కరోనావైరస్‌ను వాసనతో పసిగట్టేలా కుక్కలకు ప్రత్యేక శిక్షణ

ప్రచురణ

ఫిన్‌లాండ్‌లో కరోనావైరస్‌ సోకిన వారిని వేగంగా గుర్తించటానికి కుక్కలతో ఒక అధ్యయనం చేస్తున్నారు.

హెల్సింకిలో ప్రయాణికులు తమ మెడను ఒక వస్త్రంతో తుడుకుంటారు.

ప్రత్యేక శిక్షణ పొందిన శునకాల ముందు దానిని వేస్తారు.

ఆ శునకం మొరిగినట్లయితే ఆ వస్త్రంతో తుడుచుకున్న వారికి కరోనావైరస్ ఉన్నట్లు గుర్తించారు.

వారికి పరీక్షలు నిర్వహించి నిర్ధారించుకుంటున్నారు.

అయితే శునకాల సాయంతో వైరస్‌ను గుర్తించే ప్రక్రియ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)