వాలెంటైన్స్ డే: బొద్దింకకు మాజీ ప్రియుడి పేరు పెట్టిన యువతి
ప్రచురణ
ఈ ప్రేమికుల రోజున అమెరికాలోని ఒక జూ ఓ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది
టెక్సస్‌లోని శాన్ ఆంటోనియో జూలో ఏదైనా జంతువుకో, బొద్దింకకో, లేదా ఓ కూరగాయకో నామమాత్రపు డబ్బులు చెల్లించి మీ మాజీ ప్రేమికుడు లేదా ప్రేయసి పేరుపెట్టొచ్చు.
ఆ కూరగాయను అక్కడే ఉన్న జంతువులకు మీ కళ్ల ముందే తినిపించేస్తారు అక్కడి సిబ్బంది.
అందులో భాగంగానే తమ మాజీ ప్రేయసీ లేదా ప్రియుడి పేరును ఓ జంతువకు పెట్టే అవకాశం ఇచ్చింది.
దీంతో ఓ మహిళ తన మాజీ ప్రియుడి పేరును ఓ బొద్దింకకు పెట్టింది.
ఈ ఆలోచన ఆన్‌లైన్లో వైరల్ అవ్వగానే అమెరికానే కాక దేశవిదేశాల నుంచి కూడా నిధులు అందుతున్నాయని చెబుతున్నారు నిర్వహకులు. బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:
- మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పనిచేశారు: అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్
- ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనిషికి ఎప్పటి నుంచి మొదలైంది?
- భూకంపాల నుంచి హైదరాబాద్ ఎంత వరకూ సురక్షితం?
- తుర్కియే, సిరియా భూకంపం: ఈ పిల్లల పేర్లేమిటో, వారి తల్లిదండ్రులెవరో తెలీదు..ఏం చేయాలి?
- బెలూన్: ఆకాశంలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరితే ఏమవుతుంది? ఇలాంటి బెలూన్ల తయారీకి ఎంత ఖర్చవుతుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



