ఒకచోట లాక్‌డౌన్.. మరోచోట 'జాతర'.. కరోనా కంట్రోల్ అయ్యేనా?

ప్రచురణ

వారాంతపు లాక్‌డౌన్‌తో ముంబయిలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతాల్లో లాక్‌డౌన్ విధించింది.మహారాష్ట్రలో రోజూ 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబయి నగరంలోనే శనివారం 9,327 కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, తమిళనాడులోని చెన్నైలో ప్రజలు కోవిడ్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇది చెన్నైలోని కాసిమేడు చేపల మార్కెట్. ఇక్కడ ఎవరూ భౌతిక దూరం పాటించడంలేదు. చాలామంది మాస్కులు ధరించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)