ఆన్‌లైన్లో ఎన్నికలను నిర్వహించి చరిత్ర సృష్టించిన చిన్న దేశం

ప్రచురణ

యూరప్ ఖండంలోని ఎస్టోనియా ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ ఓటింగ్ అమలు చేసిన దేశంగా రికార్డు సృష్టించింది. ఈ దేశంలో 2005లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 2019 నాటికి ఆన్‌లైన్లో 44 శాతం ఓటింగ్ నమోదైంది.

ఆన్‌లైన్ ఓటింగ్ చాలా సులభమైన ప్రక్రియ. కౌంటింగ్ త్వరగా అయిపోతుంది. ఈ ఓటింగ్ టెక్నాలజీ యువతరాన్ని కూడా బాగా ఆకట్టుకుంటోంది.

అయితే, సైబర్ దాడుల వల్ల డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలకు ప్రమాదం ఉంటుందని కొందరు అంటున్నారు. హ్యాకర్లు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే దాన్ని మార్చేసే వీలుందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఎస్టోనియాలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి సమస్యలేమీ తలెత్తలేదు.

ఆన్‌లైన్ ఓటింగ్ విషయంలో ఈ చిన్న దేశం ప్రపంచానికి మార్గం చూపిస్తోందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)