You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మా నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు రూ. కోట్లు ఇచ్చి కొన్నారు: సజ్జల
పార్టీలో అంతర్గతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సజ్జల తెలిపారు. అన్ని ఆధారాలతో క్రమశిక్షణ సంఘం నిబంధనలు మేరకు సస్పెన్షన్ చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడిన తర్వాత అధినేత జగన్ సస్పెన్షన్ విధించాలని నిర్ణయించినట్టు సజ్జల వెల్లడించారు.
లైవ్ కవరేజీ
కాకినాడ-జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్: వేల మంది ఖాతాదారులను ఈ బ్యాంకు ఎలా రోడ్డున పడేసింది?
మోదీపై పరువు నష్టం కేసు వేస్తానన్న రేణుకా చౌదరి
ప్రధాని నరేంద్ర మోదీపై తాను పరువు నష్టం కేసు వేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఒక ట్వీట్ చేశారు.
“ఒక అహంకారి పార్లమెంటులో నన్ను ‘శూర్పణఖ’ అన్నారు. ఆయనపై పరువు నష్టం కేసు వేస్తాను. చూద్దాం, కోర్టులు ఎంత త్వరగా చర్యలు తీసుకుంటాయో” అని అందులో రాశారు.
ట్వీట్‌కు ప్రధాని మోదీ మాట్లాడుతున్న వీడియో క్లిప్ ఒకటి జత చేశారు.
క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రేణుక ఈ ట్వీట్ చేశారు.
“రేణుకా జీని ఏమీ అనొద్దండి. రామాయణం సీరియల్ తర్వాత అంత పెద్ద నవ్వును వినే భాగ్యం నాకు దక్కింది” అని మోదీ అంటున్నట్టు ఈ వీడియో క్లిప్‌లో ఉంది. 2018 పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతుండగా, రేణుక నవ్వుతుండటాన్ని విన్న రాజ్యసభ చైర్మన్, నిశ్శబ్దంగా ఉండాలని ఆమెకు సూచించారు. తర్వాత ప్రధాని మోదీ స్పందిస్తూ- ఈ వ్యాఖ్యలు చేశారు.
దొంగలందరి పేరులో మోదీ అని ఎందుకుందంటూ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాహుల్ వ్యాఖ్యానించారనే కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడింది.
నేడు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడనున్న నిఖత్ జరీన్
శుక్రవారం దిల్లీలో మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచులు జరుగనున్నాయి.
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, భారత్‌లోని ఇతర బాక్సర్లు స్వీటీ బూరా, లవ్లీనా బోర్గోహెయిన్, నీతు ఘణ్‌ఘాస్ వీటిలో తలపడనున్నారు.
సెమీ ఫైనల్స్‌లో 50 కేజీల వెయిట్ కేటగిరీలో కొలంబియన్ బాక్సర్ ఇంగ్రిట్ లోరెనా వాలెన్సియా విక్టోరియాపై నిఖత్ జరీన్ గెలిచారు.
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో జరీన్ తన ప్రత్యర్థిని 5-0 తేడాతో ఓడించారు.
2022 మేలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా బీబీసీ తెలుగు అందించిన కథనం చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.
'టిక్‌టాక్'ను నిషేధించిన బ్రిటన్ పార్లమెంట్
చైనా సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను బ్రిటన్ పార్లమెంట్ నిషేధించింది. భద్రతాపరమైన ఆందోళనలతో ఈ నిర్ణయం తీసుకొంది.
ఇక నుంచి మంత్రులు తమ ఫోన్లలో ఆ యాప్‌ను ఉపయోగించకూడదని భద్రతా సమీక్ష తర్వాత బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
చాలా మంది ఎంపీలు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా సిబ్బందికి ఇచ్చే పరికరాల నుంచి కూడా టిక్‌టాక్‌ను తొలగించనున్నారు.
ఈ నిషేధంతో బ్రిటన్ పార్లమెంట్ వైఫై నెట్‌వర్క్‌తో ఈ యాప్‌ను ఇక వినియోగించలేరు. యూజర్లు మొబైల్ డేటాతో వారి ఫోన్‌లలో టిక్‌టాక్‌ను ఉపయోగించగలరు.