రష్యా దాడి చేస్తుందనే భయంలో లాత్వియా

ప్రచురణ

లాత్వియాలో మునుపెన్నడూ చూడని విధంగా నేటో బలగాలను భారీగా మోహరించింది. రానున్న రోజుల్లో బాల్టిక్ దేశాలపై రష్యా దాడి చేస్తుందని నేటో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న లాత్వియా ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లో స్వతంత్ర దేశంగా ఉంది. లాత్వియా యుక్రెయిన్‌కు మద్దతిస్తోంది.

అయితే లాత్వియాలోని ప్రతీ నలుగురిలో ఒకరు రష్యన్. వీళ్లంతా సాంస్కృతికంగా రష్యాతో ముడిపడి ఉన్నారు.

తమ దేశంలో నివశిస్తున్న రష్యన్ల విషయంలో లాత్వియా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

నిర్భంధ సైనిక శిక్షణ గురించి కూడా చర్చించడం ప్రారంభించింది.

బీబీసీ ప్రతినిధి ఒక్సానా ఏంటోనెంకో అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)