వాలెంటైన్స్ డే: బొద్దింకకు మాజీ ప్రియుడి పేరు పెట్టిన యువతి

ప్రచురణ

ఈ ప్రేమికుల రోజున అమెరికాలోని ఒక జూ ఓ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది

టెక్సస్‌లోని శాన్ ఆంటోనియో జూలో ఏదైనా జంతువుకో, బొద్దింకకో, లేదా ఓ కూరగాయకో నామమాత్రపు డబ్బులు చెల్లించి మీ మాజీ ప్రేమికుడు లేదా ప్రేయసి పేరుపెట్టొచ్చు.

ఆ కూరగాయను అక్కడే ఉన్న జంతువులకు మీ కళ్ల ముందే తినిపించేస్తారు అక్కడి సిబ్బంది.

అందులో భాగంగానే తమ మాజీ ప్రేయసీ లేదా ప్రియుడి పేరును ఓ జంతువకు పెట్టే అవకాశం ఇచ్చింది.

దీంతో ఓ మహిళ తన మాజీ ప్రియుడి పేరును ఓ బొద్దింకకు పెట్టింది.

ఈ ఆలోచన ఆన్‌లైన్లో వైరల్ అవ్వగానే అమెరికానే కాక దేశవిదేశాల నుంచి కూడా నిధులు అందుతున్నాయని చెబుతున్నారు నిర్వహకులు. బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)