కరోనా లాక్‌డౌన్: ప్రపంచవ్యాప్తంగా 8,00,000 దాటిన కోవిడ్ బాధితులు, 37,000 దాటిన మృతులు

అమెరికాలో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మొత్తం 1,64,610 మందికి వైరస్ సోకగా, ఇప్పటివరకు 3,170 మంది చనిపోయారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం ఆర్థిక సంక్షోభం అంచున ఉందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. ఏపీలో ప్రభుత్వ ఆధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు

    కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు, రోగ నిర్దరణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు మొత్తం ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  2. కోవిడ్-19తో పోరాడుతున్న ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా - ఏపీ ప్రభుత్వం

    కోవిడ్-19తో పోరాడుతున్న ఆరోగ్య సిబ్బందికి 90 రోజుల పాటు రూ.50 లక్షల బీమా అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు.

    ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ఎయిమ్స్, సిజిహెచ్‌ఎస్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యుల నుంచి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వరకు అందరికీ వర్తింపచేస్తామని జవహర్ రెడ్డి వెల్లడించారు.

    జాతీయ విపత్తు స్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుండి బీమా సొమ్మును చెల్లిస్తామని, ఇప్పటికే బీమా పాలసీలు ఉన్నవారికీ ఈ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు.

  3. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అక్రమంగా తరలించిన ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్.. రూ.5 లక్షల జరిమానా

    కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఈ తరుణంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సి న తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్‌ సీఐ రెడ్డి త్రినాథ్‌ మద్యం అక్రమ తరలింపునకు పాల్పడి, సస్పెన్షన్‌‌కు గురయ్యారు.

    ఆయనకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు.

    ఎక్సైజ్‌ సీఐ మద్యం అక్రమ తరలింపు వ్యవహారంపై మంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఎక్సైజ్‌ సీఐ త్రినాథ్‌ అక్రమంగా మద్యం తరలించారని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

    కుతుకులూరు మారుతీనగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సీల్‌ వేయాలంటూ రాయవరం ఎక్సైజ్‌ సీఐ రెడ్డి త్రినాథ్‌రావు ఆదివారం అక్కడికి వచ్చారు. సీఐ వాహనంతో పాటు, ఇంకా రిజిస్ట్రేషన్‌ కాని వాహనంలో మరికొందరు వచ్చారు.

    రూ.1.5 లక్షల మద్యం బాటిళ్లను ఆ వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. తమకు ఇబ్బంది అవు తుందని షాపు సూపర్‌వైజర్లు జె.శేఖర్, షేక్‌ మౌషీ చెప్పినా తాను చూసుకుంటానంటూ సీఐ మద్యం బాటిళ్లను వాహనాల్లో వేశారు.

    స్థానికులు అడ్డుకోబోగా సీఐ సొంత వాహనాన్ని డ్రైవర్‌ అక్కడి నుంచి వేగంగా తరలించారు. మద్యం సీసాలతో మరో వాహనాన్ని స్థానికులు అడ్డుకుని అనపర్తి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

    మద్యం అక్రమంగా తరలించిన ఎక్సైజ్ సీఐ
    మద్యం అక్రమంగా తరలించిన ఎక్సైజ్ సీఐ
    మద్యం అక్రమంగా తరలించిన ఎక్సైజ్ సీఐ
  4. కేరళలో మద్యం దొరక్క ఆత్మహత్యలు.. డాక్టర్ చీటీతో వస్తే మద్యం ఇవ్వాలని సీఎం ఆదేశాలు

    కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం షాపుల్ని మూసేశారని, దీంతో మద్యం దొరక్క కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ఈ ఆత్మహత్యల నేపథ్యంలో డాక్టర్ల నుంచి ప్రిస్కిప్షన్ (చీటీ) తీసుకున్న వారికి మద్యం ఇవ్వాలని ఎక్సైజ్ అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    అలాగే, మద్యం తాగని, మానేస్తున్న వారిని డీ అడిక్షన్ సెంటర్లలో చేర్చి ఉచితంగా చికిత్స అందించాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

    రాష్ట్రంలో ఉన్నట్టుండి మద్యం లభించకపోవడంతో సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, మద్యాన్ని ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు 7,22,289.. కోలుకున్నవారు 1,51,901.. మృతులు 33,981

    కరోనావైరస్