You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాబుల్ వీధుల్లో బీబీసీ: ఒక పక్క మహిళలు.. మరోపక్క తాలిబాన్ ఫైటర్లు..
అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు తమ అదుపులోకి తీసుకున్న తర్వాత కాబుల్‌లో ప్రజా జీవితం ఎలా ఉందో తెలుసుకునేందుకు నగరంలోని ప్రధాన వీధిని, మార్కెట్‌ను సందర్శించారు బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీ.
ఆయన అందించిన వివరాల ప్రకారం..
కాబుల్ ప్రధాన వీధుల్లో దుకాణాలు మెల్లగా తెరచుకుంటున్నాయి.
కాబుల్‌ను తాలిబాన్లు ఆక్రమించుకున్న రోజుతో పోలిస్తే దుకాణాలు, వీధులు ఇప్పుడు కాస్త రద్దీగా కనిపిస్తున్నాయి.
అయితే, గిరాకీ గతంలో మాదిరిగా లేదని, ప్రజలు భయంతో ఉన్నారని స్థానిక వ్యాపారులు అంటున్నారు. గత కొద్ది రోజులతో పోలిస్తే ఫర్వాలేదని చెబుతున్నారు.
ఇక వీధుల్లో ఆడవాళ్లు తక్కువగా కనిపిస్తున్నారు. వారి వస్త్రధారణ సంప్రదాయబద్ధంగా ఉంది. కానీ ఒంటిని పూర్తిగా కప్పేసే బుర్ఖాను ధరించడం లేదు.
తాలిబాన్లు పని చేయనిస్తారో, లేదో తెలియక, మహిళా ఉద్యోగులను చాలా షాపులు ఇంటికి పంపాయి.
మరోవైపు సాయుధ తాలిబాన్లు అంతటా గస్తీ కాస్తున్నారు.
ప్రజలతో సత్సంబంధాల కోసం తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు తమ అధికారాన్ని సవాలు చేసే ఏ చర్యనూ సహించరనే భయాలు చాలా మందిలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కొత్త తాలిబాన్లు నిజంగానే మారారా? లేదా పీఆర్ టీమ్ సలహాతో మారినట్లు నటిస్తున్నారా?
- అఫ్గానిస్తాన్ శరణార్థులు రాకుండా సరిహద్దుల్లో కంచె వేసిన పాకిస్తాన్
- తాలిబాన్‌లోని బలమైన నాయకులు ఎవరు? వారి పాత్ర ఏంటి?
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అఫ్గానిస్తాన్: షరియా అంటే ఏమిటి, ఈ చట్టం మహిళల గురించి ఏం చెబుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)