You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దు: హైకోర్టు ఆదేశాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
లైవ్ కవరేజీ
మా నాన్న నన్ను లైంగికంగా వేధించేవారు: దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్
ఆస్కార్: ‘నాటునాటు’ పాటను నాటుగా పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ల సంగీత ప్రయాణం ఏంటి
మహారాష్ట్ర: ఉల్లి పంటను పశువుల దాణాగా వదిలేస్తున్న రైతులు
‘ఎమ్మెల్యే చెప్పినట్టుగా వింటే బంగారం, డబ్బు వస్తాయన్నారు’ - దళిత మహిళా సర్పంచ్ ఆరోపణ.. ఖండించిన ఎమ్మెల్యే
కేసీఆర్: ‘రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. చేసుకుంటే చేసుకోని.. భయపడేది లేదు’
క్యాంపా కోలా: త్వరలో మార్కెట్‌లోకి 'రీ ఎంట్రీ' ఇవ్వబోతున్న ఈ భారతీయ శీతల పానీయం చరిత్ర ఏంటి?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కుంభకోణంలో నలుగురు అరెస్ట్, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం
అంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ నిర్వహణలో జరిగిన మనీ ల్యాండరింగ్ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నలుగురిని అరెస్ట్ చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా అరెస్ట్ చేసిన వారిని విశాఖలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. సీమెన్స్ ఎండీగా పనిచేసిన శేఖర్ బోస్ సహా నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో రంగంలో దిగిన ఈడీ కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినట్టు అభియోగం నమోదు చేసింది.
అందుకు బాధ్యులుగా సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్, పీవీఎస్‌పీఐడీ స్కిల్ సీఈవో ముకుల్‌చంద్ అగర్వాల్, సారా చార్టెర్డ్ అసోసియేట్స్‌కు చెందిన సురేష్ గోయల్‌లను అరెస్ట్ చేసింది.
అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దు: హైకోర్టు ఆదేశాలు, యార్లగడ్డ అమరేంద్ర, బీబీసీ ప్రతినిధి
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసుకి సంబంధించిన విచారణ వివరాలను కోర్టు ముందుంచాలని సీబీఐని ఆదేశించింది.
ఇప్పటికే రెండు దఫాలుగా చేసిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్ డిస్క్‌ల రూపంలో మంగళవారం నాటికి కోర్టులో సమర్పించాలని హైకోర్టు తెలిపింది.
ఇంతకుముందు రెండుసార్లు సీబీఐ ముందు విచారణకు హాజరయిన వైఎస్ అవినాష్ రెడ్డిని శుక్రవారం సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది.
సీబీఐ విచారణకు హాజరయ్యే క్రమంతో తన విషయంలో తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన పిటీషన్‌ని విచారించిన కోర్టు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది.
మరోవైపు ఈకేసులో తనను కూడా ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలంటూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా హైకోర్టులో పిటీషన్ వేశారు.
చైల్డ్ ఫ్రీ లైఫ్: ‘మాకు పిల్లలు వద్దు.. కుక్కలు, పిల్లులు ముద్దు’ అంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.. ఎందుకు?
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
ఆగ్నేయాసియా కేంద్రంగా ఆన్‌లైన్ రొమాన్స్ స్కాములు నడిపిస్తున్న క్రిమినల్ గ్యాంగ్స్
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ ఇంట్లో 18 ఓట్లు ఉన్నాయి... కానీ వారెవరో ఇంట్లో వాళ్లకు తెలియదు
చైనా: మూడోసారి అధ్యక్షునిగా షీ జిన్‌పింగ్... ఆమోదించిన పీపుల్స్ కాంగ్రెస్
షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడు అయ్యారు.
చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఈమేరకు ఆమోదం తెలిపింది. 69ఏళ్ల షీ జిన్‌పింగ్ చైనాలో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారు.
త్వరలో చైనా కొత్త ప్రధానితో పాటు ఇతర మంత్రుల పేర్లను వెల్లడించనున్నారు.
మావో జెడాంగ్ తరువాత చైనా అధ్యక్షునిగా మూడోసారి పదవి చేపట్టిన నేతగా షీ జిన్‌పింగ్ రికార్డు సృష్టించారు.
‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
బ్రేకింగ్ న్యూస్, కల్వకుంట్ల కవిత: ‘‘ఇది ప్రారంభం మాత్రమే... మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం’’
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే చట్టంగా తీసుకురావాంటూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ దీక్ష ఒక్క రోజు సాగుతుంది.
సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ఈ దీక్షలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ ఇతర బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కూడా ఈ దీక్షకు వచ్చారు.
‘‘దేశాభివృద్ధి కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంతో అవసరం. పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ దాన్ని చట్టంగా తీసుకురావాలి.
ఇది ప్రారంభం మాత్రమే దేశవ్యాప్తంగా మేం నిరసనలు చేపడతాం. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారే వరకు మేం పోరాడతాం’’ అని కల్వకుంట్ల కవిత అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం తమ కర్తవ్యమని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి పురోగతి లేదని సీతారాం ఏచూరి అన్నారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.