ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ప్రచురణ

1.మెదడుకు 6 అద్భుతమైన ఆహారాలు

జ్ఞాపకశక్తికి పదునుపెట్టే, మెదడు సమర్థంగా పనిచేసేలా సహాయపడే, మానసిక పరిస్థితిని మెరుగుపరిచే ఆహారాలు ఉన్నాయి.

ఆహారనాళం-మెదడు ఏవిధంగా అనుసంధానమై ఉంటాయో అలాగే మానసిక స్థితి-డైట్ కూడా లింక్ అయి ఉంటుందని అమెరికాలోని హర్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన న్యూట్రీషనల్ సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్ ఉమా నాయుడు చెప్పారు.

మెదడు, పేగులు ఒకే ఎంబ్రియానిక్ కణాల నుంచి తయారయ్యాయని, మానవ శరీరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రెండూ అనుసంధానమయ్యే ఉన్నాయనే జీవ సంబంధిత దృగ్విషయాన్ని దీనికి రుజువుగా చూపిస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ క్లిక్ చేయండి.

2. పాములు: సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది?

సెక్స్ అనేది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన విషయం. ప్రకృతి దీన్ని ఎంత సంక్లిష్టంగా మార్చిందంటే, లోతుగా పరిశీలించిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది.

సెక్స్ పట్ల మనోభావాలు, నమ్మకాలు, ప్రతిచర్యలు ప్రతి జీవికీ వేరు వేరుగా ఉంటాయి. అది మనిషి అయినా, పక్షి అయినా, పాము అయినా.

అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో హైలాండ్స్‌లో పనిచేస్తున్నారు కీటక శాస్త్రవేత్త జీసస్ రివాస్.

దక్షిణ అమెరికాలో కనుగొన్న జెయింట్ అనకొండ పాము లైంగిక జీవితానికి సంబంధించిన షాకింగ్ సమాచారాన్ని జీసస్ పరిశోధన వెల్లడించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

3. NEET వంటి ఆలిండియా పోటీ పరీక్షల్లో తెలుగువారిదేనా హవా... 'టాప్ ర్యాంకులన్నీ మావే' అంటూ విద్యా సంస్థలు చేసే ప్రచారంలో నిజమెంత?

ఆలిండియా స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు ఫలితాలు ఏమొచ్చినా తెలుగు మీడియా మారుమ్రోగిపోతుంది. ఒక్కో సంస్థ వందల కొద్దీ ర్యాంకులు తమవేనని చెప్పుకుంటుంది. టాప్ ర్యాంకులతో పాటుగా అన్నిటా తమదే హవా అని చెప్పుకుంటూ ఉంటారు.

అదంతా నిజమేనా? తెలుగువాళ్లే అన్నింటా ముందుంటున్నారా? నీట్, జేఈఈ ఇలా ఏ పరీక్షల్లో అయినా తెలుగు వారి ముందు మిగిలిన రాష్ట్రాలకు చెందిన వాళ్లు పోటీ పడలేకపోతున్నారా?

ఈ అంశాలపై బీబీసీ పరిశీలన చేసింది. వివిధ పరీక్షల్లో ముందు నిలుస్తున్న వారి డేటా సేకరించింది. గడిచిన మూడేళ్లలో ఆయా పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలు తీసుకుంది. అందులో ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూశాయి. వివిధ కార్పోరేట్ సంస్థలు చేసే ప్రచారానికి, వాస్తవానికి మధ్య వైరుధ్యం బయటపడింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

4. తిలక్ వర్మ: మేడ్చల్ నుంచి వెస్టిండీస్‌కు.. లెఫ్ట్ హ్యాండ్‌‌తో సిక్సర్‌లు కొడుతూ రైట్ హ్యాండ్‌తో వికెట్లు తీసే ఈ హైదరాబాదీ మిడిల్ఆర్డర్‌లో ఎందుకంత కీలకం

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఏప్రిల్ 11న ముంబయి ఇండియన్స్ వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ దిల్లీ వేదికగా జరిగింది. చివరి నాలుగు ఓవర్లలో ముంబయి 40 పరుగులు చేయాలి.

సాధించాల్సిన రన్‌రేట్ 10. క్రీజులో ఉన్నది బక్కపల్చటి కుర్రాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు.

ముకేశ్ కుమార్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు, ఫోర్ సాధించాడు ఆ కుర్రాడు.

మొత్తంగా ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లో 41 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనే హైదరాబాద్ కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.

ఐపీఎల్‌లో సత్తా చాటిన తిలక్ వర్మ ఇప్పుడు భారత క్రికెట్ టీంకు కూడా సెలెక్ట్ అయ్యాడు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

5. పాకిస్తాన్ సరిహద్దు దాటి ప్రియుడి కోసం భర్తను వదిలి నలుగురు పిల్లలతో భారత్‌ వచ్చిన ప్రేమిక... ఒక పబ్జీ ప్రేమకథ

ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో సీమా హైదర్ అనే మహిళ పాకిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకున్నారు.

రెండు రోజుల క్రితం హరియాణాలోని బల్లభ్‌గడ్‌లో సీమాతో పాటు ఆమె ప్రియుడు సచిన్ మీణాను పోలీసులు అరెస్ట్ చేశారు.

సచిన్‌ను కలవడం కోసం నేపాల్ టూరిస్ట్ వీసా తీసుకున్న సీమా హైదర్, షార్జా మీదుగా కాఠ్మండూ చేరుకున్నారు. అక్కడ నుంచి బస్సులో భారత్‌కు వచ్చారు. ఆమెతో పాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.

సీమా గులామ్ హైదర్, పాకిస్తాన్‌ మహిళ అని పోలీసులు తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)