You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: 10 లక్షలకు చేరువలో మొత్తం కేసులు, 50 వేలు దాటిన మృతులు; ఆంధ్ర ప్రదేశ్‌లో 149, తెలంగాణలో 154కు చేరిన కేసులు

ఆంధ్ర ప్రదేశ్‌లో ఈరోజు 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 149కు పెరిగింది. తెలంగాణలో మరో 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, మొత్తం కేసులు 154కు పెరిగాయి.

లైవ్ కవరేజీ

  1. భారత్ వ్యాప్తంగా 50 మరణాలు

    భారత్‌లో కరోనావైరస్ కారణంగా ఇప్పటి వరకూ 50 మంది మరణించారు.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,764 మంది ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. మరో యాభై మందికి ఇది నయమైపోయింది.

    కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో గురువారం ఉదయం వరకూ ఉన్న సమాచారం ఇది.

  2. నెల్లూరులో 17... ఏపీలో 132కి చేరిన కరోనా కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

    బుధవారం రాత్రి 10 గంటల తర్వాత నుంచి ఇప్పటివరకూ కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 కేసులు నెల్లూరులోనే నమోదయ్యాయి.

    మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 132 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో అత్యధికంగా నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 20 చొప్పున పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ప్రకాశం (17), కృష్ణ (15), కడప (15) ఉన్నాయి.

    శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెల్లడించింది.

  3. ధారావిలో తొలి కేసు

    ముంబయిలోని ధారావి మురికివాడలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.

    56 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.

    ఆ వ్యక్తి మరణించినట్లు కొన్ని ఛానెళ్లలో ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ, అధికారికంగా దీని గురించి సమాచారం రాలేదు.

    ముంబయి మహానగరం నడిబొడ్డున ధారావి ఉంది. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్‌ షాపులు, మురికి కాలువలతో నిండి ఉన్న ఈ మురికివాడలో దాదాపు 10 లక్షల మంది నివసిస్తున్నారు.

    ఒకరి నుంచి మరొకరు సామాజిక దూరం పాటించడం ఇక్కడ చాలా కష్టం.

  4. మరణాలు అత్యధికంగా ఉన్న పది దేశాలివే...

    దేశం: మరణాలు

    ఇటలీ: 13,155

    స్పెయిన్: 9,387

    అమెరికా: 5,116

    ఫ్రాన్స్: 4,043

    చైనా: 3,316

    ఇరాన్: 3,036

    బ్రిటన్: 2,357

    నెదర్లాండ్స్: 1,173

    జర్మనీ: 931

    బెల్జియం: 828

  5. విశాఖపట్నంలో అప్రమత్తత

    విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం, గవర తాటిచెట్ల పాలెం, రెడ్డి వీధిల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో అధికారులు వీటిని రెడ్ జోన్లుగా ప్రకటించారు.

    నగరంలోని 31వ వార్డు, గాజుల వీధి, ఇన్‌కమ్ ట్యాక్స్ క్వార్టర్స్ ఏరియాలో ఇంటింటికీ మలేరియా నియంత్రణ సిబ్బందితో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేయించారు. శిబిరాలు ఏర్పాటు చేసి, పరీక్షలు చేస్తున్నారు.

  6. శరీర ఉష్ణోగ్రతను దూరం నుంచే చూసేందుకు చవకైన పరికరం, ముంబయి నావెల్ డాక్‌యార్డ్ ఆవిష్కరణ

    దూరం నుంచే శరీర ఉష్ణోగ్రతను కొలిచే ఇన్‌ఫ్రారెడ్ ఆధారిత సెన్సర్‌ను ముంబయిలోని నావెల్ డాక్‌యార్డ్ తయారు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ తరహా పరికరాలతో పోల్చితే ఈ పరికరం చాలా చవకైందని, ఒక్కోదాని తయారీకి రూ.1000 కన్నా తక్కువ ఖర్చవుతుందని తెలిపింది.

    భారత నావికాదళం ఈ విషయాలను వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

    కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇలాంటి ఇన్‌ఫ్రారెడ్ ఆధారిత సెన్సర్‌ల వాడకం చాలా పెరిగింది.

  7. ఇంటింటికీ రెండేసి మాస్క్‌లు ఇస్తామన్న జపాన్

    జపాన్‌లో ప్రతి ఇంటికీ రెండేసి మాస్క్‌లు పంపిణీ చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

    కానీ, ఈ నిర్ణయంపై చాలా మంది పౌరులు పెదవివిరుస్తూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. #టూమాస్క్స్ అనే హాష్‌ట్యాగ్‌ ట్వి‌టర్‌లో ట్రెండ్ అయ్యింది.

    ఇంట్లో ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఉంటే పరిస్థితి ఏంటని జనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మిగతా దేశాల్లో ప్రభుత్వాలు నగదు సాయం చేస్తుంటే, తమ ప్రభుత్వం మాత్రం రెండు మాస్క్‌లు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని వ్యాఖ్యలు చేశారు.

    జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం... జపాన్‌లో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకూ 57 మంది మరణించారు. 2,384 కేసులు నమోదయ్యాయి.

  8. అమెరికాలో ఒకే రోజు 884 మంది బలి

    అమెరికాలో కరోనావైరస్‌కు ఒకే రోజు రికార్డు స్థాయిలో 884 మంది బలైనట్లు జాన్స్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.

    ప్రస్తుతం దేశంలో ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణైనవారు 2 లక్షలకు పైనే ఉన్నట్లు పేర్కొంది.

    మొత్తంగా అమెరికాలో ఇప్పటివరకూ కరోనావైరస్ వల్ల 4,757 మంది మరణించారు.

  9. స్పెయిన్‌లో 9000 దాటిన కరోనా మరణాలు

    స్పెయిన్‌లో కరోనావైరస్‌ బారినపడి ఒకే రోజు రికార్డు స్థాయిలో 864 మంది మరణించారు.

    దేశంలో ఇప్పటివరకూ ఈ ఇన్ఫెక్షన్‌కు బలైనవారి సంఖ్య 9 వేలు దాటింది.

    యూరప్ వ్యాప్తంగా 30 వేలకు పైగా మంది కోవిడ్-19తో మరణించారు.

  10. భద్రాచలంలో సీతారామ కల్యాణం... ఎవరికీ ప్రవేశం లేదు

    భద్రాచలంలోని రామాలయంలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా ‘సీతారామ కల్యాణం’ జరుగుతుంది.

    రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాముడికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

    కరోనావైరస్ వ్యాప్తి ముప్పును దృష్టిలో పెట్టుకుని, ఈ కార్యక్రమానికి సామాన్యులెవరినీ అనుమతించడం లేదు.

    బుధవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. దీనికి కూడా ఇంద్రకరణ్ హాజరయ్యారు.

  11. తెలంగాణలో మరో 30 కేసులు.. మూడు మరణాలు

    తెలంగాణలో బుధవారం కొత్తగా 30 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ముగ్గురు మరణించారని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ట్విటర్‌లో వెల్లడించింది.

    వీటితో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది.

    కొత్తగా నమోదైన 30 పాజిటివ్ కేసులూ నిజాముద్దీన్ మర్కాజ్‌కు వెళ్లి వచ్చినవారేనని సీఎంఓ పేర్కొంది.

    మర్కాజ్‌కు వెళ్లివచ్చిన మరో 300 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపింది.

    మర్కాజ్‌కు వెళ్లినవాళ్లు, వాళ్లను కలిసినవాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరింది.

  12. ‘మీరు రోడ్డుపైకి వస్తే, వైరస్ మీ ఇంట్లోకి వస్తుంది’

    కరోనావైరస్ వ్యాప్తిపై జనాల్లో అవగాహన పెంచేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేసిన ప్రయత్నం ఇది...

    ‘మీరు రోడ్ల మీదకు వస్తే, నేను మీ ఇంటికి వస్తా’ అని కరోనావైరస్ చెబుతున్నట్లుగా ఓ బొమ్మను నాగెనహల్లి చెక్‌పోస్ట్ వద్ద రోడ్డుపై గీయించారు.

  13. వంద మార్కును దాటిన ఏపీ

    ‌ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఏప్రిల్ 1న వంద మార్కును దాటింది.