You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
1. రామ్ చరణ్ - ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
నటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టినట్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వెల్లడించింది.
పాప బొడ్డు తాడు రక్తాన్ని (అంబిలికల్ కార్డ్ బ్లడ్‌ను) ఓ ప్రైవేటు సంస్థ వద్ద భద్రపరుస్తున్నట్లు ఉపాసన ట్వీట్ చేశారు.
బాలీవుడ్ నటీమణులు కాజోల్, శిల్పా శెట్టిలతోపాటు నటుడు మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కూడా అప్పట్లో తమ పిల్లల అంబిలికల్ కార్డ్ బ్లడ్‌ను ఇలానే భద్రపరిచారు.
ఇంతకీ అంబిలికల్ కార్డ్ బ్లడ్ ప్రిజర్వేషన్ (బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరచడం) అంటే ఏమిటి, దీన్ని ఎందుకు భద్రపరుస్తారు? వివరాలు తెలుసుకుందాం.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. మార్కాపురం పలకలు: వీటినే దేశమంతటా ఉపయోగించేవారు... ఈ పరిశ్రమ ఇప్పుడెందుకు డీలా పడిపోయింది?
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం అంటే అందరికీ గుర్తుకొచ్చేది పలకల పరిశ్రమ. ఈ పరిశ్రమ ఇప్పుడు మనుగడ కోసం అనేక ప్రయాసలు పడుతోంది.
ప్రజల అభిరుచి మారుతుండటం ఓ కారణమైతే ప్రభుత్వ నిబంధనలు కూడా అందుకు తోడు అవుతున్నాయి.
ముఖ్యంగా క్వారీల నిర్వహణ పెనుభారంగా మారడంతో పలకల తయారీకి ఇప్పుడు ముడిసరుకు కోసం విదేశీ దిగుమతుల మీద ఆధారపడుతున్నారు.
వేల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమలో అనేక యూనిట్లు మూతపడ్డాయి.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. వజ్రాన్ని ల్యాబ్‌లో ఎలా తయారు చేస్తారు... జో బైడెన్ భార్య జిల్‌కు మోదీ ఇచ్చిన వజ్రం ప్రత్యేకత ఏంటి?
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అనేక బహుమతులు ఇచ్చారు. ఆ బహుమతులు అన్నింటిలో గ్రీన్ డైమండ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.
భారత ప్రధాని మోదీ 7.5 క్యారెట్ల విలువైన పర్యావరణ అనుకూల వజ్రాన్ని అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు బహుమతిగా ఇచ్చారు.
మోదీ ఇచ్చిన వజ్రం అమూల్యమైనది. దాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్‌లో తయారు చేశారు.
దీని తయారీలో పునరుత్పాదక వనరులని ఉపయోగించారు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. టైటాన్ సబ్‌మెర్సిబుల్: సముద్ర గర్భంలోని జలాంతర్గామిని ఆకాశంలో ఎగిరే విమానం ఎలా కనిపెడుతుంది?
అట్లాంటిక్ సముద్రంలో గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ను వెతకడానికి పలు విమానాలు, నిఘా సాంకేతికత సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఇంతకీ అవి ఎలా పని చేస్తాయి?
టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఈ వారం అట్లాంటిక్ మహాసముద్రంలో అదృశ్యమైంది. దీంతో దాని జాడ కోసం పలు విమానాలు సముద్రంలో గాలిస్తున్నాయి .
అమెరికా కోస్ట్‌గార్డ్ కెనడియన్ P-3 విమానం బుధవారం నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని ప్రకటించింది. ఆ సిగ్నల్‌పై దర్యాప్తు చేస్తున్నామని, దానిపై విశ్లేషణ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
అయితే, సముద్రపు అలలపై ఎగురుతున్న విమానం నీటి అడుగున ఉన్న వస్తువును ఎలా గుర్తించగలదు?
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. దేవుడికి జ్వరం వచ్చింది, 15 రోజులు దర్శనాలు లేవు!
పూరీలో ఉన్న జగన్నాథుడుకీ ఆయన అన్న బలరాముడికీ, చెల్లెలు సుభద్రకీ జ్వరం వచ్చింది. అందుకే ఆ గుడిలో 15 రోజులు దర్శనాలు నిలిపేశారు.
నిజమే.. ప్రతీ ఏటా పూరీలో దేవుడికి జ్వరం వస్తే నయం అయ్యే వరకూ దర్శనాలుండవు. పూజలుండవు. జ్వరం తగ్గాకే అన్నీ..
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- సాదీ షిరాజీ- ఈ పర్షియన్ రచయిత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి బ్రాహ్మణుడిగా మారారా- ఇది నిజమా, కల్పితమా-?
- తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక సైట్-లా మోసం చేస్తున్న ఫేక్ వెబ్-సైట్లు, వీటిని గుర్తించేదెలా-?
- నలంద విశ్వవిద్యాలయం- ప్రపంచాన్ని మార్చేసిన ప్రాచీన భారతీయ యూనివర్సిటీ విశిష్టత ఏమిటి- ఆక్స్-ఫర్డ్ వర్సిటీ కన్నా 500 ఏళ్ల ముంద?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)