కాబుల్ వీధుల్లో బీబీసీ: ఒక పక్క మహిళలు.. మరోపక్క తాలిబాన్ ఫైటర్లు..

వీడియో క్యాప్షన్, కాబుల్ వీధుల్లో బీబీసీ: ఒక పక్క మహిళలు.. మరోపక్క తాలిబాన్ ఫైటర్లు..
ప్రచురణ

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు తమ అదుపులోకి తీసుకున్న తర్వాత కాబుల్‌లో ప్రజా జీవితం ఎలా ఉందో తెలుసుకునేందుకు నగరంలోని ప్రధాన వీధిని, మార్కెట్‌ను సందర్శించారు బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీ.

ఆయన అందించిన వివరాల ప్రకారం..

కాబుల్ ప్రధాన వీధుల్లో దుకాణాలు మెల్లగా తెరచుకుంటున్నాయి.

కాబుల్‌ను తాలిబాన్లు ఆక్రమించుకున్న రోజుతో పోలిస్తే దుకాణాలు, వీధులు ఇప్పుడు కాస్త రద్దీగా కనిపిస్తున్నాయి.

అయితే, గిరాకీ గతంలో మాదిరిగా లేదని, ప్రజలు భయంతో ఉన్నారని స్థానిక వ్యాపారులు అంటున్నారు. గత కొద్ది రోజులతో పోలిస్తే ఫర్వాలేదని చెబుతున్నారు.

ఇక వీధుల్లో ఆడవాళ్లు తక్కువగా కనిపిస్తున్నారు. వారి వస్త్రధారణ సంప్రదాయబద్ధంగా ఉంది. కానీ ఒంటిని పూర్తిగా కప్పేసే బుర్ఖాను ధరించడం లేదు.

తాలిబాన్లు పని చేయనిస్తారో, లేదో తెలియక, మహిళా ఉద్యోగులను చాలా షాపులు ఇంటికి పంపాయి.

మరోవైపు సాయుధ తాలిబాన్లు అంతటా గస్తీ కాస్తున్నారు.

ప్రజలతో సత్సంబంధాల కోసం తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు తమ అధికారాన్ని సవాలు చేసే ఏ చర్యనూ సహించరనే భయాలు చాలా మందిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)