You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
1.దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
"దెబ్బ తగిలింది. టీటీ ఇంజెక్షన్ తీసుకుకున్నాను. అయినా నొప్పి తగ్గట్లేదు."
"టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా చీము పట్టింది."
"ఇనుప రేకు గీసుకుపోయింది. టీటీ ఇంజెక్షన్ ఇవ్వండి".
"దెబ్బ తగిలింది ఇనుముతో కాదు కదా.. టీటీ ఇంజెక్షన్ ఎందుకు!?"
"దెబ్బ తగిలింది. టీటీ ఇంజెక్షన్ తీసుకొని ఆరు నెలలకు పైనే అయింది. మరో ఇంజెక్షన్ ఇవ్వండి."
మేం సాధారణంగా వినే మాటలివీ.. వీటిలో టీటీ ఇంజెక్షన్ గురించి సామాన్య ప్రజలకు ఉన్న అపోహలు అర్ధం అవుతున్నాయి.
అందుకే ఆ అపోహలను తొలిగించే ప్రయత్నం చేద్దాం.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
2.ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
మనం నిత్య వాడే సెల్ ఫోన్, టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎంతో కీలకం. ముఖ్యంగా స్క్రీన్ డిస్‌ప్లేలో ఎక్కువగా వాడుతుంటారు. సెమీ కండక్టర్ పరిశ్రమలో విరివిగా వినియోగిస్తుంటారు.
ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ భూమిలో లభించే అరుదైన మూలకాల (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్-ఆర్ఈఈ)ను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
హైదరాబాద్ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ)కి చెందిన సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పి.వి.సుందరరాజు బృందం ఆర్ఈఈపై కీలక పరిశోధన చేసింది. వీరి పరిశోధనలో అనంతపురం, చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఆర్ఈఈ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
3.ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమానా లేక తమిళ సినిమానా? ఇప్పుడు సందేహాలు ఎందుకు?
తూర్పు కనుమల్లోని పండే కాఫీ గింజలకు మంచి డిమాండ్ ఉంది.
ఇక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. ఈ తోటల్లో అంతరపంటగా మిరియాలు సాగు చేస్తారు గిరిజన రైతులు.
ప్రస్తుతం, అసలు పంట కాఫీ కంటే, అంతరపంట మిరియాలే రెట్టింపు లాభాలను ఇస్తున్నాయి. మిరియాలకు ఇంత డిమాండ్ ఎందుకొచ్చింది? మిరియాల సాగుకు ఐటీడీఏ ఎలాంటి సహకారం అందిస్తోంది?
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
4. కూల్ రూఫ్: వేడి, కరెంట్ బిల్లు రెండూ తగ్గుతాయని చెప్తున్న ఈ విధానం ఏమిటి? తెలంగాణలో అమలు ఎలా?
తెలంగాణ ప్రభుత్వం కూల్ రూఫ్ పాలసీ 2023-28 తీసుకువచ్చింది. ఈ విధానాన్ని తెలంగాణ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఇకపై రాష్ర్టంలో ఈ విధానం అమలులో ఉండే ప్రాంతాలల్లో 600 గజాలు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు కూల్ రూఫ్‌ల ఏర్పాటు తప్పనిసరి.
అలా నిర్మిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ పాలసీ ప్రారంభించిన సందర్భంగా ప్రకటించారు. కూల్ రూఫ్‌ల ఏర్పాటుకు చదరపు మీటరుకు రూ. 300 ఖర్చవుతుందని వివరించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
5. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
ఔషధాలకు లొంగని మొండి ఫంగస్ క్యాండిడా ఆరిస్ (సి. ఆరిస్)ను 15 ఏళ్ల క్రితమే తొలిసారిగా వైద్యులు గుర్తించారు. కానీ, నేడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆసుపత్రులను ఇది భయపెడుతోంది.
ఒకసారి ఇది శరీరంలోకి ప్రవేశిస్తే, ఈస్ట్ తరహాలో పనిచేసే ఈ ఫంగస్ రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థలు, అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకినవారిలో మరణాల రేటు 30 నుంచి 53 శాతం వరకు ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేస్తోంది.
ఇక్కడ ఆందోళనకర అంశం ఏమిటంటే.. ప్రస్తుతం అందుబాటులోనున్న సాధారణ యాంటీఫంగల్ ఔషధాలను తట్టుకొని ఈ ఫంగస్ నిలబడుతోంది. ఈ ఫంగస్‌లో కొన్ని రకాలపై ఏ ఔషధాలూ పనిచేయడంలేదని వైద్యులు చెబుతున్నట్లు బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గల్లఘెర్ వివరించారు.
30కిపైగా దేశాల్లో ఈ ఫంగస్ వ్యాపిస్తోందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేస్తోంది. 2009 నుంచి 2019 మధ్య ఈ ఫంగస్ కేసులు 4,750 ప్రపంచ వ్యాప్తంగా నమోదైనట్లు 2020లో నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)