ఫ్రాన్స్‌లో జరిగిన టెర్రరిస్టు దాడుల కేసులో ఆ దేశ న్యాయస్థానం జైలుశిక్షలు విధించింది.

ప్రచురణ

ఫ్రాన్స్‌లో 2015లో జరిగిన టెర్రరిస్టు దాడుల కేసులో ఆ దేశ న్యాయస్థానం 20 మందికి జైలుశిక్షలు విధించింది.

ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా జరిగిన విచారణ.

2015 ఒక ఇస్లామిస్ట్ గ్యాంగ్ పారిస్‌లో కాల్పులు, బాంబు పేలుళ్లకు పాల్పడి నూటముప్పై మందిని హత్య చేసింది.

బాతక్లాన్ కాన్సర్ట్ హాల్‌ను, నేషనల్ ఫుట్‌బాల్ స్టేడియాన్ని, బార్లను, రెస్ట్రాంట్లను సాయుధులు లక్ష్యంగా చేసుకున్నారు.

అయితే, దాడికి పాల్పడ్డవారిలో ఒకే ఒక్క వ్యక్తి సలాహ్ అబ్దెస్లామ్ ఆ రాత్రి ప్రాణాలతో బయటపడ్డాడు.

ఆతనికి అత్యంత అరుదైన యావజ్జీవ జైలు శిక్షను విధించింది ఫ్రెంచ్ కోర్టు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)