ఉడుమును రేప్ చేశారనే ఆరోపణలతో మహారాష్ట్రలో నలుగురి అరెస్ట్, ఇంతకీ ఏం జరిగింది
మహారాష్ట్రలోని సహ్యాద్రి పులుల అభయారణ్యంలో ఒక ఉడుముపై అత్యాచారం జరిగినట్లు వార్తలొచ్చాయి.
ఉడుమును బెంగాల్ మోనిటర్ లిజార్డ్ అంటారు. దీనికి సంబంధించి అటవీ అధికారులు నలుగురిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
రత్నగిరి జిల్లాలోని గోఠనే గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామం మహారాష్ట్రలోని సతారా, సాంగ్లి, కొల్హాపూర్, రత్నగిరి జిల్లాల పరిధిలో విస్తరించిన సహ్యాద్రి అభయారణ్యం పరిధిలోకి వస్తుంది.
చందోలి నేషనల్ పార్క్‌లో పులులను లెక్కించడానికి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలిస్తున్న సమయంలో అధికారులకు గోఠనే గ్రామానికి సంబంధించిన కెమెరా కనిపించలేదు.
అయితే ఆ కెమెరా చుట్టుపక్కలే ఏర్పాటు చేసిన మరో కెమెరా ఫుటేజిలో కొందరు ఆయుధాలతో అనుమానాస్పదంగా కనిపించారు. కెమెరా ద్వారా 2022 మార్చి 31న చందోలి నేషనల్ పార్క్‌లోకి నలుగురు అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. వీరి ఫోన్లను పరిశీలించడంతో తాజా ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- హాలీవుడ్ సెన్సేషన్ 'మెర్ల్ ఓబెరాన్': బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ భారతీయ తారను మనం మరిచిపోయామా?
- హనుమాన్ జయంతి: దిల్లీ జహాంగీర్‌పురీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, పోలీసులకు గాయాలు... 14 మంది అరెస్ట్
- తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం
- గవర్నర్ విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ఏంటి?
- కందుకూరి వీరేశలింగం: చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాశారు, 40 వితంతు వివాహాలు జరిపించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



