You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
1. అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?
కొంతమంది ఎలుకలను చూస్తేనే అసహ్యించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎలుకలను రుచికరమైన ఆహారంగా చూస్తారు. ఏటా మార్చి 7న ఈశాన్య భారత్‌లోని ఒక మారుమూల గ్రామంలో ''యూనంగ్ ఆరాన్'' పేరుతో ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఇదో అద్భుతమైన వేడుక.
తమ ఇంటికి వచ్చే అతిథులకు ఇక్కడివారు ఎలుకలను వండి పెడతారు. ఇక్కడి గిరిజనులు ''బోలె బలాక్ ఉయింగ్'' పేరుతో ఒక వంటకం కూడా చేస్తారు. ఎలుక పొట్ట, పేగులు, కాలేయం, వృషణాలు, కాళ్లు, తోకకు ఉప్పు, కారం, అల్లం కలిపి దీన్ని వండుతారు. ఇళ్లలో కనిపించే ఎలుకలతో మొదలుపెట్టి అడవి ఎలుకల వరకు అన్నింటినీ తింటారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
2. ప్రపంచ కుబేరుని కథ: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు?
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు మైక్రో బ్లాగింగ్ సైట్ 'ట్విటర్'ను కొనుగోలు చేశాక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడు కాదు. ఆయన స్థానాన్ని ప్రజలకు పెద్దగా తెలియని ఒక వ్యక్తి ఆక్రమించారు. ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ ప్రకారం... 171 బిలియన్ డాలర్ల (రూ. 14,11,143 కోట్లు) నికర సంపదతో ఫ్రాన్స్ వ్యాపారవేత్త బెర్నార్ ఆర్నో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
ఇవి కూడా చదవండి
3. రిషి రాజ్‌పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి ఎంతో మంది సంస్కృత పండితులకు కొరుకుడు పడని ఒక వ్యాకరణ సమస్యను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన భారతీయ పీహెచ్‌డీ విద్యార్థి పరిష్కరించారు.
పాణిని బోధించిన నియమాన్ని 27 ఏళ్ల రిషి రాజ్‌పోపట్ డీకోడ్ చేశారు. పురాతన సంస్కృత భాషా నిపుణుడు పాణిని. ఆయన సుమారు 2,500 ఏళ్ల క్రితం నివసించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
4. ముద్దుపెట్టుకున్నందుకు మహిళకు రాళ్లతో కొట్టి చంపేలా మరణ శిక్ష.. చివరికి 6 నెలల జైలు శిక్ష
సూడాన్‌కు చెందిన ఒక మహిళ, ఒక వ్యక్తిని ముద్దు పెట్టుకున్నట్లుగా అంగీకరించడంతో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వ్యభిచారం అభియోగాలతో అరెస్ట్ అయిన ఆమెకు మరణశిక్ష తప్పింది.
20 ఏళ్ల ఆ మహిళకు తొలుత చనిపోయేవరకు రాళ్లతో కొట్టడం అనే శిక్ష విధించారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.
ఈ శిక్షను ''అంతర్జాతీయ చట్టం తీవ్ర ఉల్లంఘన''గా ఆఫ్రికన్ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ స్టడీస్ (ఏసీజేపీఎస్) వర్ణించింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
5. సిగరెట్ల రిటైల్ అమ్మకాలపై నిషేధం విధించడం సాధ్యమేనా.. అలా చేస్తే ఏం జరుగుతుంది?
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం .. సిగరెట్ ప్యాకెట్లు, గోడలు, బిల్ బోర్డులు, హోర్డింగులు, సినిమా థియేటర్లలో, ఇంకా అనేక మార్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది ప్రభుత్వం.
అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఆర్థిక మంత్రి ఎవరైనా సరే.. బడ్జెట్‌లో రెవిన్యూ పెంచుకునేందుకు సిగరెట్లు ఒక అవకాశం.
ప్రజారోగ్యంతో ముడిపడిన పొగాకు వినియోగాన్ని నియంత్రించడం ద్వారా తగ్గించాలనే విధానాన్ని అమలు చేస్తున్నారు పాలకులు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- నిర్భయ అత్యాచారానికి పదేళ్లు- దిల్లీ సామూహిక అత్యాచారం తర్వాత వీరి జీవితాలు మారిపోయాయి
- ‘‘జీతాలు పెరగలేదు.. రెండు ఉద్యోగాలు చేసినా పూట గడవటం కష్టమవుతోంది’’
- పాకిస్తాన్-లో డాలర్ కొరత... ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుంది
- భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన లఖ్-పత్ కోట గురించి మీకు తెలుసా-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)