 మంది కోలుకున్నారు.

    బ్రిటన్‌లో ఒకే రోజు 900 మరణాలు

    బుధవారం బ్రిటన్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఒకే రోజులో 938 మంది కోవిడ్ వ్యాధితో చనిపోయారు. దాంతో, మృతుల సంఖ్య 7,097కు చేరింది.

    ఇటలీ

    ఇటలీ పరిస్థితి దయనీయంగా మారింది. 1.39 లక్షల కరోనాకేసులు ఈ దేశంలో నమోదయ్యాయి. 17,669 మంది చనిపోయారు.

    స్పెయిన్

    కరోనావైరస్ కేసుల సంఖ్యలో స్పెయిన్, ఇటలీని దాటేసింది. 1.5 లక్షల వైరస్ బాధితులున్న స్పెయిన్‌‌లో 14,792 మంది మృత్యువాత పడ్డారు.

    ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్ కొనసాగింపు

    ఈ దేశంలో రెండోసారి లాక్‌డౌన్ పొడిగించారు. అంటే, ఏప్రిల్ 15 తరువాత ముగియాల్సిన లాక్‌డౌన్ మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.

    టర్కీలో 812 మంది మృతి

    గత 24 గంటల్లో టర్కీలో 4,117 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 87 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కేసులు 38,226కు చేరుకోగా, మృతుల సంఖ్య 800 దాటింది.

  9. హలో... బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం, కరోనావైరస్‌పై LIVE అప్‌డేట్స్ కోసం ఈ పేజీని అనుసరించండి.

    కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం. ఈ లైవ్ పేజీలో తెలుగు రాష్ట్రాలు, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం. ముందుగా, ఇవాళ్టి తాజా సమాచారం:

    - కోవిడ్-19పై రాజకీయాలు చేయవద్దని, అన్ని దేశాలూ కలసికట్టుగా ఈ మహమ్మారిపై పోరాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విజ్ఞప్తి చేసింది.

    - భారతదేశంలో కరోనా కేసులు 5 వేలు దాటిపోయాయి. కోవిడ్ బారిన పడి ఇప్పటికే 150 మందికి పైగా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 348, తెలంగాణలో 397 కేసులు నమోదయ్యాయి.

    - అమెరికాలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. జాన్స్ హాప్కిన్స్ డేటా ప్రకారం గురువారం ఉదయానికి 4.31 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. మృతుల సంఖ్య 14,768కి చేరింది.