సీఎం జగన్ నియోజకవర్గంలో యురేనియం తవ్వకాలు.. భయాందోళనల్లో ప్రజలు

ప్రచురణ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని తుమ్మలపల్లె పరిసరాల్లో యురేనియం తవ్వకాలపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, పంటలు సరిగా పండటం లేదని ఆవేదన చెందుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ ఇచ్చిన మాటను ఎవ్వరూ నిలబెట్టుకోలేదని వాపోతున్నారు. ప్రాణాలు పోయాక ఆదుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు.

యురేనియం తవ్వకాల విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మానవ హక్కుల కార్యకర్త కాకుమాను జయశ్రీ హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయస్థానం స్టే ఇచ్చింది. స్టేను తొలగించాలన్న యూసీఐఎల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ నిరవధికంగా వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)