కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఈ తరుణంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సి న తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ మద్యం అక్రమ తరలింపునకు పాల్పడి, సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఆయనకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు.
ఎక్సైజ్ సీఐ మద్యం అక్రమ తరలింపు వ్యవహారంపై మంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ సీఐ త్రినాథ్ అక్రమంగా మద్యం తరలించారని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
కుతుకులూరు మారుతీనగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సీల్ వేయాలంటూ రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్‌రావు ఆదివారం అక్కడికి వచ్చారు. సీఐ వాహనంతో పాటు, ఇంకా రిజిస్ట్రేషన్ కాని వాహనంలో మరికొందరు వచ్చారు.
రూ.1.5 లక్షల మద్యం బాటిళ్లను ఆ వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. తమకు ఇబ్బంది అవు తుందని షాపు సూపర్‌వైజర్లు జె.శేఖర్, షేక్ మౌషీ చెప్పినా తాను చూసుకుంటానంటూ సీఐ మద్యం బాటిళ్లను వాహనాల్లో వేశారు.
స్థానికులు అడ్డుకోబోగా సీఐ సొంత వాహనాన్ని డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా తరలించారు. మద్యం సీసాలతో మరో వాహనాన్ని స్థానికులు అడ్డుకుని అనపర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.