You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
1. యశస్వి జైస్వాల్: క్రికెట్ కోసం ఇంటి నుంచి పారిపోయాడు, ఇప్పుడు తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు
ఒక్క టెస్టు మ్యాచ్‌తోనే భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరు భారత క్రికెట్ అభిమానుల్లో మారుమోగుతోంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీని పక్కనబెట్టి మరీ అందరూ యశస్వి సెంచరీ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఆడిన తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేయడంతో అందరి దృష్టీ అతడిపైనే.
ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 143 పరుగులతో అజేయంగా నిలిచి డబుల్ సెంచరీ వైపు కదులుతున్నాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అనుభవజ్ఞుడైన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మొదటి బౌండరీ కొట్టడానికి 80 బంతులు తీసుకున్నాడు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
2. చంద్రయాన్-3 తరువాత ఇస్రో లక్ష్యం ఏమిటి? చంద్రయాన్-4లో మనుషులను పంపిస్తారా
చంద్రయాన్-1, చంద్రయాన్-2 మంగళయాన్ ప్రయోగాల్లో అత్యంత సంక్లిష్టమైన దశ ఆయా గ్రహాల గురుత్వాకర్షణ కక్ష్యలోకి ప్రవేశించడమే.
చంద్రుడి గురుత్వాకర్షణ కక్ష్యలో ప్రవేశించడాన్ని లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ అంటారు. అదే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించడాన్ని ఏరియో సెంట్రిక్ ఇన్సెర్షన్ అంటారు.
ఇది అనుకున్నంత సులువైన దశ కాదు. అమెరికా, రష్యాలు తొలినాళ్లలో 14 సార్లు ఈ దశలోనే విఫలమయ్యాయి. 15వ సారి మాత్రమే విజయం సాధించాయి.
కానీ ఇస్రో మాత్రం తొలి ప్రయత్నంలోనే చంద్రయాన్-1 ప్రయోగంలో ఈ దశను విజయవంతంగా అధిగమించింది.
ఇప్పుడు చంద్రయాన్ - 3లోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయోగానికి సర్వ సన్నద్ధమైంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
3. మనిషి ఒంటి మీద కంటికి కనిపించని గీతలు ఉంటాయని తెలుసా... ఆ రేఖల రహస్యమేంటి?
మీరు వాటిని చూడలేకపోవచ్చు. కానీ, అవి పుట్టినప్పటి నుంచీ మీతోనే ఉన్నాయి. తల నుంచి కాలి బొటన వేళ్ల వరకూ ఒళ్లంతా అవి ఉంటాయి. తలపై సుడులు తిరిగి, వీపుపై వీ ఆకారంలో, ముఖంపై అడ్డంగా ఈ రేఖలు ఉంటాయి.
పైకి కనిపించనప్పటికీ ఇలాంటి గీతలు ఉంటాయని 19వ శతాబ్దంలో జర్మనీ డెర్మటాలజిస్టు ఆల్ఫ్రెడ్ బ్లాష్కో ప్రతిపాదించారు. తన రోగుల చర్మంపై దద్దుర్లు, పుట్టుమచ్చలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం ఆయన ఈ అవగాహనకు వచ్చారు.
చాలా మచ్చలు ఒక ప్యాటెర్న్‌లో ఉంటున్నట్లు ఆయన గుర్తించారు. ఎవరో ముందుగానే నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నట్లుగా ఇవి కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
4. చిత్తూరు జిల్లా గనుల్లో ఎంత బంగారం ఉంది? ఎప్పుడు తవ్వబోతున్నారు?
కుప్పం వద్ద ఉన్న చిగురుకుంట-బిసానత్తం గనుల్లో మరో 5 ఏళ్లలో బంగారాన్ని తవ్వడం ప్రారంభిస్తామని నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ) తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ గనుల్లో తవ్వకాలు చేపట్టడం ద్వారా బంగారం ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ ప్రవేశిస్తోంది.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ ప్రస్తుతం ఇనుము, వజ్రాలు వంటి వాటి తవ్వకాల్లో ఉంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
5. మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల లోన్ - ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కొత్త వ్యాపార ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా రాణించాలని తపించే మహిళల కోసం రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణం అందించేలా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తోంది.
అదే 'స్టాండ్‌అప్ ఇండియా'.
ఈ పథకం ద్వారా మహిళలే కాదు, ఎస్సీ, ఎస్టీలు కూడా లింగబేధంతో పనిలేకుండా రుణాలు పొందవచ్చు.
'స్టాండ్ అప్ ఇండియా' పథకం కింద రుణం పొందాలంటే ఏం అర్హతలు ఉండాలి? దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- కేరళ- ఏ తప్పూ చేయకున్నా 54 రోజులు జైలు... వ్యక్తి జీవితంతో ఆడుకున్న 'సీసీటీవీ ఫోటో'
- బిహార్- షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే..-?
- పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళాడేందుకు ఏడేళ్ళు ఎదురుచూసిన భారత ప్రేమికుడు
- డీఎంఐటీ టెస్ట్- పెళ్లికి ముందే పెళ్లి కొడుకు తెలివితేటలను కొలిచే ఈ పరీక్ష ఏంటి, శాస్త్రీయత ఎంత-?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)