You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేంద్ర బడ్జెట్ 2019: వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు - ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఒక మహిళ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. 49 ఏళ్లలో తొలిసారి.
లైవ్ కవరేజీ
ఇప్పటివరకూ 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం
2014 నుంచి 9.6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం.
ఇప్పుడు ఐదు లక్షల గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయి.
95 శాతం పైగా నగరాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయని ప్రకటించాయి.
2019 అక్టోబర్ రెండో తేదీ నాటికి భారతదేశాన్ని బహరింగ మలవిసర్జన నుంచి విముక్తి పొందిన దేశంగా మార్చాలన్నది మా లక్ష్యం.
రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని అక్టోబర్ రెండో తేదీన ప్రారంభిస్తాం.
పీఎంఏవై – అర్బన్ కింద 80 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి.
జీరో-బడ్జెట్ వ్యవసాయం.. తిరిగి మూలాలకు వెళ్లాలి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ (సులభ వ్యాపారం – సులభ జీవనం) అనేవి రైతులకు కూడా వర్తించాలి.
జీరో-బడ్జెట్ వ్యవసాయం మూలాలకు మనం తిరిగి వెళ్లాలి. దేశమంతటా ఈ నమూనాను విస్తరించాలి.
ఇటువంటి చర్యలు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి.
ఫేమ్-2 పథకంతో విద్యుత్ వాహనాల వినియోగం పెంపు
సరైన ప్రోత్సాహకాలు అందించటం, చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్ వాహనాలను ఉపయోగించటం వేగంగా పెంచటానికి ఫేమ్-2 పథకం అమలు.
1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల స్థాయిని పెంచుతాం.
2021 నాటికి 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం
భారతదేశ ఆత్మ గ్రామాల్లో నివసిస్తోందని మహాత్మా గాంధీ అన్నారు. గావ్, గరీబ్, కిసాన్ – కేంద్రంగా కృషి చేస్తున్నాం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2021 నాటికి 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదన.
2022 నాటికి అన్ని ఇళ్లకూ విద్యుత్, ఎల్‌పీజీ (వంట గ్యాస్) అందిస్తాం.
అందరికీ వంట గ్యాస్
దేశంలో ఉన్న అందరికీ వంట గ్యాస్ సదుపాయం కల్పిస్తామని, ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తీసుకోకపోతే తప్ప ప్రజలందరికీ వంట గ్యాస్ అందుతుందన్నారు.
అంతరిక్ష విజయాల నుంచి వాణిజ్య ప్రయోజనాలు
భారతదేశం ఒక ప్రధాన అంతరిక్ష శక్తిగా అవతరించింది. ఈ సామర్థ్యాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇస్రో పరిశోధన, అభివృద్ధి ప్రయోజనాలను పొందటానికి స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థను కొత్తగా నెలకొల్పాం. వివిధ అంతరిక్ష ఉత్పత్తులను వాణిజ్యపరంగా మలచే కార్యక్రమానికి ఈ సంస్థ సారథ్యం వహిస్తుంది.
విమానయానం, మీడియా, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐ పెంపు చర్యలు
విమానయానం, మీడియా, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచే చర్యలను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తుంది.
దుకాణదారుల కోసం కొత్త పెన్షన్ పథకం
మూడు కోట్ల మంది దుకాణదారుల కోసం కొత్త పెన్షన్ పథకం.. ప్రధానమంత్రి కరమ్‌యోగి మాన్‌ధన్ స్కీమ్. దీనికోసం ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు మాత్రమే అవసరం.
రైల్వేల్లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు
దేశంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు పెడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018 నుంచి 2030వ సంవత్సరం వరకు దేశంలో రైల్వేల అభివృద్ధికి 50 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ప్రతి ఏటా 1.5 నుంచి 1.6 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఇప్పటికే మంజూరు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకే దశాబ్ధాల సమయం పడుతుందని చెప్పారు. అందుకే రైల్వేలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు తాము ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ‘‘రైల్వేల్లో వేగవంతమైన అభివృద్ధికి, రైల్వే లైన్ల నిర్మాణానికి, రోలింగ్ స్టాక్ ఉత్పత్తికి, ప్రయాణీకులు, సరకు రవాణా సేవల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని ప్రతిపాదిస్తున్నాం’’ అని సీతారామన్ చెప్పారు.
నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు
నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు.జాతీయ భద్రతకు
ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
‘‘ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చేటప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్లుగా ఉంది.
ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువనులక్ష కోట్ల డాలర్లకు పెంచాం.
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ఐదు లక్షల డాలర్ల ఆర్థఇక వ్యవస్థగా అవతరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.’’
బడ్జెట్ ప్రసంగం వింటున్న ప్రధాని మోదీ, సోనియా, రాహుల్ గాంధీ
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
పార్లమెంటులో కేంద్ర క్యాబినెట్ సమావేశం
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశమైందని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు.
పార్లమెంటుకు చేరుకున్న ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు.
రాష్ట్రపతి కోవింద్‌తో నిర్మలా సీతారామన్ భేటీ
పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో రాష్ట్రపతి భవన్ లో భేటీ అయ్యారు.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
నిర్మలా సీతారామన్ చేతిలో కేంద్ర బడ్జెట్
పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పత్రాలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న రెండో మహిళ నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం(05.07.2019) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
తొలి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా నియమితులైన మహిళగా చరిత్ర సృష్టించిన నిర్మల సీతారామన్ ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన అన్ని పనులూ పూర్తిచేశారు.
బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచనున్నారు.
ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సమర్పించారు.
అనంతరంమోదీ నేతృత్వంలోనే మరోసారి ప్రభుత్వం ఏర్పడి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు.
ఇందిర తరువాత నిర్మలే
భారతదేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్ సమర్పిస్తున్న రెండో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1970-71లో ఆర్థిక శాఖ కూడా నిర్వహించారు.
దాంతో ఆ ఏడాది ఇందిరాగాంధీ ఆర్థికమంత్రిగా లోక్ సభలో బడ్జెట్ సమర్పించారు.
ఆ తరువాత 49 ఏళ్లకు ఇప్పుడు మరో మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తున్నారు.
ఫిబ్రవరి నాటి మధ్యంతర బడ్జెట్‌లో 5 కీలకాంశాలు..
ఈ ఏడాది ఫిబ్రవరి 1న అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ 2019-20 మధ్యంతర బడ్జెట్ సమర్పించారు.
* దేశవ్యాప్తంగా రైతులకు ఏడాదికి హెక్టారుకు రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో డబ్బు అందజేత.
రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుంది.
'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్)' అనే ఈ పథకాన్ని 2018 డిసెంబరు 1 నుంచి వర్తింపజేస్తూ అమలు చేస్తారు.
2018-19 బడ్జెట్ సవరిత అంచనాల్లో రూ.20 వేల కోట్లు 'పీఎం-కిసాన్' పథకానికి కేటాయించారు.
2019-20 కొత్త బడ్జెట్‌లో రూ.75 వేల కోట్లు కేటాయించారు.
ఈ పథకంతో 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
* రూ.5 లక్షల లోపు వ్యక్తిగత ఆదాయంపై పన్ను ఉండదు.
* ఉద్యోగులకు పదవీ విరమణ, ఉద్యోగం నుంచి తప్పుకునే సమయానికి లభించే గ్రాట్యుటీ రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు.
* రక్షణ శాఖకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు.
* మహిళల రక్షణ, సాధికారత మిషన్‌కు రూ.1,330 కోట్ల కేటాయింపు.