You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Cryonics: ‘నా తల్లి చనిపోయింది.. మైనస్ 196°C వద్ద వందేళ్లు భద్రం చేస్తా.. ఆమె మళ్లీ బతికొస్తుంది..’
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జంగ్ కిల్.. తన తల్లి మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రం చేశారు.
వందేళ్ల పాటు మృతదేహాన్ని భద్ర పరిచే ఒక సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు.
భవిష్యత్తులో మరణించిన వారిని కూడా సైన్స్ బ్రతికించగలదు అనే నమ్మకంతో ఈయన ఇలా చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 600 మృతదేహాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రం చేశారు.
క్రయానిక్స్ అంటే ఏమిటి?
మరణించిన వారి శరీరం, మెదడు పాడవకుండా వాళ్ల శరీరాలను ఫ్రీజ్ చేసి భద్రపరచడమే క్రయానిక్స్.
పేషెంట్ ఏ కారణంతో అయితే చనిపోయాడో, భవిష్యత్తులో మెడికల్ సైన్స్ దానికి పరిష్కారాన్ని కనుగొని, వాళ్లను తిరిగి బతికించడానికి క్రయానిక్స్ ఉపయోగపడుతుందని క్రయానిక్స్ టెక్నీషియన్స్ అంటున్నారు.
మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది.
సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, శరీరం పాడవడాన్ని అరికట్టడానికి శరీరానికి ఐస్ బాత్ చేయించాలి.
ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు.
ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, లిక్విడ్ నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిస్తారు.
ఇవి కూడా చదవండి:
- సముద్రంలో కూలిపోయిన హెలీకాప్టర్.. 12 గంటల పాటు ఈతకొట్టి, ప్రాణాలతో బయటపడ్డ 57 ఏళ్ల మంత్రి
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- హైదరాబాద్: సరుకులు కొంటే క్యారీ బ్యాగ్ ఉచితంగా ఇవ్వాల్సిందే.. డీమార్ట్‌కు జరిమానా - తెలంగాణ వినియోగదారుల ఫోరం
- కోతులు పగబట్టి 200 కుక్కపిల్లలను చంపింది నిజమేనా? లవూల్ గ్రామంలో అసలు ఏం జరిగింది?
- చలికాలం: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘తెలంగాణ మంత్రులు ప్రజల కోసం పని చేయకుండా, రాజకీయం చేయడానికే ఇష్టపడుతున్నారు’ - పీయూష్ గోయల్
- రూ. 5,500 కోట్ల పరిహారం ఇచ్చి ఆరో భార్యతో విడాకులు
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్‌కు రూ.1600 కోట్ల జరిమానా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- హంసా నందినికి క్యాన్సర్ : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా..
- ఒమిక్రాన్: 'జీవితం కోల్పోవడం కంటే... ఒక ఈవెంట్ రద్దు చేసుకోవడం మంచిది': డబ్ల్యూహెచ్ఓ చీఫ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)