You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్-19: మలద్వారం టెస్టులు చేస్తున్న చైనా, అభ్యంతరం చెప్పిన జపాన్
చైనాలో అడుగు పెట్టగానే తమ దేశ పౌరులకు మలద్వారం నుంచి శాంపిల్స్ తీసుకుని కోవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహించడం ఆపాలని జపాన్ కోరింది.
ఈ విధానం "మానసిక క్షోభకు" గురి చేస్తోందని కొందరు ఫిర్యాదు చేశారని జపాన్ అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిని చాలావరకూ అదుపులోకి తెచ్చిన చైనా జనవరిలో మలద్వారం (ఆనల్) స్వాబ్ టెస్టులు చేయడం ప్రారంభించింది.
అమెరికా దౌత్యవేత్తలకు కూడా ఇలాంటి పరీక్షలు చేశారని గతవారం అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, చైనా ఆ వార్తలను ఖండించింది.
"మలద్వారం స్వాబ్ టెస్టుల వల్ల తాము మానసిక వేదన అనుభవించామని కొందరు జపనీయులు చైనాలోని మా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఎంత మంది జపాన్ పౌరులు ఈ టెస్టుల బారిన పడ్డారో ఇంకా తెలియదు" అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ కట్సునోబు కటో తెలిపారు.
చైనాలో అడుగు పెట్టినవారికి, క్వారంటీన్‌లో ఉన్న కొందరికి ఈ ఆనల్ స్వాబ్ టెస్టులు నిర్వహించారు.
"ఈ టెస్టులు ఎంత ఉపయోగకరం అనేది ఇంతవరకూ ప్రపంచంలో ఎవరూ ధృవీకరించలేదు" అని కటో అన్నారు.
ఈ టెస్టులు నిర్వహించొద్దంటూ బీజింగ్‌లోని జపాన్ రాయబార కార్యాలయం చేసిన వినతికి చైనా ఇంతవరకూ స్పందించలేదు.
ఆనల్ స్వాబ్ టెస్టుల వల్ల "వైరస్ సోకినవారిని గుర్తించే రేటు పెరుగుతుందని" కొందరు స్థానిక చైనా నిపుణులు అంటున్నారు.
అయితే, ఈ పద్ధతిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ముక్కు ద్వారా చేసే స్వాబ్ టెస్టులతో పోలిస్తే మలద్వారం స్వాబ్ టెస్టులు అంత సమర్థవంతం కావని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఈ పద్ధతిని ప్రారంభించిన తొలిరోజుల్లో చైనా ప్రభుత్వ మీడియా ప్రచురించింది.
కరోనా వైరస్ నోటి ద్వారా లేదా ముక్కు ద్వారానే వ్యాపిస్తుంది కాబట్టి ఇంతవరకూ అమలులో ఉన్న కోవిడ్ పరీక్షలే సమర్థవంతమైనవని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఆనల్ స్వాబ్ టెస్టుల్లో 3-5 సెమీ (1.2-2.0 ఇంచులు) కాటన్ స్వాబ్‌ను మలద్వారంలోకి దూర్చి మెల్లిగా తిప్పుతూ శాంపిల్స్ సేకరిస్తారు.
ఇవి కూడా చదవండి
- వ్యాక్సీన్ తీసుకున్న వారి నుంచి ఇతరులకు కరోనావైరస్ సోకుతుందా?
- పతంజలి కరోనిల్: కరోనావైరస్కు విరుగుడు అనే ప్రచారంలో నిజమెంత?
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? మనం రోజూ తినే ఆహారంలో అదే ముఖ్యమైనదా?
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే..
- విజయనగరం: చనిపోయిన వృద్ధురాలికి పింఛన్ ఇచ్చిన గ్రామ వలంటీర్.. బతికే ఉన్నారంటున్న ఎంపీడీవో, చనిపోయారంటున్న కుటుంబసభ్యులు
- చైనా ఎందుకు ఏటా 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది?
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- బాయ్ ఫ్రెండ్ కోసం భార్య గొంతునులిమి చంపిన భర్త
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
- ‘గాంధీ ఎప్పుడూ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ పేరు పొందే అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)